S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమరయోధులు - అహింసావాదులు

1.లాల్‌బహదూర్ శాస్ర్తీ 1925లో విద్యాపీఠం నుండి పట్ట్భద్రుడయినపుడు ఏ పట్టా ఇచ్చారు?
ఎ.శాస్ర్తీ బి.బహదూర్
సి.స్కాలర్ డి.పండిట్
2.‘అతని లాంటి వారు మరో పదకొండు మంది ఉంటే ఒక సంవత్సరంలో స్వాతంత్య్రం పొందగలము’ అని గాంధీ ఏ స్వాతంత్య్ర సమరయోధుని పట్టుదల, దేశభక్తి, అంకితభావం చూసిన తరువాత అన్నారు?
ఎ.టంగుటూరి ప్రకాశం బి.పొట్టి శ్రీరాములు
సి.కొమరం భీమ్ డి.సుద్దాల హనుమంతుడు
3.దండి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూవ్‌మెంట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమయంలో సర్దార్ పటేల్ అనేకసార్లు జైలుశిక్ష విధించారు. సర్దార్ పటేల్ అసలు పేరు ఏమిటి?
ఎ.వల్లభాయ్ ఝౌబార్ పటేల్
బి.వల్లభాయ్ హితోవ్ పటేల్
సి.వల్లభాయ్ విదుర్ పటేల్
డి.వల్లభాయ్ విభీనా పటేల్
4.వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని 31 అక్టోబర్‌న రాష్ట్రీయ ఏక్తా దివస్‌గా ప్రకటించారు. అతనికిచ్చిన బిరుదులేమిటి?
ఎ.ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా
బి.యూనిఫైయర్ ఆఫ్ ఇండియా
సి.్భరతదేశం యొక్క ఏకీకరణ ప్రధాన కమాండర్ ఇన్ చీఫ్
డి.పైవన్నీ
5.స్వాతంత్య్ర సమరయోధుడు, మహామాన, పండిట్ మదన్‌మోహన్ మాలవ్యా ఏ విశ్వవిద్యాలయం స్థాపించారు?
ఎ.బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
బి.అలహాబాద్ విశ్వవిద్యాలయం
సి.ఉత్కల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్
డి.దీన్ దయాళ్ ఉపాధ్యాయ విశ్వవిద్యాలయం, గోరఖ్‌పూర్
6.జాతీయ చిహ్నంపై లిఖించబడిన, జాతీయ నినాదం అయిన ‘సత్యమేవ జయతే’ అనే పదబంధాన్ని మాలవ్యా కనుగొన్నారు. ‘సత్యమేవ జయతే’ ఏ ఉపనిషత్తు నుండి స్వీకరించారు?
ఎ.సూర్యోపనిషద్ బి.కేనా ఉపనిషద్
సి.ఈషా ఉపనిషద్ డి.ముండక ఉపనిషద్
7.చక్రవర్తి రాజ గోపాలచారిని రాజాజీ అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో ఏది సరియైనది?
ఎ.్భరతదేశం పౌరుడు అయినటువంటి వ్యక్తి మొదటిసారి గవర్నర్ జనరల్ అయ్యారు
బి.నాగపట్నం వద్ద ఉప్పు సత్యాగ్రహం చేశారు. రౌలట్ చట్టంపై ఆందోళనలో పాల్గొన్నారు
సి.్భరతదేశ చివరి గవర్నర్ జనరల్ డి.పైవన్నీ
8.దాదాభాయ్ నౌరోజిని ఏమని పిలిచేవారు?
ఎ.గ్రాండ్ ఓల్డ్‌మాన్ ఆఫ్ ఇండియా
బి.్ఫదర్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్
సి.ది ప్రామిస్ ఆఫ్ ఇండియా
డి.పైవన్నీ
9.ఏ.ఓ.హ్యూమ్‌తోపాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనలో దాదాభాయ్ నౌరోజికి కీలక పాత్ర ఉంది. ఆయన గూర్చి క్రింది వానిలో ఏది సరియైనది?
ఎ.వయోజనులకు, మహిళలకు విద్య నేర్పించడంలో కృషి చేశారు
బి.ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసిన మొదటి భారతీయుడు
సి.ఆయన ఆరు దశాబ్దాలపాటు భారత స్వాతంత్య్ర పోరాటం, రాజకీయాల కోసం కృషి చేశారు
డి.పైవన్నీ
10.ఏ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి జయంతి పురస్కరించుకుని నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించారు?
ఎ.మొహమ్మద్ అలీ కుర్రిమ్ చాగ్లా
బి.డా.కె.ఎల్.శ్రీమాలి
సి.అబ్దుల్ కలామ్ ఆజాద్
డి.్ఫక్రుద్దీన్ అలీ అహ్మద్

గత వారం క్విజ్ సమాధానాలు:
=====================
1.ఎ 2.ఎ 3.ఎ 4.డి 5.బి 6.సి 7.డి 8.డి 9.డి 10.డి.

-సునీల్ ధవళ 97417 47700