S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐ మోట్ (యామ్ ఐ అవుట్)

తెలుగువాళ్లు ఆడే ఇంగ్లీష్ ఆట. ఇదేం ఆట అనుకుంటున్నారా? ఈ ఆటను మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పిల్లలు అందరూ ఆడతారు. దాని పేరు ‘ఐ మోట్’. ఈ ఆట పేరు కొత్తగా, వింతగా ఉంది కదూ. కానీ ఇది అందరికీ పరిచయమే. వాస్తవానికి ఈ ఆట పేరు ‘యామ్ ఐ అవుట్’. అంటే నేను విఫలమయ్యానా అని దీని అర్థం. యామ్ ఐ అవుట్ అనే ఆట రానురాను ఐ మోట్‌గా మారిపోయింది. దీనికి కారణం ఈ ఆట ఆడే ప్రతివారికి ఇంగ్లీష్ రాని కారణం ఒకటయితే, ఇలా అనకూడదని చెప్పేవాళ్లు లేకపోవడం, ఆట ఆడే పిల్లలను కూడా ఆ పదం మీద సరయిన అవగాహన లేకపోవడమే. అయితే ఈ ఆట ఇప్పుడు పుట్టింది కాదు. దాదాపు 6,7 దశాబ్దాలుగా ఉండొచ్చు. మన పురాతన ఆటలకు సంబంధించి ఆటల్లో ఉపయోగించే ఇంకొక పదం కూడా వాడుకలో ఉంది. ఆ పదం ‘టాంబ్లీస్’. విన్నట్లుగా ఉంది కదూ. కచ్చితంగా పిల్లలు ఆడుకుంటుంటే వింటూనే ఉంటాము. అసలు పదం ‘టైం ప్లీజ్’. ఈ పదాన్ని పిల్లలు ఆటలు ఆడుకునేటప్పుడు కాస్త విశ్రాంతి (రిలాక్స్) కోసం, శ్వాస తీసుకునేటటు వంటి వెసులుబాటు కోసం ‘టైం ప్లీజ్’ అని అంటారు. ‘యామ్ ఐ అవుట్’ ‘టైమ్ ప్లీజ్’ అనే పదాలను స్పష్టంగా పలుకరాక పోవడం వల్ల ఐ మోట్, టాంబ్లీస్‌గా పలుకుతున్నారు. ఆ విధంగా మారిపోయాయి.
అయితే ఇప్పుడు ఐ మోట్ ఆట ఆడే విధానం గురించి తెలుసుకుందాం. ఈ ఆటను ఇద్దరు అంతకంటె ఎక్కువమంది పిల్లలు కలిసి ఆడవచ్చు. నేల మీద దీర్ఘచతురస్రాకారంగా 5 డబ్బాలు గీయాలి.
ఇక ఒక్కొక్కరుగా కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూసుకుంటూ రెండు కాళ్లను ఒకేసారి హైజంప్ చేసినట్లుగా మొదటి డబ్బాలో ఎగిరి గంతేయాలి. అలా గెంతేటప్పుడు యామ్ ఐ అవుట్ అనాలి. అలా ప్రతిసారి ఎగిరేటప్పుడు యామ్ ఐ అవుట్ అంటూ వుండాలి. అప్పుడు మిగతా పిల్లలు ఎగిరే వాళ్ల అడుగులు సరిగ్గా డబ్బాలోనే పడుతున్నట్లయితే ‘యస్, యస్’ అని అంటుంటారు. ఒకవేళ డబ్బాలో గనుక పడనట్లయితే అంటే గీతల మీదనో, డబ్బాల్లో కాకుండా ప్రక్కకు గానీ పడినట్లయితే ఎగిరే వాళ్లు నిష్క్రమించుకుని ఇంకొకరికి అవకాశమివ్వాల్సి ఉంటుంది. మధ్యన కాకుండా గీతలు తొక్కిన వాళ్లు ఓడిపోయినట్టు లెక్క. చివరకు ఎవరయితే అయిదు డబ్బాలు గీతలు తొక్కకుండా పూర్తి చేస్తారో వాళ్లే గెలిచినట్లు.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431