S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం -- (21-10-2018 నుంచి 27-10-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం గౌరవ లోపాలకు అవకాశం. లాభాలు ఆశించినంతగా లభించక పోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. ఊహించని సంఘటనలకు అవకాశం. అసంతృప్తి. సోమవారం ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. ప్రయాణావకాశాలు. కార్యనిర్వహణలో ఆలస్యం. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అవకాశం. మంగళవారం భాగస్వామ్యాలపై దృష్టి. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల్లో అనుకూలత. సంతోషం. బుధవారం నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలలో ఒత్తిడులుంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలకు అవకాశం. గురువారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు. శుక్రవారం సామాజిక అనుబంధాల్లో జాగ్రత్త. పితృవర్గ సంబంధ సమస్యలు. ఆరోగ్యం జాగ్రత్త. ఒత్తిడులుంటాయి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం పరిచయాలు విస్తరిస్తాయి. గౌరవం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సోమవారం లాభాలు కోల్పోయే అవకాశం. అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. ప్రయోజనాలు ఆశించినంతగా ఉండవు. మంగళవారం పోటీ రంగంలో గుర్తింపు. శ్రమ తప్పక పోవచ్చు. పెద్దలతో అనుకూలత. ఒత్తిడులతో కార్యక్రమాలుంటాయి. బుధవారం ఆధ్యాత్మిక వ్యవహారాలకు అనుకూలం. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు. ఉన్నత విద్యలో ఆటంకాలు. గురువారం వ్యతిరేక ప్రభావాల విషయంలో జాగ్రత్త. ఖర్చులు పెట్టుబడుల్లో ఇబ్బందులు. పోటీ రంగం ఇబ్బందికరం. శుక్రవారం విజయం చేకూరుతుంది. గుర్తింపు లభిస్తుంది. పరామర్శలకు అవకాశం. వ్యతిరేకతలపై విజయం. శనివారం సంప్రదింపుల్లో అననుకూలత.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ఆదివారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. విద్యారంగంలో గుర్తింపు. పెద్దలతో వ్యతిరేకతలు కూడదు. పోటీ రంగంలో విజయం. భాగస్వామ్యాల్లో కొన్ని ఒత్తిడులు. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. సామాజిక అనుబంధాల్లో ఒత్తిడులకు అవకాశం. శ్రమాధిక్యం. మంగళవారం ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. వ్యవహారాల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో ఉన్నతి. బుధవారం లాభాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని ఇబ్బందులు. దానధర్మాల వల్ల మేలు. గురువారం అభీష్టసిద్ధి. సంతాన వర్గంతో సంతోషం. ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. పెద్దల ఆశీస్సులు. శుక్రవారం మానసిక ఒత్తిడులు. శ్రమతో కార్యక్రమాలు. సంప్రదింపులుంటాయి. అనుకూలమైన వార్తలుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం అనుకోని సమస్యలున్నా అధిగమిస్తారు. ఆలోచనలకు రూపకల్పన. ఊహించని సంఘటనలకు అవకాశం. నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలి. సోమవారం దూర ప్రయాణాల్లో అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత విద్యలపై ప్రత్యేక దృష్టి. వ్యతిరేకతలున్నా విజయం. మంగళవారం ఆహార విహారాల్లో సంతోషం. కొత్త పనులపై దృష్టి. దూర ప్రయాణ ఆసక్తి. కీర్తి ప్రతిష్ఠలు. బుధవారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఇబ్బందులు. అధికారులతో జాగ్రత్త. గురువారం గృహ వాహనాదుల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. ప్రయాణాలుంటాయి. సౌఖ్యం. శుక్రవారం ఆహార విహారాదుల్లో జాగ్రత్త. శ్రమతో కార్యక్రమాలు. శారీరక ఒత్తిడులు. ప్రయాణాది సౌకర్య లోపాలుంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం పరిచయాలు భాగస్వామ్యాలు విస్తరించే అవకాశం. ఆహార విహారాల్లో అనుకూలత. పెద్దలతో అనుబంధాలు మెరుగుపడతాయి. కొంత శ్రమ తప్పకపోవచ్చు. సంతోషం. సోమవారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. ఆందోళన అధికవౌతుంది. ఆలస్యం. మంగళవారం కొత్త వార్తలకు అవకాశం. సంప్రదింపులుంటాయి. దగ్గరి ప్రయాణాదులకు అవకాశం. శ్రమాధిక్యం. బుధవారం ఉన్నత లక్ష్యాలపై దృష్టి. నూతన కార్యక్రమాలు ప్రభావితం చేస్తాయి. దైవ కార్యక్రమాలకు అనుకూలం. గురువారం స్ర్తి వర్గంతో సంప్రదింపులుంటాయి. ప్రయాణాల్లో సంతోషం. సంతృప్తి. ఇతరుల సహకారం లభిస్తుంది. శుక్రవారం అధికారుల సహకారం. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. కొంత ఒత్తిడి ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. పెద్దలతో సంప్రదింపులకు అనుకూలం. ధార్మికమైన ప్రయాణాలకు అవకాశం. గురువుల సహకారం లభిస్తుంది. సోమవారం భాగస్వామ్యాల్లో అనుకూలం. పరిచయాలు అనుబంధాల్లో ఇబ్బందులుంటాయి. సౌకర్యాలు కోల్పోయే అవకాశం. మంగళవారం కుటుంబంలో సంతోషం. నిల్వధనంపై దృష్టి. వ్యాపార వర్గంతో అనుబంధాలు విస్తరిస్తాయి. బుధవారం అనుకోని సమస్యలు. అన్ని పనుల్లో జాగ్రత్త. ఆలోచనల్లో ఆందోళన. సంతాన వర్గంతో జాగ్రత్తగా మెలగాలి. గురువారం కుటుంబంలో అనుకూలత. కొన్ని పనుల్లో శ్రమ ఉన్నా అధిగమిస్తారు. కార్యనిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. శుక్రవారం నిల్వధనం ఇబ్బంది పెట్టే సూచనలు. మాట తీరులో కొంత గందరగోళం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ సంతృప్తి. సృజనాత్మకత. కుటుంబంలో శుభ పరిణామాలు. ఆర్థిక నిల్వలు పెరిగే సూచనలు. మాట విలువ పెరుగుతుంది. సోమవారం సేవక వర్గ సహకారం. వ్యతిరేక ప్రభావాలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. పోటీ రంగంలో శ్రమాధిక్యం. మంగళవారం నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసం. వ్యాపార వ్యవహారాల్లో శ్రమ ఉన్నా ఫలితం ఉంటుంది. బుధవారం సౌకర్య లోపాలు. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాలు, స్నేహానుబంధాల్లో ఇబ్బందులకు అవకాశం. గురువారం ఆనందంగా గడుపుతారు. భాగస్వామితో కలిసి ప్రయాణాలకు అవకాశం. కొత్త పనులకు శ్రీకారం. శుక్రవారం శారీరకమైన ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో చుక్కెదురు. తొందరపాటు కూడదు. శ్రమాధిక్యం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం ఆహార విహారాలకు అనుకూలం. శ్రమ ఉన్నా ఫలితం ఉంటుంది. అనేక కార్యక్రమాల బాధ్యతలుంటాయి. నిర్వహణ శక్తిని పెంచుకుంటారు. పెద్దల అనుకూలత. సోమవారం కుటుంబంలో ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో కొంత ఆలస్యం. మాట విలువ తగ్గే సూచనలున్నాయి. మంగళవారం పెట్టుబడులు అధికం. వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. మనోభీష్టాలు నెరవేరుతాయి. బుధవారం వ్యతిరేక ప్రభావాలు ఇబ్బంది పెట్టవచ్చు. సంప్రదింపుల్లో లోపాలు. కొన్ని ఇబ్బందికరమైన వార్తలు వినవచ్చు. గురువారం సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. వ్యర్థంగా కాలం ధనం కోల్పోయే సూచనలు. కార్యనిర్వహణలో జాగ్రత్త. శుక్రవారం ప్రభుత్వ సంబంధ రుణాలను వెంటనే కట్టివేయాలి. పోటీ రంగంలో ఇబ్బందులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం ధార్మికమైన ఖర్చులకు అవకాశం. తప్పనిసరి ప్రయాణాలు. ధార్మిక దానాల వల్ల మేలు. ఆధ్యాత్మిక యాత్రలు సంతోషాన్నిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. సోమవారం నిర్ణయాదుల్లో ఆలస్యం. అన్ని పనుల్లో జాగ్రత్త. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఇబ్బందులు. మంగళవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది ప్రయోజనాలు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. బుధవారం అభీష్టాలు నెరవేరుతాయి. కుటుంబంలో కొంత ఒత్తిడి. మాటల్లో నైరాశ్య ధోరణి. సంతానంతో జాగ్రత్త. గురువారం సృజనాత్మకత. సంతోషంగా గడుపుతారు. కొత్త పనులపై దృష్టి. నూతన వ్యవహారాల రూపకల్పన. శుక్రవారం పెద్దల ఆశీస్సులు. అధికారుల అండదండలు లభిస్తాయి. పితృ వర్గ సంబంధమైన శుభ వర్తమానాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)
ఆదివారం పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు. మాటల్లో అనుకూలత. ఆర్థిక నిల్వలు బాగా పెరిగే సూచనలు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సోమవారం సంప్రదింపులుంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు. వ్యర్థంగా కాలం, ధనం కోల్పోవచ్చు. మంగళవారం అధికారిక వ్యవహారాల్లో అనుకూలత. పదోన్నతులకు అవకాశం. వ్యాపార రంగంలో సంప్రదింపులు. బుధవారం సౌకర్యాలపై దృష్టి. ఆహార విహారాలపై ఆసక్తి ఉన్నా ఆశించిన సంతోషం లభించకపోవచ్చు. జాగ్రత్త. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. గృహ వాహనాదులు సమకూర్చుకుంటారు. ప్రయాణాలుంటాయి. శుక్రవారం పదోన్నతులకు అవకాశం. బాధ్యతల వల్ల గుర్తింపు ఉన్నా శ్రమ అత్యధికం. వ్యవహారాల్లో విజయ సాధన.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)
ఆదివారం పనులన్నింటినీ సంతృప్తిగా నిర్వహిస్తారు. శ్రమ ఉన్నా అభీష్టసిద్ధి. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. బాధ్యతలు అత్యధికం. గుర్తింపు. గౌరవం. సోమవారం ఆశించిన లాభాలు అందకపోవచ్చు. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట తీరులో కొంత జాగ్రత్త అవసరం. మంగళవారం లక్ష్యాలను సాధిస్తారు. అన్ని కార్యక్రమాలకూ అనుకూలం. ఉన్నత విద్య, ఉద్యోగాదులు, కీర్తిప్రతిష్ఠలు. బుధవారం సంప్రదింపులుంటాయి. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. పరామర్శలకు అవకాశం. గురువారం సహకారం లభిస్తుంది. అత్యున్నత వ్యవహారాలుంటాయి. సుదూర ప్రయాణాలు, ప్రణాళికలకు అవకాశం. శుక్రవారం కొంత ఒత్తిడి ఉన్నా పనుల నిర్వహణలో సంతృప్తి. గౌరవం పెరుగుతుంది. అధికారులతో అనుకూలత.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదివారం ఖర్చులు పెట్టుబడులకు అనుకూలం. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. పెద్దల అనుకూలత. నూతనమైన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి. విందులు వినోదాలుంటాయి. సోమవారం వృత్తి ఉద్యోగాదులలో శ్రమ ఉన్నా గుర్తింపు. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. బాధ్యతలు విస్తరిస్తాయి. మంగళవారం వ్యాపార వ్యవహారాల్లో ఒత్తిడులు. అనుకోని ఇబ్బందులు. నష్టాలకు అవకాశం. ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. బుధవారం కుటుంబంలో కొంత జాగ్రత్త అవసరం. లాభాలున్నా ఆశించిన సంతోషం లభించకపోవచ్చు. గురువారం ఊహించని సంఘటనలు. నిల్వధనం పెంచుకోవడంలో విఫలం. సంతోషం కోసం వ్యర్థంగా కాలం ధనం వ్యయం. శుక్రవారం అధికారిక వ్యవహారాల్లో లోపాలుంటాయి. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. పితృవర్గంతో ఒత్తిడులు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ