S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆది వరాహ క్షేత్రం.. తిరుమల

సాక్షాత్తూ వేదనాథుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వెలసి ఉన్న తిరుమల సప్తగిరులు తొలుత ఆది వరాహక్షేత్రంగా కీర్తింపబడతాయి. అందుకు కారణం శ్రీ మహావిష్ణువు ఆదివరాహ స్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇచ్చటనే వెలిశాడు. అందుకే ఈ భూలోక స్వర్గ్ధామం ఆదివరాహక్షేత్రంగా ప్రాశస్థ్యాన్ని పొందింది. అయితే మరికొంత కాలానికి శ్రీ లక్ష్మీ వియోగంతో విరహవేదనకు గురైన శ్రీనివాసుడు వైకుంఠాన్ని వీడి ఇక్కడకు విచ్చేసి తాను ఉండటానికి వంద అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వమని వరాహస్వామిని అభ్యర్థించాడు. అందుకు ప్రతిగా ‘‘ప్రథమదర్శనం, ప్రథమపూజ, ప్రథమనైవేద్యం’’ అనే నియమ ఒప్పందంతో శ్రీహరి శ్రీ వరాహుని చెంత నుంచి వంద అడుగుల దాన పత్రాన్ని స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలోని స్వామి పుష్కరిణి వాయవ్యమూలలో తూర్పు ముఖంగా వెలసి ఉన్న వరాహస్వామి ఆలయంలో నాటి నుంచి నేటి వరకు క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ భూవరాహస్వామియే తొలిపూజాది నివేదనలన్నీ అందుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పూజాది నివేదనలన్నీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచే నేటికి పంపబడుతుండటం విశేషం.
శ్రీ వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీ వేంకటేశుడు కూడా సంతసిస్తాడు వరాహ దర్శనా త్పూర్వం శ్రీనివాసం నమేన్న చ
దర్శనా త్ప్రా గ్వరాహస్య శ్రీనివాసో న తృప్యతి
అంటే శ్రీ వేంకటేశుని తొలి దర్శనం సాక్షాత్తూ స్వామివారికి సైతం అప్రియం. క్షేత్ర సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహస్వామిని దర్శించిన తరువాతే శ్రీస్వామి వారిని దర్శించడం ఫలప్రదం.త
చారిత్రక నేపథ్యం
శ్రీ వరాహస్వామి ఆలయ ప్రాచీనతకు సంబంధించిన వివరాలకు ఆధారాలు లేవు. అయితే తొలిసారిగా క్రీ.శ 1380 కాలం నాటి శాసనంలో శ్రీ వరాహస్వామి ‘‘ వరాహ నాయనార్’’ గా పేర్కొనబడ్డాడు. అటు తరువాత కీ.శ 1476వ నాటి శాసనంలో వరాహస్వామిని ‘‘జ్ఞానప్పిరాన్’’ అని పేర్కొన్నారు. అంటే వరాహస్వామిని దర్శించిన భక్తునికి శాశ్వత జ్ఞానోదయం లభిస్తుందని ప్రశస్తి అటు తరువాత ఆనంద ప్రదాతయగు శ్రీ వేంకటేశుని దర్శించిన భక్తునికి శాశ్వత ముక్తి లభిస్తుందన్నది ఆర్యోక్తి. క్రీ.శ 1481లో ‘‘ ఆది వరాహ పెరుమాళ్’’ అని తొలిసారిగా శ్రీ వరాహస్వామిని పేర్కొనడం జరిగింది. క్రీ.శ 1800లో బ్రిటీష్‌వారు ఆదాయం తక్కువ ఉన్న కారణంగా ఈ వరాహస్వామి ఆలయ పర్యవేక్షణను నిర్లక్ష్యం చేశారు. అయితే కీ.శ 1900 సంవత్సరం ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మహంతు ప్రయాగదాసు భక్తి శ్రద్ధలతో పునరుద్ధరించాడు. అటు తరువాత 1982 ఏప్రిల్ 21 నుంచి 26 వరకు అప్పట్లో ఈ ఆలయానికి తి.తి.దే మహా సంప్రోక్షణను ఘనంగా నిర్వహించింది. మూల విరాట్లు వేధిక ఎత్తును పెంచడం, స్వామివారి చుట్టూ బంగారు మకర తోరణాన్ని అమర్చడం, ఆలయంపై పెద్ద విమానాన్ని నిర్మించడం, బంగారు కలశ స్థాపన వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. అప్పటినుంచి ఆది వరాహక్షేత్రమైన శ్రీ భూవరాహస్వామికి అఖండమైన పూజాది కార్యక్రమాలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతున్నాయి.
వరం శే్వతావరాహాఖ్యం సంహారం ధరణీధరం
స్వ దంష్ట్భ్య్రాం ధరోధారం శ్రీనివాసం భజే నిశం
శ్రేష్టమైన అవయవాలతో విరాజిల్లేవాడు. భూదేవిని హరించిన హిరణ్యాక్షుని వధించినవాడు, తన వాడి కోరలచే భూదేవిని ఉద్ధరించినవాడు, శే్వత వరాహుడైన శ్రీనివాసునికి ఇవే మా వందనములు..

-రామాపురం రాజేంద్ర ఫొటోలు: తలారి రెడ్డెప్ప