S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

లోకమాన్య తిలక్

1.బాలగంగాధర్ తిలక్ (కాంగ్రెస్) మరియు మహమ్మద్ అలీ జిన్నా (ముస్లింలీగ్) ఏ ఒప్పందం కుదిర్చి సంతకం చేశారు?
ఎ.అమృత్‌సర్ ఒప్పందం
బి.కరాచీ ఒప్పందం
సి.కాంగ్రెస్-లీగ్ సహకార ఒప్పందం
డి.లక్నో ఒప్పందం

2.‘లోకమాన్య’ అనే బిరుదు పొందిన తిలక్, ఏ పత్రిక ప్రారంభించి బ్రిటీష్ వారి దురాగతాలను నిర్భయంగా రాసేవారు?
ఎ.మహారాష్ట్ర ఆంగ్ల పత్రిక, కేసరి మరాఠీ పత్రిక
బి.మహారాష్ట్ర గెజెట్ ఆంగ్ల పత్రిక, మరాఠా మరాఠీ పత్రిక
సి.లోకమాన్య ఆంగ్ల పత్రిక, కేసరి మరాఠీ పత్రిక
డి.పేట్రియాట్ ఆంగ్ల పత్రిక, లోక్‌సత్తా మరాఠీ పత్రిక

3.ఈ క్రింది అంశాలలో బాలగంగాధర్ తిలక్ వృత్తి గురించి ఏది వివరిస్తుంది?
ఎ.ఆయన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు మరియు ఖగోళ శాస్తవ్రేత్త
బి.అతను ఒక గణితవేత్త, న్యాయవాది, సామాజిక సంస్కర్త మరియు తత్త్వవేత్త
సి.పాత్రికేయుడు మరియు స్వాతంత్య్ర సమర యోధుడు
డి.పైవన్నీ

4.తిలక్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులలో ఒకరు. 1885లో, డిఈఎస్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఏ కళాశాలకు బొంబాయి ప్రెసిడెన్సీ గవర్నర్ పేరు పెట్టారు?
ఎ.ఫెర్గుస్సన్ కళాశాల, పూణె
బి.విల్లింగ్టన్ కళాశాల, సాంగ్లి
సి.నాల్మల్ ఫిరోడ్యలా ‘లా’ కాలేజ్, పూణె
డి.ఎల్ఫిన్స్టోన్ కళాశాలు, బొంబాయి

5.విప్లవ స్వాతంత్య్ర సమరయోధుల త్రయం ‘లాల్-బాల్-పాల్’గా ఎవరు సూచించబడ్డారు?

ఎ.కుబేర్‌నాథ్ రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్
బి.లాలాలజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు దేబి ప్రసాద్ పాల్
సి.రాజా రామ్‌మోహన్ రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు క్రిస్టోదాస్ పాల్
డి.లాలాలజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్

6.తిలక్‌ను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసి ఆరు సంవత్సరాలపాటు మాండలే కారాగారంలో ఉంచారు. మాండలే ఎక్కడ ఉంది?
ఎ.బంగ్లాదేశ్ బి.బర్మా (మయన్మార్)
సి.అండమాన్ నికోబార్ దీవులు డి.పాకిస్తాన్

7.ఆగస్టు 1, 1920లో తిలక్ పరమపదించారు. క్రింది రచనలలో బాలగంగాధర్ తిలక్ రచించినవేవి?
ఎ.ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్
బి.ద ఓరియన్
సి.గీతా రహస్య
డి.పైవన్నీ

8.2007లో, తిలక్ యొక్క 150వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా ఆర్‌బిఐ ఏ నాణెం విడుదల చేసింది?
ఎ.1 రూపాయి నాణెం బి.2 రూపాయి నాణెం
సి.5 రూపాయి నాణెం డి.10 రూపాయి నాణెం

9.బాలగంగాధర్ తిలక్ 1916లో హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఏ మరో వ్యక్తి కూడా హోమ్‌రూల్ ఉద్యమాన్ని విడిగా ప్రారంభించారు?
ఎ.అనిబిసెంట్ బి.గోపాలకృష్ణ గోఖలే
సి.తాంతియాతోపె డి.చంద్రశేఖర్ ఆజాద్

10.బాలగంగాధర్ తిలక్ మహారాష్టల్రోని రత్నగిరిలో జులై 23, 1856న జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన తిలక్ యొక్క అసలు పేరు ఏమిటి?
ఎ.బాలసుబ్రహ్మణ్య గంగాధర తిలక్
బి.మాధవ్ గంగాధర్ తిలక్
సి.బలభద్ర గంగాధర్ తిలక్
డి.కేశవ్ గంగాధర్ తిలక్
*
గత వారం క్విజ్ సమాధానాలు

1.ఎ 2.బి 3.ఎ 4.డి 5.ఎ 6.డి 7.డి 8.డి 9.డి 10.సి 11.డి 12.డి

-సునీల్ ధవళ 97417 47700