S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

యక్షగాన కంఠీరవ

డా.పసుమర్తి శేషుబాబుగారు ప్రఖ్యాత కూచిపూడి నర్తకులు, గురువు, సంగీత విద్వాంసులు. దేశ విదేశాలలో 2000 పైగా ప్రదర్శనలిచ్చి, కూచిపూడి కీర్తిపతాక నెగురవేశారు. ఎన్నో ముఖ్యమైన సంగీత, నృత్య పరీక్షలకు ఎగ్జామినర్‌గా వెళ్తూంటారు. కూచిపూడి నృత్య భారతి 1985లో హైదరాబాద్‌లో స్థాపించి, ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. సిసిఆర్‌టి ప్యానల్ జడ్జిగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. వీరు చేసిన కళాసేవను గుర్తించి 2013లో ‘ది యునైటెడ్ థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ’ వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వీరి తండ్రి, గురువు పి.వి.జి.కృష్ణశర్మగారు. డా.శేషుబాబు గారు తెలుగు విశ్వవిద్యాలయం నృత్యశాఖ గెస్ట్ ఫ్యాకల్టీగా ఉంటున్నారు.
పి.వి.జి. కృష్ణశర్మగారు కళారత్న, టాగోర్త్న్ర, యక్షగాన కులపతి బిరుదాంకితులు. శేషుబాబు గారు తండ్రికి తగ్గ తనయుడు. నృత్యం, సంగీతం రెండూ తండ్రిగారి వద్ద నేర్చుకుని విద్వాంసులయ్యారు. తండ్రి వద్ద సంగీతం, నృత్యం, యక్షగానాలు, నృత్య సంగీతం నేర్చుకున్నారు. తరువాత, తంపెళశ్ల సూర్యనారాయణ గారి వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు డా.శేషుబాబు. వీరు తెలుగు ఎం.ఏ. చేశారు. కూచిపూడిలో డిప్లొమా, కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. ఆలిండియా రేడియోలో ‘బి’ గ్రేడ్ లలిత సంగీతంలో పొందారు. గౌరవ డాక్టరేట్ కూడా పొందారు.
గిరిజా కళ్యాణం
మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నుండి శ్రీమతి మద్దాళి సుశీల వరకూ ఎందరో గిరిజా కళ్యాణం హరికథ చెప్పారు. వీటికి సంస్కృతంలో శివపురాణం, కాళిదాసు రచించిన కుమార సంభవం ఆధారాలు. అయితే కూచిపూడి యక్షగాన రూపంలో సంప్రదాయ కూచిపూడి కళాకారులు ప్రదర్శించడం ఆనందాన్ని కలిగించే విషయం. ఈ పరంపరకు చెందినవారు పసుమర్తి శేషుబాబుగారు. కొద్ది రోజుల క్రితం త్యాగరాయ గానసభలో మరల గిరిజా కళ్యాణం ప్రదర్శించారు.
గాయకుడిగా.. డా.శేషుబాబు గారు ఎంతో మంది ఉత్తమ కళాకారులకు గాత్ర సహకారం అందించారు. అందులో కొంతమంది - సంగీత నాటక అవార్డు గ్రహీత ప్రొ.డా.అలేఖ్య పుంజాల, శ్రీమతి వైజయంతి కాశీ, డా.వేదాంతం రామలింగశాస్ర్తీ, వేదాంత వెంకు, పసుమర్తి వేంకటేశ్వర శర్మ, డా.చింతా ఆదినారాయణ శర్మ, మహంకాళి మోహన్, డా.అరుణాభిక్షు, కళారత్న డా.మద్దాళి ఉషాగాయత్రి, కళారత్న శ్రీమతి స్వాతి సోమనాథ్ మొ. వారు. డా.శేషు బాబుగారి జీవిత భాగస్వామి శ్రీమతి పి.రాజరాజేశ్వరి గారు ప్రఖ్యాత గాయకురాలు, వీణా విద్వాంసురాలు. వీరి ముగ్గురు కుమార్తెలు ఫణిబాల, చంద్రబాల, సాయి దీపిక కూడా సంగీత విద్వాంసులు.
అవార్డులు - వీరు పొందిన అవార్డులు - ఆలిండియా రేడియో ‘బి’ గ్రేడ్ స్కాలర్‌షిప్, మానవ వనరుల శాఖ, న్యూఢిల్లీ, 1973 ఉగాది పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం, కినె్నర ఆర్ట్ థియేటర్ సంగీత నాట్యాచార్య, శ్రీరామ గానసభ, హైదరాబాద్, నాట్యరత్న, గోల్డెన్ స్టార్ అసోసియేషన్, హైదరాబాద్ బెస్ట్ డాన్స్ టీచర్ అవార్డు - యుఎస్‌ఏ, నృత్య సంగీత కళానిధి - వైజాగ్, నాట్య శిఖామణి - పుష్పగిరి శంకరాచార్య, హైదరాబాద్. యక్షగాన నాట్య కిరీటి. ఉత్తమ నాట్యాచార్య - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రతిభా పురస్కారం - ఇంటర్నేషనల్ ఇన్ఫినిటీ - కల్చరల్ ఆర్గనైజేషన్. నాదబ్రహ్మ - కళామండపం - యుఎస్‌ఏ. యక్షగాన కంఠీరవ. సేవామిత్ర పురస్కారం. సేవా భారతి - శ్రీలలిత కల్చరల్ అసోసియేషన్. నాట్య సరస్వతి. కోరాడ మెమోరియల్ అవార్డు - నాట్య దర్పణ. దత్తులూరి రామారావు మెమోరియల్ అవార్డు - ధర్మవరం. కళాశ్రీ - డా.పి.రమాదేవి.
రూపకల్పన - కొరియోగ్రఫీ ముఖ్యాంశాలు.
నృత్య రూపకాలు
1.వందే దేవం వినాయకం 2.పార్వతీ పరిణయం 3.శివపాదం 4.అర్ధనారీశ్వరం 5.సుగ్రీవ విజయం 6.కిరాతార్జునీయం 7.శ్రావణ లక్ష్మి 8.గంగావతరం 9.ఋతుశోభ 10.సుగంధి కుంతల 11.వేంకటేశ్వర వైభవం 12.రాధా వంశీధర విలాసం 13.శ్రీనివాస కళ్యాణ వైభవం 14.్భక్త శబరి.
సూత్రధారిగా - 1.్భక్త ప్రహ్లాద 2.రామనాటకం 3.ఉషా పరిణయం 4.శశిరేఖా పరిణయం 5.మోహినీ రుక్మాంగద 6.సుగ్రీవ విజయం
కలాపములు - భామాకలాపం, గొల్లకలాపం.
ముఖ్యమైన ప్రదర్శనలు
దేశ విదేశాలలో వేల ప్రదర్శనలిచ్చి కూచిపూడి కీర్తి పతాక నెగురవేశారు. అందులో కొన్ని ముఖ్యమైనవి.
కూచిపూడి ఆలయం ఉత్సవాలు. ప్రపంచ తెలుగు మహాసభలు 1975, 2012. బాంబే ఫెస్టివల్ 1973 డాక్యుమెంటరీ. సికిందరాబాద్ శ్రీ విఘ్నేశ్వరాలయం (ప్రతి సంవత్సరం). యాదగిరిగుట్ట. శివపాదం నృత్యోత్సవం. శిల్పారామం. సంగీత నాటక అకాడెమీ ఆధ్వర్యంలో యక్షగాన స్పెషల్. నాద నీరాజనం - తిరుపతి. త్యాగరాయ ఆరాధన ఫెస్టివల్. ఎస్‌ఐసిఏ ఆధ్వర్యంలో. సిద్దేంద్రయోగి జయంతి ఉత్సవం - కూచిపూడి. తానీషా ఫెస్టివల్ - కూచిపూడి. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎన్నో లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్స్. ఒరిస్సా - భువనేశ్వర్ 2009.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి