S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అపర భగీరథుడు.. మోక్షగుండం

1భాతరత్న సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య భారతదేశంలో ఇప్పటివరకు జన్మించిన అత్యంత ప్రముఖ ఇంజనీర్లలో ఒకరు. అతను నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచాయి. విశే్వశ్వరయ్య నాయకత్వంలో ఏ విద్యా సంస్థ స్థాపించబడింది?

ఎ.మైసూర్ విశ్వవిద్యాలయం
బి.బెంగుళూరులోని స్టేట్ ఇంజనీరింగ్ కళాశాల
సి.బెంగుళూరులోని శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్
డి.పైవన్నీ

2.సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య ఏ పదవుల్ని అలంకరించారు?

ఎ.కన్సల్టింగ్ ఇంజనీర్ - నిజాం ప్రభుత్వం, సౌరాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
బి.చీఫ్ ఇంజనీర్ - మైసూర్ రాష్ట్రం, దివాన్ - మైసూర్ రాష్ట్రం
సి.సెక్రటరీ పబ్లిక్ వర్క్స్, రైల్వేస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ - బొంబాయి ప్రెసిడెన్సీ
డి.పైవన్నీ

3.మోక్షగుండం విశే్వశ్వరయ్యకు ఏ బ్రిటిష్ రాణి లేదా చక్రవర్తి నైట్‌హుడ్ ప్రదానం చేసి సర్ అనే బిరుదునిచ్చారు?

ఎ.కింగ్ ఎడ్వర్డ్ నిని
బి.క్వీన్ విక్టోరియా
సి.క్వీన్ ఎలిజబెత్ నిని
డి.కింగ్ జార్జ్

4.సెప్టెంబర్ 15, 1861న ముద్దనహళ్లి కర్ణాటకలో జన్మించిన విశే్వశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డే గా జరుపుకొంటున్నాము. కింద ఉన్న ప్రచురణలలో ఏవి ఆయన రచించారు?

ఎభారతదేశం పునర్నిర్మాణం
బి.పారిశ్రామికీకరణ ద్వారా సమృద్ధి
డి.గ్రామీణ పారిశ్రామికీకరణ
డి.పైవన్నీ

5.దిగువున్న ఏ ప్రాజెక్టుల కోసం మోక్షగుండం విశే్వశ్వరయ్యగారు సహాయ సహకారాలు అందించారు?

ఎ.మహానది మీద హిరాకుడ్ ఆనకట్ట నిర్మాణం
బి.జంట నగరాలు హైదరాబాద్ మరియు సికిందరాబాద్‌లో మూసీనది వరదలు కట్టుదిట్టం చేసే వ్యవస్థ మరియు డ్రైనేజీ వ్యవస్థ కోసం ప్రణాళిక
సి.బీహార్‌లో గంగానదికి కొత్త రైల్వే బ్రిడ్జ్ కోసం అనువైన ప్రదేశం ఎంపిక వైజాగ్ పోర్ట్‌కు వరదల తాకిడి నుంచి ముప్పు లేకుండా సలహా సహకారం.
డి.పైవన్నీ

6.బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా ఎన్ని సంవత్సరాలు మోక్షగుండం విశే్వశ్వరయ్య వ్యవహరించారు?
ఎ.2 బి.5
సి.6 డి.9

7.ఎవరి సలహా మేరకు ఒరిస్సా ప్రభుత్వం ఒరిస్సాలో మహానది డెల్టాలో వరదలను నియంత్రించే విషయంలో మోక్షగుండం విశే్వశ్వరయ్యను సంప్రదించి ఆయన సహకారం తీసుకొంది?
ఎ.కటక్ మహారాజు

బి.టంగుటూరి ప్రకాశం పంతులు
సి.విజయనగర మహారాజు
డి.మహాత్మాగాంధీ

8.మోక్షగుండం విశే్వశ్వరయ్య కింది వానిలో ఏవి స్థాపించారు?

ఎ.పూణెలోని డెక్కన్ క్లబ్ బి.బెంగుళూరులోని సెంచరీ క్లబ్
సి.బెంగుళూరు ప్రెస్ డి.పైవన్నీ

9.ఏ విశ్వవిద్యాలయం సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్యకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు?
ఎ.ఆంధ్ర విశ్వవిద్యాలయం
బి.అలహాబాద్ విశ్వవిద్యాలయం
సి.జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా
డి.పైవన్నీ

10.సర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య నిర్మించిన ఏ డాం ఈ రోజు మైసూర్, బెంగుళూరు, తమిళనాట త్రాగునీటికి ప్రధాన నీటి వనరు మరియు కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములకు నీటిపారుదల లభ్యమవుతుంది?

ఎ.ఆల్మట్టి డాం బి.తుంగభద్ర డాం
సి.కృష్ణరాజా సాగర డి.పైవన్నీ

గత వారం క్విజ్ సమాధానాలు

1.డి 2.సి 3.డి 4.సి 5.బి 6.సి 7.డి 8.డి

-సునీల్ ధవళ 97417 47700