S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్ర్తిలలో క్యాన్సర్

స్ర్తిలకు ఏ వయసు వారికి కేన్సర్ రాదు అని చెప్పలేం కానీ 10-15 సం.ల వయసు వరకూ హార్మోన్ల తాకిడి వుండదు కనుక జననేంద్రియాల కేన్సర్, రొమ్ము కేన్సర్ రాదని చెప్పవచ్చు. కానీ కొన్ని ఓవరీల కేన్సర్ జెనిటిక్ కారణాల వల్ల చిన్నతనంలో వస్తుంది. ఐతే ఇది చాలా అరుదు.
ఇక వారిలో వచ్చే కేన్సర్ ముఖ్యంగా గర్భాశయపు ముఖద్వారం అంటే సర్వికల్ కేన్సర్ చాలా తరచుగా చూస్తాము. దాని తర్వాత ఓవరీల కేన్సర్, రొమ్ము కేన్సర్ సాధారణంగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కేన్సర్ జాగ్రత్తల గురించి జనంలో పరిజ్ఞానం, భయం ఎక్కువైంది కాబట్టి కొంచెం మొదట్లోనే కేన్సర్ కనిపెట్టడం, చికిత్స చేయడం జరుగుతోంది. ఆరోగ్య శాఖలో వైద్యులు, పారామెడికల్ వారు, సోషల్ వర్కర్ల ప్రమేయం, ప్రయత్నాలు, శ్రమ, ఓర్పు వల్ల ప్రజలకు అవగాహన కలిగింది. చాలామంది స్ర్తిలు ఏ బాధా లేకపోయినా హెల్త్ స్క్రీనింగ్‌లు చేయించుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
గర్భకోశంలో కేన్సర్‌కి ముఖ్య కారణం వైరస్ ఇనె్ఫక్షన్లు, బహుసంతానం, కష్టమైన కాన్పులు, కొన్ని రకాల పుండ్లు అని చెప్పాలి. అందులో ముఖద్వారం ఓపెన్‌గా ఉంటుంది గనుక దానికి ఇనె్ఫక్షన్లు, వ్యాధులు, దెబ్బలు లాంటివి సాధారణం. ఎక్కువ కాన్పులలో పదేపదే గర్భాశయ ద్వారానికి దెబ్బలు, పుండ్లు రావడం సహజం. ఈ ఎరోజను, లేక ఇనె్ఫక్షన్లని వెంటవెంటనే చికిత్స చేస్తే హాని తక్కువగా ఉంటుంది. దానికి తోడు పరిమిత సంతానం ఉంటే ఇంకా మంచిది. సెక్సువల్ ప్రామిస్‌క్యూటీ - లేక సెక్స్ విశృంఖలత వల్ల చాలా వైరస్‌లు, రకరకాల వ్యాధులు దాడి చేస్తాయి. సెక్స్ వల్ల వచ్చే వ్యాధుల్ని (ఎస్.టి.డి) అరికడితే చాలా మంది మహిళలు కేన్సర్ వ్యాధి తప్పించుకోవచ్చు. ఇంకో ముఖ్య కారణం మగవారికి వచ్చే కేన్సర్ వారి పార్ట్‌నర్‌కి కేన్సర్ బదిలీ చేయవచ్చు. వారు తీసుకునే కీమో థెరపీ మందులు కూడా వీర్యం ద్వారా స్ర్తిలలో ప్రవేశించి వారి రోగ నిరోధక శక్తి తగ్గించడం ద్వారా కేన్సర్‌కు దగ్గర చేయవచ్చు. కనుకనే మగవారు కీమోథెరపీ తీసుకుంటున్నపుడు తప్పక కండోమ్స్ వాడాలి. ఈ చిన్న విషయం హెచ్చరించకపోతే స్ర్తిలకి కేన్సరే కాదు ఏ వ్యాధి ఐనా రావచ్చు - ఇమ్యూనిటీ కొరత వల్ల.
ఇక గర్భాశయం లోపలి కేన్సర్ రావడానికి ముఖ్య కారణం హార్మోన్లు - అంటే ఈస్ట్రోజెన్, దాని సంబంధిత హార్మోన్లు. కనుక 40 సం.లు దాటిన స్ర్తిలకు ఈస్ట్రోజన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెనోపాజ్ చికిత్సలో ఒక భాగంగా ఈస్ట్రోజన్ బిళ్లలు ఇచ్చేవారు పూర్వం కానీ ఇప్పుడు కానీ దాని యొక్క హాని తెలుసుకుని పై పూత, ఆయింట్‌మెంట్లు, జెల్ వంటివి, చర్మానికి అతికించే బిళ్లలు ఈస్ట్రోజెన్ పాచెస్ - లాంటివి క్షేమకరం, అపాయరహితం అని నిర్ధారించారు సైంటిస్టులు.
ఇక ఓవరీ మాటకి వస్తే ఏ గడ్డయినా ఓవరీలో వస్తే.. ఇప్పుడున్న ఆధునిక పద్ధతులు, పరీక్షల వల్ల మొదట్లోనే కనుక్కునే సదుపాయం ఉంది. కొన్ని రక్త పరీక్షలు, ఎంఆర్‌ఐ వంటి వాటి సహాయంతో చికిత్స నిర్ణయిస్తారు. చిన్న వయసులో ఓవరీలు గర్భసంచి ఆపరేషన్ ద్వారా తొలగించడం వల్ల ఎదురయ్యే సమస్యలు వాటి లాభనష్టాలు బేరీజు వేసి ప్రతి కేసు విడిగా చూడాలి. అన్ని కేసులు ఒకే త్రాసులో వేసి చూడరు.
ఇక ట్యూబులోను (్ఫలోపియన్ గొట్టం లేక అండనాళిక) కేన్సర్ చాలా తక్కువ.
రొమ్ము శరీరం బయట ఉంటుంది కనుక ప్రథమ దశలోనే అనుమానాస్పదమైన గడ్డలు బయాప్సీ వల్ల కేన్సర్ అవునో కాదో నిర్ధారిస్తారు. మామోగ్రఫీ, ఎంఆర్‌ఐ వల్ల ఇతర చోట్లకి పాకిందా లేదా అని చూస్తారు. ప్రథమ దశలో సర్జరీ, కీమో, రేడియో థెరపీ వల్ల స్ర్తిలు చాలా కాలం జీవించగలరు.
ఇక స్క్రీనింగ్ - 35 సం.లు దాటిన స్ర్తిలందరూ తప్పక గైనిక్ పరీక్ష, పాప్‌స్మియరు, అవసరమైతే డి అండ్ సి లేక బయాప్సీ చేయించుకోవాలి. అలాగే తమని తాము పరీక్షించుకోవటం... ఏటేటా అవసరమైతే మామోగ్రఫీ చేయించుకోవాలి. స్కానింగ్‌లు, స్మియర్ లాంటివి ఏమీ బాధ, నష్టం లేకుండా జరుగుతాయి కనుక తప్పక వనితలందరూ చేయించుకోవాలి.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో