S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాటకరంగ దిగ్గజం బళ్లారి

1.బళ్లారి రాఘవ ఒక తెలుగు మరియు కన్నడ నాటక రంగానికి పితామహుడు. రాఘవ ఏయే భాషల్లో నాటకాలలో పాల్గొన్నారు?
ఎ.తెలుగు, కన్నడ
బి.తెలుగు, కన్నడ, హిందీ
సి.కన్నడ, తెలుగు, ఇంగ్లీష్
డి.తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ

2.బళ్లారి రాఘవ ఆగస్టు 2, 1880న జన్మించాడు. అతని అసలు పేరు ఏమిటి?
ఎ.తాడిపత్రి రాఘవాచార్యులు
బి.మరువాడ రాఘవేంద్రరావు
సి.గన్నవరపు రాఘవాచారి
డి.బత్తెన రఘురామయ్య

3.బళ్లారి రాఘవ ఒక అద్భుతమైన నటుడు, నాటక రచయిత మరియు దర్శకుడు. ఆయన కుటుంబ పోషణ కోసం ఏ వృత్తి నిర్వహించేవారు?
ఎ.గుడిలో ప్రధాన అర్చకుడు
బి.రైల్వే స్టేషన్ మాస్టర్
సి.న్యాయవాది
డి.ఉపాధ్యాయుడు

4.బహుముఖ ప్రజ్ఞాశీలి ఐన బళ్లారి రాఘవ ఏయే రంగాలలో నాటకాలకి మొగ్గు చూపేవారు?
ఎ.పౌరాణికం బి.చారిత్రాత్మకం
సి.సామాజిక నేపథ్యం డి.పైవన్నియు

5.బళ్లారి రాఘవ అమెచ్యూర్ డ్రమాటిక్ అసోసియేషన్‌ను ఏ ప్రదేశంలో స్థాపించారు?
ఎ.బొబ్బిలి బి.బళ్లారి
సి.బెంగళూరు డి.బందరు

6.విదేశీ రంగస్థల పరిణామాలు, పోకడలు బళ్లారి రాఘవని అమితంగా ఆకట్టుకొనేవి? ఏ ప్రముఖ రంగస్థల వ్యక్తులతో కలిసి ఆంగ్ల నాటకాలలో పాల్గొనడానికి అతను లండన్ సందర్శించారు?
ఎ.లారెన్స్ ఆలివర్
బి.్ఫర్బ్స్ - రాబర్ట్‌సన్
సి.బెర్నార్డ్ షా
డి.పైవన్నియు

7.నాటక రంగం పోషణ, అభివృద్ధి కొరకు కృషితోపాటు బళ్లారి రాఘవ ఒక సామాజిక సంస్కర్త. ఆయన గురించి క్రింది వానిలో ఏది సరియైనది?
ఎ.మహిళలు కూడా పురుషులతో సమానమే కాబట్టి మహిళలు కూడా నాటకంలో పాత్రలు పోషించాలని ప్రోత్సహించారు. నాటక రంగస్థలానికి మహిళలను పరిచయం చేశారు
బి.ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి వివిధ దేశాలను సందర్శించి భారతీయ నాటక కళపై ఉపన్యాసాలు ఇచ్చారు
సి.వెనుకబడిన వర్గాల వారి కోసం రాత్రులు చదువు చెప్పే వయోజన విద్యా పాఠశాలను ప్రారంభించాడు
డి.పైవన్నియు

8.రాఘవగారు బళ్లారిలో ఏ క్లబ్ స్థాపించి ఆంగ్ల నాటకాలు వేస్తూండేవారు?
ఎ.ఎడ్విన్ ఫారెస్ట్
బి.హెన్రీ ఇర్వింగ్ క్లబ్
సి.షేక్స్‌స్పియర్ క్లబ్
డి.బెర్నార్డ్ షా క్లబ్

9.నాటక రంగానికి ఆయన చేసిన సేవ తెచ్చిన కీర్తికి గుర్తింపుగా నాట్యకళాప్రపూర్ణ అనే బిరుదునిచ్చారు. బళ్లారి రాఘవగారు ఏ సినిమాలలో నటించారు.
ఎ.సరిపడని సంగతులు, జీవితమే ఒక నాటకం, కళామతల్లి
బి.నాటకం వేద్దాం రండి, మహిళలూ ముందుకు పదండి
సి.ద్రౌపది మానసంరక్షణం, చంద్రిక, రైతు బిడ్డ
డి.పైవన్నియు

10.బళ్లారి రాఘవ గారి జీవిత చరిత్రను ఎవరు రచించారు?
ఎ.ఆకెళ్ల కృష్ణమూర్తి
బి.క్రొవ్విడి లింగరాజు
సి.వేగుంట మోహన్‌రావు
డి.డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్ర్తీ
*
గత వారం క్విజ్ సమాధానాలు
*
1.డి 2.డి సి.బి 4.ఎ 5.డి 6.సి 7.డి 8.సి 9.డి 10.డి

-సునీల్ ధవళ 97417 47700