S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘తొలిమలుఫు’తో కొత్త జీవితం

1960: రచనా.. పత్రికా రచనా? ఏది లక్ష్యం?
పెద్దవాణ్నై మేడం నేల్లీ గారి గురించి తెలుసుకున్నాక లెంపలు వేసుకున్నాను. గాంధీజీ అంతేవాసిగా ఆమె మన (తన అత్తవారి) దేశానికి వచ్చి గాంధీగారి ఖాదీ ఉద్యమానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. లక్ష్మణరావు గారికి మా నాన్నగారి మీద ఉన్న అభిమానం నా మీద గల వాత్సల్యం అపారం. మహనీయులు ఆ దంపతులతో గల అనుబంధం.. ఆంధ్రా సిమెంట్స్‌తోనే ఆగిపోలేదు. 1960లో నేను రాసిన ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ నవల ‘తొలిమలుపు’ ప్రాక్టికల్‌గా నా రూటే మార్చేసింది. నేను తొలిమలుపు వీరాజీని అయిపోయాను. ‘తంతే బూర్లగంపలో పడ్డాడట వెనుకటికొకడు’ అట్లా నా ‘తొలి మలుపు’ని మాస్కో నుంచి ఉప్పల లక్ష్మణరావు గారు రష్యన్ భాషలోకి - కలకత్తా నుంచి బొమ్మన విశ్వనాథంగారు బెంగాలీ భాషలోకి - ఇంత పిసరు - నా ప్రమేయం ప్రయత్నం లేకుండానే ప్రచురించారు. నా ఫస్ట్ టర్న్ ఆఫ్ లైఫ్‌ని (నవలని) ఆధునిక స్వతంత్ర తెలుగు నవలా సాహిత్యంలో ఒక మెరుపుగా - ఒక కొత్త మలుపుగా అభివర్ణిస్తూ - సాహితీ రంగంలో హేమాహేమీలైన పెద్దలు విమర్శకులు - విశే్లషకులు నా మెడలో వీరతాళ్లు వేశారు. నవలలు కథలు - థాంక్స్ టు విశాలాంధ్ర డైలీ - కలం చిందులు అనే కవితా శీర్షిక కూడా ఇచ్చారు.
నా సాహితీ, పత్రికారంగ ప్రవేశానికి ఇది ఒక ‘ప్రివ్యూ ఝలక్’ అన్నమాట.. ప్రస్తుతానికి ‘ఈ సీను’ కట్ టు 1951 - 1954 భ్రమరాంబ మల్లేశ్వరి గ్రంథాలయం.
మా పెద్ద మామయ్య భార్య రమణ(మ్మ). గుంటూరు జిల్లా ముక్కామల వారి అమ్మాయి- బాల్య వితంతువు.. మామయ్య ఫాక్టరీలో ఎవరితోనో చెబుతూ వుంటే విన్నాను.. సంఘ సంస్కర్తగా ఇటు పేరు.. అటు చక్కని ఇల్లాలు దక్కాయిరా అబ్బాయ్! పొలం ఫలసాయం కూడా లభిస్తాయి’ అది మామయ్య మాటల సారాంశం.
మా పెద్దత్తకి ఇంట్లో తోచుబడి ఉండేది కాదు.. ఓ పెద్ద హెచ్‌ఎంవి వారి గ్రామఫోను వుండేది. అదో భోషాణం అంత ర్యాకు మీద. ఒకేసారి తొమ్మిది రికార్డులు పెడితే.. ఒకటి అయిపోగానే మరొకటి.. ఇలా దాని తల లేచి - ఎస్ ఆకారంలో వున్న దాని బాడీ తిప్పుకుని మరో రికార్డు వచ్చి ప్లేటు మీద పడ్డాకా తిరిగి వచ్చి పాట మొదలుపెట్టేది. అది ఎలక్ట్రానిక్ యుగం కాదు. కరెంటు దీపాలు ఉంటేనే ఇంట్లో గ్రేటు. చెప్పానుగా.. హిందీ సినిమా రికార్డులు (ఆఫ్రికన్ షాప్’లో విడుదల అయింది అంటే చాలు- కొనేసుకొనేవాడు కాని మామాజీ - అవన్నీ హిందీ పాటలు.. కాకపోతే, తెలుగులో లవకుశ, పాదుకా పట్ట్భాషేకం, చింతామణి, కృష్ణ తులాభారం లాంటి ‘సెట్’లు ఒక్కో సెట్‌కి మూడు నుంచి ఆరు రికార్డులు వరుసగా పాటా పద్యం సంభాషణలు వగైరాతో గొప్ప ఆకర్షణ... కొన్ని ప్రైవేటు రికార్డులు.. కాఫీ క్లబ్బులు మరిగీ.. అనే హాస్యరస భరిత కామెడీ సెట్లూ.. టంగుటూరి సూర్యకుమారి పాటలు.. సూరిబాబుగారి తారా శశాంకం పద్యాలు - ఘంటసాల గారి అమ్మా సరోజినీదేవి.. లాంటి ప్రైవేట్ సాంగ్స్.. పంకజ్ మల్లిక్ హాయి బహారాయి బహార్.. సోజా రాజకుమారీ విసుగు (అప్పటికి బోరు అన్నమాట పుట్టలేదు) ఆవిడ సైగల్ వద్దూ వాడి సైగలూ వద్దు అనేది. అందుకని - నేనో సలహా ఇచ్చాను. (బాల రచయితని కదా?) ఇంగ్లీషులో మా ‘్ఫదర్’ తెచ్చిన స్క్రీన్ (ఇది ఎక్‌ప్రెస్ వాళ్లది) అలాగే గ్లేజ్ పేపరు సినీ అడ్వాన్స్ - ఇక మాగ్జీన్స్ అన్నీ ఇలా కళ్లల్లో పడే ఉంగరాల జుట్టు ఎగదోసుకుంటూ చదవడం గొప్ప అనుకుంటూ వుండేవాణ్ణి. అత్తని ఒప్పించాను మొత్తానికి అంటే మా లైబ్రరీకి - అనగా భ్రమరాంబ గ్రంథాలయంలో పది రూపాయలు డిపాజిట్ కడితే వారానికో రెండు పుస్తకాలు ఇంటికి ఇస్తారు. - తేడానికి నేనున్నానుగా అత్తా.. అక్కడ కొవ్వలి నవలలు జంపన నవలలు - కుప్పలు. శరత్‌బాబు బుక్స్ బండెడు అంటూ ఊరించి మెంబర్‌షిప్ కార్డు తెచ్చాను. గ్రామఫోన్ సిరీస్‌లాగే నవల్స్ కూడా సెట్స్ ఉండేవి. కొవ్వలి వారి - ఇంతీ చామంతీ పూబంతి - సెట్ హిట్టు.. వాడే వీడూ కాలూరాయి నేనే.. ఒక బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్న అనువాదం. ఇట్లా ఈ పుస్తకాలు తేవడం నాకు నచ్చిన దొకటి, అత్తమ్మ కొకటి.
అత్త అల్లికలలో ఎక్స్‌పర్ట్.. నాకో బనీను కూడా అల్లింది. దారం సూదులు తేవడం కూడా నా వంతే.. నేనూ అల్లికలో గొలుసు వెయ్యడం - సింపుల్‌గా అల్లడం నేర్చేసుకున్నాను. నాడు హాబీలివి. ఖాళీ సిగరెట్ పెట్టెలతో గుమ్మాలకి గొలుసులు అల్లేవాళ్లం. ఏనుగు బొమ్మా కుక్కబొమ్మల సెట్టూ చెయ్యడం మా మేనత్తలకీ వచ్చును.
సరే, కొన్ని వందల హిందీ పాటల దొంతర వుండేది... గ్రామఫోను ఒక చీకటి గదిలో ఉండేది. ఆ గదిలోకి పగటిపూట వెళ్లాలి అంటేనే భయం. అయినా, రాత్రి బెడ్‌లైట్ పెట్టుకుని రికార్డులు వినేవాణ్ణి.
ఓఓ... బచ్‌పన్ కే దిన్ భళా న దేనా.. ఆజ్.. హానే్స.. కల్ రులాన దేనా.. (బాలకండ మరచిపోకు.. ఇవాళ్టి నవ్వుల్నీ రోదనగా మార్చకు) పాట ఇష్టం నాకు.. (దీదార్ సినిమా నౌషాద్ అలీ సంగీతం.. లతామంగేష్కర్, శంషాద్ బేగంల పాట) నా బాల్యమిత్రులు మరుపునకు రానివాళ్లు నా మీద ప్రభావం చూపెట్టిన వాళ్లు ఇప్పుడు హృదంతరాళం నుంచి జ్ఞాపకాల గంటలు కొడుతున్నారు. (ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com