S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అత్యవసర నిధి

చాలా సీరియస్‌గా ఉండే 108కు ఫోన్ చేశాం. ఆస్పత్రిలో చేర్పించారు. ముందు పాతిక వేలు డిపాజిట్ చేయమన్నారు. కాళ్లు చేతులు ఆడలేదు. ఇంట్లో రెండు వేలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి ఆస్పత్రిలో చేర్పించాం. గండం గట్టెక్కింది.
***
ప్రైవేటు సంస్థలో మంచి ఉద్యోగం. ఏం జరిగిందో అమెరికా విధానాల్లో ఏవో మార్పులు జరిగాయట! ఇండియాలో మా వాడి ఉద్యోగం పోయింది. ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. బంధువులను అడిగినా సహాయం చేయలేదు. అప్పటి వరకు నువ్వే మా ప్రాణం అన్న మిత్రులు ముఖం చాటేశారు. ఎలాగోలా ఇంట్లో ఉన్నవి అమ్ముకుని రోజులు గడిపాం.
***
కొంచం అటూ ఇటుగా ఇలాంటి సంఘటనలు మన జీవితంలో, మన చుట్టూ ఉన్న వాళ్ల జీవితంలో చాలానే జరుగుతుంటాయి. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు బంగారాన్ని తాకట్టుపెట్టి గండం నుంచి బయటపడడం మన జీవితంలో సర్వసాధారణం. అలా తాకట్టు పెట్టేందుకు బంగారం కూడా లేని వారు చాలా మందే ఉంటారు. మరి ఇలాంటి సందర్భం వస్తే. అనారోగ్యం అంటే ఆరోగ్య బీమా ఉండవచ్చు. అత్యవసర ఖర్చుకు క్రెడిట్ కార్డు ఉండొచ్చు. మరి హఠాత్తుగా చేస్తున్న ఉద్యోగం పోతే.
ఏదీ చెప్పి రాదు.
1980 ప్రాంతంలో బజాజ్ చేతక్ స్కూటర్ కావాలంటే డీలర్ వద్ద బుక్ చేసుకుని ఓ పదేళ్లపాటు నిరీక్షిస్తే కల ఫలించేది. 90వ దశకం వరకు కూడా బజాజ్ రాజ్యం ఏలింది. హమారా బజాజ్ అనే ప్రకటన ఇప్పటికీ చెవుల్లో గింగురు మంటుంది. సెల్‌ఫోన్‌లు వచ్చిన కొత్తలో నోకియా కాకుండా ఇంకో సెల్‌ఫోన్ కూడా కొంటారా? అనిపించేది.
పదేళ్లు నిరీక్షిస్తే కానీ దొరకని బజాజ్ స్కూటర్ మార్కెట్‌లో వచ్చిన మార్పులతో కాలగర్భంలో కలిసిపోయింది. నోకియా అంతే. అద్భుతమైన కంపెనీ అనుకున్నవి కూడా మార్పుల్లో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. మరి అలాంటి కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల పరిస్థితి. మంచి జీతం నెల నెలా ఒకటో తారీఖున బ్యాంకు ఖాతాలో పడేప్పుడు ఒక రకమైన జీవితానికి అలవాటు పడిపోతాం. అలాంటి ఉద్యోగం ఏదో ఒక రోజు పోతే. గతంలో పరిస్థితి వేరు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు సర్వసాధారణం. కంపెనీ మూత పడినా ఉద్యోగం పోతుంది. కంపెనీ అద్భుతంగా ఉన్నా ఏదో ఒక కారణంతో ఉద్యోగం ఊడవచ్చు. ఇప్పుడు ఏదీ శాశ్వతం కాదు. ఉద్యోగం పోవడం కావచ్చు, ఆరోగ్య సమస్య, కుటుంబంలో ఎవరికైనా అత్యవసరంగా ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు. ప్రమాదం వల్ల తాత్కాలికంగా ఉద్యోగానికి దూరంగా ఉండడం కావచ్చు. అదీ ఇదీ అని కాదు. అత్యవసర సమస్య ఏదైనా ఎదురు పడవచ్చు. మీరు అదృష్టవంతులు అయితే జీవితంలో ఇలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోవచ్చు. అయినా అత్యవసర నిధి అవసరం.
ఎప్పుడైనా ఏదైనా అత్యవసరం పడవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిపుణలు ప్రతి వ్యక్తి వద్ద అత్యవసర నిధి ఉండాలి అంటారు.
ఎలాంటి అవసరం అయినా కావచ్చు. ఊహించని ఖర్చు వచ్చి పడుతుంది. అలాంటి ఖర్చు కోసం ప్రతి కుటుంబానికి అత్యవసర నిధి అత్యవసరం.
దేశంలో 60 శాతం మంది ప్రజల వద్ద తక్షణం కేవలం ఐదువేల రూపాయల డిపాజిట్ మాత్రమే బ్యాంకుల్లో ఉంటుందని ఒక అంచనా. కేవలం ఐదువేల రూపాయల అత్యవసర నిధి వారి వద్ద ఉన్నట్టు.
అత్యవసర అవసరం ఏర్పడినప్పుడు చుట్టు పక్కల వారిని, మిత్రులను సహాయం అడగాలంటే మోహమాటం. అడిగినా ఇస్తారనే నమ్మకం ఉండదు. ఎందుకంటే వాళ్లు కూడా మనలాంటి వాళ్లే. మరేం చేయాలి. ఇలాంటి సమస్యలను ఊహించే ఆర్థిక నిపుణులు పత్రి కుటుంబానికి తమ ఆదాయానికి తగ్గట్టు ఎమర్జన్సీ ఫండ్ ఉండాలని చెబుతున్నారు. మరి ఎంత ఉండాలి అంటే? మన జీతాన్ని, ఆదాయాన్ని బట్టి అత్యవసర నిధి ఉండాలి. మన ఆదాయం కానీ, జీతం కానీ ఎంత ఉంటే దానికి ఆరు రేట్లు అత్యవసర నిధి ఉండాలనేది నిపుణుల అభిప్రాయం. అంటే మీ ఆదాయం నెలకు 50 వేల రూపాయలు అయితే కనీసం మూడు లక్షల రూపాయల అత్యవసర నిధి మీకు అందుబాటులో ఉండాలి. ఇది ఎలా సాధ్యం అంటే నెలకు 50వేల రూపాయల జీతం అయితే కనీసం వాటిలో 20 వేల రూపాయలు ప్రతినెల అత్యవసర నిధి కింద కేటాయిస్తే, పదిహేను నెలల్లో మూడు లక్షల రూపాయలు అవుతాయి. భారతీయుల సగటు పొదుపు 30 శాతం. అంటే 50వేల జీతం అయినప్పుడు కనీసం నెలకు పదిహేను వేల రూపాయల పొదుపు చేస్తారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా. రెండేళ్ల పొదుపుతో మూడు లక్షల రూపాయల అత్యవసర నిధి ఏర్పడుంది. తొలుత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకుని ఆ తరువాత 15వేల రూపాయల పొదుపును మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ ఇతర వాటిలో కానీ ఇనె్వస్ట్ చేయవచ్చు. క్రెడిట్ కార్డు, వారాంతపు హోటల్స్ తిండి, ప్రయాణాలు ఎప్పుడైనా చేయవచ్చు కానీ వీటన్నింటి కన్నా ముందు భరోసాగా బతికే విధంగా అత్యవసర నిధి అవసరం.
ఎంత మంచి స్నేహమైనా డబ్బు కోసం చేయి చాచినప్పుడు సహకరించక పోవచ్చు. ఎంత ఆత్మవిశ్వాసంతో గర్వంగా బతికేవారైనా అత్యవసన సమస్య తలెత్తినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక విలవిలలాడిపోవచ్చు. ఇలాంటివన్నీ ముందే ఊహించి అత్యవసర నిధిని ముందే ఏర్పాటు చేసుకోవాలి. అది బ్యాంకులో ఏదో ఒక డిపాజిట్ రూపంలో ఉంటే ఇంకా మంచిది. మీ అత్యవసర నిధి మీ కోసమే కానీ ఇతర అత్యవసరాలకు కాదు. అత్యవసర నిధిని కేవలం అత్యవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇతరుల ఆడంబరాలకు, అవసరాలకు మీ ఆత్యవసర నిధి ఎప్పుడూ ఉపయోగించవద్దు.

-బి.మురళి