S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (14-10-2018 నుంచి 20-10-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం భాగస్వామ్యాలకు చెందిన ఇబ్బందులు. ఊహించని సంఘటనలు. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు అధికం. అసంతృప్తి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఘర్షణలు. అనుకోని సమస్యలు. సామాజిక వ్యవహారాల్లో లోపాలు. గౌరవ లోపం. మంగళవారం పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాల రూపకల్పన. కీర్తి ప్రతిష్ఠలు. బుధవారం వృత్తి వ్యాపారాదులపై దృష్టి. అధికారులతో కొంత వ్యతిరేకత. పోటీలలో శ్రమతో విజయం. గుర్తింపు లభిస్తుంది. గురువారం సౌకర్యాలు మెరుగుపరచుకుంటారు. ఆహార విహారాలు, సౌఖ్యంపై దృష్టి. గృహంలో సంతోషం. శుక్రవారం అధికారిక వ్యవహారాలపై దృష్టి. అనేక కార్యక్రమాల నిర్వహణ. పితృవర్గంతో జాగ్రత్త అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సోమవారం వ్యతిరేక ప్రభావాలు పెరుగుతాయి. పోటీలు ఒత్తిడుల వల్ల సంతోషం తగ్గిపోతుంది. సంతానవర్గ సమస్యలు. మంగళవారం ఆలోచనలకు రూపకల్పన. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. దగ్గరి ప్రయాణాలు. సౌఖ్యంగా గడుపుతారు. బుధవారం కుటుంబంలో ఒత్తిడులుంటాయి. వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోటీ రంగంలో గుర్తింపు. గురువారం ఖర్చులు పెట్టుబడులు పెరుగుతాయి. విశ్రాంతి తగ్గే అవకాశం. పరామర్శలుంటాయి. వ్యవహారాల్లో విజయం. శుక్రవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో జాగ్రత్తగా మెలగాలి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులుంటాయి. విందులు విహారాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పెద్దల అనుకూలత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ప్రయాణావకాశాలు. సోమవారం కుటుంబంలో ఒత్తిడులు. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. ఆర్థిక నిల్వల లోపం. మంగళవారం అన్ని పనుల్లో ప్రయోజనాలు. అనేక బాధ్యతల నిర్వహణ. లాభాలు సంతోషాన్నిస్తాయి. తృప్తి. బుధవారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యనిర్వహణ. గురువారం కార్యనిర్వహణలో జాగ్రత్త. ఊహించని సంఘటనలుంటాయి. నిల్వధనం తగ్గే సూచనలు. శుక్రవారం మాటల్లో తొందరపాటు కూడదు. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం పరిచయాలు విస్తరించడంలో శ్రమ. పోటీలు అధికం. వ్యతిరేక ప్రభావాలుంటాయి. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సోమవారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. దానధర్మాల వల్ల మేలు. మంగళవారం అన్ని పనుల్లో ఒత్తిడులు. ఊహించని ఇబ్బందులు. నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. బుధవారం ఉన్నత వ్యవహారాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలుంటాయి. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గురువారం సంప్రదింపులకు అనుకూలం. సోదర వర్గంతో సంతోషంగా గడుపుతారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. శుక్రవారం అసంతృప్తి. గౌరవాల విషయంలో లోపాలు. ఘర్షణలు పెరుగుతాయి. ఉన్నత విద్యలలో జాగ్రత్త.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం సంప్రదింపులుంటాయి. కుటుంబ ఆర్థికాంశాలపై ప్రత్యేక దృష్టి. నిల్వధనం పెంచుకుంటారు. దగ్గరి ప్రయాణాలుంటాయి. సహకారం లభిస్తుంది. సంతోషం. సోమవారం సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు ఇబ్బంది పెట్టే సూచనలు. మానసిక ఒత్తిడులు. మంగళవారం మాటల్లో చమత్కారం. కుటుంబంలో సంతోషం. గృహ వాహనాది సౌకర్యాలుంటాయి. బుధవారం నిర్ణయాదుల్లో ఒత్తిడులు. సంతానవర్గ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. సృజనాత్మకత. గురువారం లాభాలు ప్రభావితం చేస్తాయి. మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతృప్తి. పెద్దల ఆశీస్సులు. శుక్రవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. వ్యతిరేక ప్రభావాలు అధికం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలం. అధికారిక కార్యక్రమాలపై దృష్టి. వ్యాపార వ్యవహారాదులకు అనుకూలం. ప్రయాణాలు. ఖర్చులకు అవకాశం. సోమవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. కొత్త పనుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొంత నిరాశగా గడుపుతారు. మంగళవారం అధికారిక వ్యవహారాలుంటాయి. కార్యనిర్వహణలో సంతోషం. గుర్తింపు. గౌరవం పెంచుకునే సూచనలు. బుధవారం లక్ష్యాలను సాధిస్తారు. అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. బాధ్యతలు అధికం. శ్రమాధిక్యం. గురువారం భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. శుక్రవారం తొందరపాటు కూడదు. కార్యనిర్వహణలో ఒత్తిడులు. వ్యవహారాల్లో కొంత వౌనంగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం వ్యతిరేకతలు పెంచుకునే ప్రయత్నం. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ సంతృప్తి. కొత్త ఆలోచనలు. పోటీల్లో విజయం సాధిస్తారు. సోమవారం భాగస్వామ్యాలపై దృష్టి. ఊహించని సంఘటనల వల్ల పరిచయాల్లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. జాగ్రత్త అవసరం. మంగళవారం అభీష్టాలు నెరవేరుతాయి. అనుబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంతో హాయిగా గడుపుతారు. బుధవారం సౌకర్యాలు శ్రమకు గురిచేసే అవకాశం. అన్ని పనుల్లో జాగ్రత్తగా మెలగాలి. అనుకోని సమస్యలు. గురువారం కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక నిల్వలు లోపించే అవకాశం. మాట తీరులో జాగ్రత్త అవసరం. శుక్రవారం సమస్యలు అధికవౌతాయి. శనివారం మాట విలువ తగ్గవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. కుటుంబ ఆర్థికాంశాలు ప్రభావితం చేస్తాయి. సంతోషంగా గడుపుతారు. నిల్వధనం పెరిగే సూచనలు. చమత్కార ధోరణి. సోమవారం సౌకర్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విహారాల్లో కొంత ఇబ్బందులకు అవకాశం. సంప్రదింపులుంటాయి. మంగళవారం సోదరీమణుల సహకారం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. మంచి వార్తలకు అవకాశం ఉంది. బుధవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. టాక్స్‌లు, రెంట్‌లు అన్నీ ముందుగా చెల్లించాలి. శరీరం అసౌకర్యం. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. అధికారిక వ్యవహారాలు. సామాజిక గౌరవం. పదోన్నతులుంటాయి. శుక్రవారం సౌకర్య లోపాలకు అవకాశం. గృహ వాహనాదుల్లో తొందరపాటు కూడదు.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. అధికారిక వ్యవహారాలపై దృష్టి. గౌరవం పెంచుకుంటారు. సోమవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. పెద్దల ఆశీస్సులు. లాభాలు కోల్పోవచ్చు. మంగళవారం అన్ని పనుల్లో అనుకూలత. సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి లభిస్తుంది. శుక్రవారం వ్యర్థంగా కాలం ధనం కోల్పోవచ్చు. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. విశ్రాంతి లోపిస్తుంది. శనివారం నిర్ణయాదుల్లో అనుకూలత. ఆహార విహారాల్లో లోపాలు. అనేక కార్యక్రమాల బాధ్యతలు. తీరిక ఉండకపోవచ్చు. పోటీలు ఒత్తిడులుండే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. సౌకర్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాది సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి. సోమవారం వ్యతిరేక ప్రభావాలు ఎక్కువయ్యే సూచనలు. భాగస్వామ్యాల్లో జాగ్రత్తగా మెలగాలి. పోటీల్లో ఇబ్బందులకు అవకాశం. మంగళవారం సౌఖ్యంగా గడుపుతారు. పోటీ రంగంలో విజయం సాధిస్తారు. అందరిచేత గుర్తింపు లభిస్తుంది. సంతోషం. బుధవారం పెద్దల సహకారం లభించే సూచనలు. పరిచయాలు అనుబంధాలు విస్తరిస్తాయి. శ్రమతో కార్యాలు. గురువారం నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. ఆత్మవిశ్వాసంతో మెలగుతారు. అన్ని పనుల్లో అనుకూలత. శుక్రవారం అనుబంధాల్లో ఒత్తిడులుంటాయి. తొందరపాటు కూడదు. శనివారం ఆత్మవిశ్వాసం
తగ్గిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం నిర్ణయాదులు లాభిస్తాయి. అనేక కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం. ఖర్చులు పెట్టుబడులు పెరుగుతాయి. వ్యాపారాదులపై దృష్టి. ప్రయాణావకాశాలు. సోమవారం సంప్రదింపులు ఇబ్బందికరం. సహకార లోపాలకు అవకాశం. కుటుంబ ఆర్థికాంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మంగళవారం విహారాలు విందులకు వెచ్చిస్తారు. కాలం ధనం కొంత కోల్పోవచ్చు. సంతోషంగా గడిపే సూచనలు. బుధవారం కొన్ని లాభాలు సంతోషాన్నిస్తాయి. కొందరి మన్ననలు పొందే అవకాశం. దగ్గరి ప్రయాణాలు. సంప్రదింపులుంటాయి. గురువారం లక్ష్యాలను సాధిస్తారు. సుదూర ప్రయాణాలు. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్యా దృష్టి పెరుగుతుంది. శుక్రవారం సమాచారం ఇబ్బంది పెట్టే సూచనలు. ప్రయాణాదుల్లో జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. లక్ష్యాలను సాధించడంలో శ్రమ. పనుల్లో కొంత శ్రమ తప్పకపోవచ్చు. భాగస్వామ్యాల్లో ఇబ్బందులకు అవకాశం. సోమవారం లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో ఇబ్బందులకు అవకాశం. గౌరవం తగ్గే సూచనలు. మంగళవారం కార్యనిర్వహణలో కొంత జాగ్రత్తగా మెలగాలి. అధికారిక వ్యవహారాల్లో ఇబ్బందులకు అవకాశం. బుధవారం భాగస్వామ్య నిర్వహణలో సమస్యలు. పరిచయాలు, అనుబంధాలు ఇబ్బంది పెట్టే సూచనలు. గురువారం మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు అనుకూలం. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. శుక్రవారం ప్రయోజనాలుంటాయి. కార్యనిర్వహణలో సంతృప్తి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744