S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘వేయి పడగల’ సృష్టికర్త

1.అక్టోబర్ 18, 1976 నాడు కన్నుమూసిన విశ్వనాథ వారి శత జయంతి సందర్భంగా విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహాన్ని విజయవాడలో అప్పటి రాష్టప్రతి శంకర్ దయాళ్ శర్మగారు ఆవిష్కరించారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని ప్రతిష్ఠాకరమైన జ్ఞానపీఠ్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?

ఎ.1955 బి.1962
సి.1966 డి.1970

2.రచన విశ్వనాథ వారి చారిత్రాత్మకమైన వేయి పడగలు ఏ సంవత్సరంలో ఏ సందర్భంగా రచించారు?

ఎ.1964లో మద్రాస్ సాహిత్య అకాడెమీ వార్షికోత్సవం కొరకు
బి.తిరుపతి వేంకట కవులకు గురుదక్షిణగా
సి.1934లో ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన రచన పోటీల కోసం
డి.1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడుమ

3.జ్ఞానపీఠ్ అవార్డు వరించిన తొలి తెలుగు వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ గారి ఏ రచనకు జ్ఞానపీఠ్ అవార్డు లభించింది?

ఎ.వేయి పడగలు బి.శ్రీమద్రామాయణ కల్పవృక్షం
సి.ఏకవీర డి.విశ్వనాథ మధ్యాక్కఱలు

4.1921లో గాంధీగారి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొనేందుకు బి.ఏ. చదువు మధ్యలో ఆపివేసిన విశ్వనాథ సత్యనారాయణగారు ఏ కాలేజీలో అధ్యాపకులుగా ఉండేవారు?

ఎ.బందరు నేషనల్ కాలేజీ, గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్
బి.ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కాలేజీ, విజయవాడ
సి.ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కరీంనగర్
డి.పైవన్నియు

5.1964లో ఏ విశ్వవిద్యాలయం విశ్వనాథ సత్యనారాయణ గారికి కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది?

ఎ.బెనారస్ విశ్వవిద్యాలయం బి.అలహాబాద్ విశ్వవిద్యాలయం
సి.ఆంధ్ర విశ్వవిద్యాలయం డి.కాకతీయ విశ్వవిద్యాలయం

6.క్రింది వానిలో విశ్వనాథ సత్యనారాయణ గారికి లభించిన సత్కారాలు ఏవి?

ఎ.1963లో సాహిత్య అకాడెమీ
బి.1970లో పద్మ విభూషణ్
సి.1970 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా నియామకం
డి.పైవన్నియు

7.విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నో రచనలు సంస్కృతంలో చేశారు. క్రింది వానిలో ఆయన సంస్కృత భాష రచనలేవి?

ఎ.కావ్యవేద హరిశ్చంద్ర, శశిదూతము, ప్రద్యుమ్నోదయము
బి.దమయంతీ స్వయంవరం, వేణీభంగము, వేదవతి
సి.దేవీ త్రివతి, అమృతశర్మిష్ఠము, ప్తపాశుపతమ్
డి.ఋతు సంహారము, శ్రీకుమారాభ్యుదయము, నివేదిత

8.‘మాట్లాడే వెనె్నము
పాటపాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు’
విశ్వనాథ సత్యనారాయణ గూర్చి ఏ మహానుభావుడు ఇలా సెలవిచ్చారు?

ఎ.శ్రీరంగం శ్రీనివాసరావు బి.పింగళి లక్ష్మీకాంతం
సి.దాశరథి డి.చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీ

9.విశ్వనాథ వారు రచించిన కినె్నరసాని పాటలు లోని ఏ భాగంలోనిది ఈ కవిత?
‘కదిలింది కదిలింది/ కదిలింది కదిలింది/ కదిలి కినె్నరసాని వొదుగుల్లుపోయింది/ సుదతి కినె్నరసాని సుళ్లుగా తిరిగింది/ ముదిత కినె్నరసాని నురుగుల్లు గ్రక్కింది’

ఎ.కినె్నర పుట్టుక బి.కినె్నర సత్యము
సి.కినె్నర నడకలు డి.కినె్నర ప్రభావము

10.విశ్వనాథ సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం పోస్టల్ శాఖ, రూ.5 తపాలా బిళ్ల ఎప్పుడు విడుదల చేసింది?

ఎ.ఏప్రిల్ 2017 బి.అక్టోబర్ 2006
సి.సెప్టెంబర్ 1995 డి.జనవరి 1978
*

గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.ఎ 3.సి 4.డి 5.డి 6.డి 7.డి 8.డి

-సునీల్ ధవళ 97417 47700