S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బంతి (సండేగీత)

ప్ర తి పనిలో విజయాలు వుండవు.
ప్రతి రోజూ విజయాలు వుండవు.
గెలుపు ఎప్పుడూ మనది కాదు.
కొన్నిసార్లు విజయాలు ఉంటాయి.
మరికొన్నిసార్లు అపజయాలు వుంటాయి.
నిన్నటి టెన్నిస్ ప్రపంచ విజేత
నేడు రెండో స్థానంలోకి పోవచ్చు.
ఇవన్నీ సహజం.
మన జీవితంలో ఎన్నో వస్తువులని చూస్తుంటాం. ఆట వస్తువులని చూస్తుంటాం.
అవి మనకు స్ఫూర్తిని కలిగించాలి. చూసే కన్ను వుంటే అవి స్ఫూర్తిని కలిగిస్తాయి.
అలాంటివి ఎన్నో వున్నాయి. మనం చిన్నప్పుడు బాగా ఇష్టపడే బెలూన్‌ని, రబ్బరు బంతిని చూద్దాం. బెలూన్ కింద పడితే ఎగరదు. గాలి వీస్తే తప్ప అది ఎగిరే అవకాశం లేదు.
బంతి అలా కాదు. ఎంత గట్టిగా కింద పడితే అది అంతలా పైకి లేస్తుంది. ఎంత గట్టి ప్రదేశం మీద పడితే అంత పైకి లేస్తుంది.
బంతి మనకు స్ఫూర్తి కావాలి. మనకు అపజయాలు ఎదురైనప్పుడు, నీరస పడినప్పుడు గుర్తుకు రావాలి. అంటే మనం పైకి ఎగరడానికి అది గుర్తుకు రావాలి.
ప్రతిరోజూ మనం అనుకున్నట్లు జరగదు.
ప్రతి పని మనం అనుకున్న విధంగా ముందుకు పోదు.
అయినప్పటికీ ప్రతిరోజూ మనం తీవ్రంగా కృషి చేయాలి.
అది ఈ రోజే కాదు.
రేపు చేయాలి.
ఆ మరునాడూ చేయాలి.
తప్పక ఫలితం ఉంటుంది.
క్రింద పడినప్పుడల్లా బంతిలా పైకి లేవాలి.
అంతే!

‘జింబో’ 94404 83001