S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (7-10-2018 నుంచి 13-10-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం అభీష్ట సిద్ధి. సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. భాగస్వామ్యాల్లో సంతృప్తి. అనుబంధాలు విస్తరిస్తాయి. మానసిక ప్రశాంతత. సృజనాత్మకత పెరుగుతుంది. సోమవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. అన్ని పనులను ఒత్తిడిగా గుర్తిస్తారు. పనుల్లో శ్రమాధిక్యం. పోటీలను అధిగమించాలి. మంగళవారం సౌకర్యాల విషయంలో జాగ్రత్త. ఆహార విహారాలు శ్రమతో సాధించబడతాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. బుధవారం పరిచయాలు అనుబంధాలు విస్తరించే అవకాశం. భాగస్వామ్యాల్లో జాగ్రత్త. వృత్తిలో శ్రమతో కార్యాలు. గురువారం గౌరవం పెంచుకునే ప్రయత్నం. పెద్దలతో అనుబంధాలు విస్తరిస్తాయి. అనుకోని సమస్యలుంటాయి. శుక్రవారం ఊహించని సంఘటనలు. పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అసంతృప్తి. ధర్మకార్యాలపై దృష్టి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం స్ర్తిజన సహకారం లభిస్తుంది. నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. దగ్గరి ప్రయాణాదులుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. నిల్వధనం తగ్గవచ్చు. సోమవారం మాటల్లో అధికారిక ధోరణి తగ్గించుకోవాలి. కుటుంబంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలత ఉంటుంది. మంగళవారం ఖర్చులు పెట్టుబడులపై చర్చలు. విశ్రాంతి కోసం ఆలోచనలు. ప్రయాణాదులకు అవకాశం. బుధవారం వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. వ్యర్థమైన ప్రయాణాలు. పరామర్శలకు అవకాశం. గురువారం పెద్దలతో సంప్రదింపులుంటాయి. అందరి సహకారం లభిస్తుంది. సోదరవర్గ అనుకూలత. ప్రయాణాల్లో శుభ పరిణామాలు. శుక్రవారం మానసిక వత్తిడులు. సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో జాగ్రత్త.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధిస్తారు. సంతృప్తి అధికం. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. ఉన్నత విద్య. గురు అనుగ్రహం. సోమవారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక కార్యక్రమాల్లో ఒత్తిడులు. పదోన్నతులు. శ్రమ ఉంటుంది. మంగళవారం కార్యనిర్వహణలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పనిచేసే ప్రదేశంలో శ్రమతో గౌరవం. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో ఒత్తిడులుంటాయి. మాటల్లో తొందరపాటు కూడదు. లాభాలున్నా జాగ్రత్త అవసరం. గురువారం అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. పెద్దల ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి. శ్రమాధిక్యం. శుక్రవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. ధార్మిక దానాల వల్ల మేలు కలుగుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రయాణం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీ రంగంలో ఆచితూచి వ్యవహరించాలి. గృహ వాహనాది నిర్ణయాల్లో శ్రమ. సోమవారం ఆలోచనల్లో అనుకూలత. సృజనాత్మకత. నూతన కార్యక్రమాల ప్రణాళికలున్నా కొంత వత్తిడి తప్పకపోవచ్చు. సంతోషం. మంగళవారం సంతానంతో గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం. సోదర వర్గ వ్యవహారాలపై దృష్టి. బుధవారం పోటీ రంగంలో గుర్తింపు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యవహారాల్లో శ్రమ. విజయం కోసం ప్రయత్నం. గురువారం పెద్దలతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. అపోహలకు అవకాశం. ఇతరుల సహకారం, గుర్తింపు లభిస్తుంది. శుక్రవారం భాగస్వామ్యాల్లో వత్తిడులు. పరిచయాలు అనుబంధాల్లో జాగ్రత్త. అనుకోని సమస్యలు. దానధర్మాల వల్ల మేలు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి. విశ్రాంతి లభిస్తుంది. సౌఖ్యంగా గడుపుతారు. ప్రయాణాల్లో అనుకూలత. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత. మాటల్లో చమత్కారం. సోమవారం శారీరక వత్తిడులుంటాయి. శ్రమతో సౌఖ్యం పొందే ప్రయత్నం. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. మంగళవారం లాభాలు సంతోషపరుస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. బుధవారం మానసిక వత్తిడులు. అనేక కార్యక్రమాల నిర్వహణపై ఆవేశం. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు. గురువారం కుటుంబంలో శుభ కార్యక్రమాలు. మాట తీరువల్ల సంతోషం. నిల్వధనం పెంచుకుంటారు. శుక్రవారం సౌకర్య లోపాలు. ఆహార విహారాదుల్లో జాగ్రత్త. సంప్రదింపుల్లో ఒత్తిడులుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం అన్ని పనుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలు. ఊహించని సంఘటనలు. నూతన కార్యక్రమాల వాయిదా. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. సోమవారం కొంత అసంతృప్తి తప్పకపోవచ్చు. అనుకున్నంత వేగంగా పనులు పూర్తికావు. దానధర్మాలు అవసరం. మంగళవారం భాగస్వామ్యాల్లో అత్యంత శుభ పరిణామాలు. లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలు. బుధవారం తొందరపాటు నిర్ణయాదులు కూడదు. ఒత్తిడులు అధికం. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. గౌరవం తగ్గుతుంది. గురువారం భాగస్వామ్యాల్లో జాగ్రత్త. పరిచయాల వల్ల కాలం ధనం వ్యర్థం కావచ్చు. పదోన్నతులకు అవకాశం. శుక్రవారం ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. నిర్ణయాదులు సమీక్షించుకోవాలి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోమవారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. విద్యారంగంలో ఒత్తిడులుంటాయి. ఆహార విహారాల గూర్చి ఎక్కువగా ప్రయత్నిస్తారు. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. గృహ వాహనాదుల విషయాలు ప్రభావితం చేస్తాయి. బుధవారం అనుకోని సమస్యలు. ఆలోచనల్లో వత్తిడులు. నిల్వధనం కోల్పోయే అవకాశం. ఊహించని సంఘటనలు. గురువారం అభీష్టాలు నెరవేరుతాయి. కొత్త పనులపై దృష్టి. సంతానవర్గ అభివృద్ధి. సంతోషంగా గడుపుతారు. శుక్రవారం భాగస్వామ్య ఒత్తిడులు అత్యధికం. పరిచయాలు స్నేహానుబంధాల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం అన్ని ప్రయోజనాలపై దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. వ్యవహారాల్లో అనుకూలత. సంతృప్తి. పెద్దల ఆశీస్సులు. సోమవారం ఖర్చులు, పెట్టుబడులుంటాయి. ప్రయాణావకాశాలు. కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రయోజనాలు తగ్గుతాయి. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త వహించాలి. విశ్రాంతి తగినంతగా లభించకపోవచ్చు. ఖర్చులు. బుధవారం సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి. ఆహార విహారాల్లో ఇబ్బందులు. తొందరపాటు వల్ల సమస్యలు. నిర్ణయాల అమలు. గురువారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. నూతన నిర్ణయాదులుంటాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. శుక్రవారం సంప్రదింపుల్లో జాగ్రత్త. సేవకవర్గ సహకారం. వార్తల వల్ల ఒత్తిడులు. కుటుంబ ఆర్థికాంశాల్లో శ్రమాధిక్యం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు పెరుగుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. సంతృప్తిగా గడుపుతారు. సోమవారం అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. భాగస్వామితో సమస్యలు. అధికారిక లోపాలు. జాగ్రత్తగా మెలగాలి. మంగళవారం వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు వత్తిడులు చికాకులు పెరుగుతాయి. ఊహించని సంఘటనలుంటాయి. బుధవారం తొందరపాటు కూడదు. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. లక్ష్యాలను సాధించడంలో శ్రమ. గురువారం వ్యతిరేకతలు అధికం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. దూర ప్రయాణ భావన. ధార్మిక భావాల విస్తరణ. శుక్రవారం కొన్ని లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో వత్తిడులు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం కుటుంబ, ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట తీరులో శుభ పరిణామాలు. ఆహార విహారాది సౌకర్యాలు మెరుగుపరచుకుంటారు. సంతోషంగా గడుపుతారు. సోమవారం సంప్రదింపులకు అవకాశం. అధికారిక సహకారం లభిస్తుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. మంగళవారం నిర్ణయాదులు లాభిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి. దగ్గరి ప్రయాణాలుంటాయి. కొత్త వార్తలు అందుతాయి. బుధవారం పరిచయాలు అనుబంధాల్లో ఒత్తిడులుంటాయి. సంతోషాన్ని, ఆహార విహారాలని కోల్పోవలసి వస్తుంది. గురువారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. అపోహలకు అవకాశం. గృహ వాహనాది వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. శుక్రవారం వ్యతిరేకతలున్నా శ్రమతో విజయం సాధిస్తారు. అభీష్టాలు నెరవేరుతాయి. శ్రమతో ఫలితాలు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాలుంటాయి. ఖర్చులు పెట్టుబడులకు అవకాశం. ప్రయాణాల్లో సంతోషం. సోమవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని విధాలా ప్రయోజనాలుంటాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. గుర్తింపు. మంగళవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత విద్య, ఉద్యోగం, ప్రయాణాలుంటాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త. బుధవారం కమ్యూనికేషన్స్ వల్ల సమస్యలు. సోదర వర్గంతో వత్తిడులు. అసంతృప్తి. తప్పని వ్యవహారాలుంటాయి. గురువారం కార్యనిర్వహణలో శ్రమ. ప్రయాణాలకు అవకాశం. గౌరవం పెంచుకునే ప్రయత్నం. దానధర్మాల వల్ల మేలు. శుక్రవారం కుటుంబంలో ఒత్తిడులు. మాటల వల్ల సమస్యలు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం అనుకోని ఒత్తిడులుంటాయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. సంప్రదింపుల్లో ఇబ్బందులకు అవకాశం. పోటీ రంగంలో జాగ్రత్త. సోమవారం భాగస్వామ్యాల్లో వత్తిడులుంటాయి. పరిచయాలు అనుబంధాల్లో జాగ్రత్త వహించాలి. వ్యతిరేకతలుంటాయి. మంగళవారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతోషం. ఆలోచనలకు రూపకల్పన. పరిచయాలు విస్తరిస్తాయి. బుధవారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ఊహించని సంఘటనలు. కార్యక్రమాల వాయిదా మంచిది. గురువారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. గౌరవ లోపాలకు అవకాశం. నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలుంటాయి. పనులు వాయిదా వేస్తారు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744