S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పత్రికారంగ ప్రవేశానికి సిద్ధం!

ఇంగ్లీషులో ఓ సామెత ఉంధి.. ‘కమింగ్ ఈవెంట్స్ కేస్ట్ దెయర్ షాడోస్’ అని. ఆగామికంలో నాకు ఏమి రాసిపెట్టి ఉన్నదో 1959లోనే యాదృచ్ఛికంగా ద్యోతకం అయింది. మా మామ్మా, అమ్మానాన్నలు పెట్టిన పేరుని- దాని చివర వున్న డిగ్రీ తోకతో పాటు త్యజించి నేను ఫుల్‌టైం ‘వీరాజీ’గా పత్రికా రచయితగా, వర్కింగ్ జర్నలిస్టుగా పరకాయ ప్రవేశం చేసి, జీవన పోరాటం సాగించడానికి కలం, కాగితం పట్టుకొని పూర్తిగా కొత్త సంఘ జీవితం మొదలెడతానని ‘కృష్ణమూర్తి’ని ఆంధ్రా యూనివర్సిటీ అవుట్‌గేట్ దగ్గరే వదిలేస్తానని - ఎవరు అనుకున్నారు?... జీవితానికైనా, విశ్వవిద్యాలయానికైనా ప్రవేశం, నిష్క్రమణం రెండూ రెండు ద్వారాలు - అంటూ నేను ఓ కవితలో ఉటంకించినట్లు - వెళ్తున్నప్పుడు కొండంత ఆశతో వెళ్లి, వస్తున్నప్పుడు ఆకాశమంత వెలితితో వస్తున్న వెర్రివాడా? కొత్తగా వస్తున్న మూతి మీది మీసం సంగతి మరచిపోకు అనుకున్నాడు అమ్మాయిగారి కృష్ణుడు. మాకు ఎస్.ఎల్.నరసింహం అని ఫ్రెండు వుండేవాడు. జ్యేష్ఠకి ఎస్‌ఎల్‌కి చుక్కెదురు. కాని సింహం కూడా జీనియస్. కాకపోతే కొంచెం ‘ఇది’ మంత్రాలు, తంత్రాలు - ధ్యానం నామజపం లాంటివన్నీ ఎస్‌ఎల్ ‘్ఫల్డు’ - తర్వాత రైట్ అబౌట్ టర్న్ కొట్టాడు కానీ అప్పటికి గతి తార్కిక భౌతిక వాదమే ఐన్‌స్టీన్‌కి కూడా తలకెక్కింది అనేవాడు జ్యేష్ఠ. శ్రీశ్రీని మాక్సిం గోర్కీని చదవాలండీ మీరు అంటూ ఎస్సెల్‌తో లడాయి పెట్టుకొనేవాడు - ఇద్దరూ జీనియస్‌లే. కాకపోతే జ్యేష్ఠ అను ఇవటూరి చిన బసవరాజు - ఇంజనీరింగు సబ్జెక్టుని వదలకుండా పరీక్షల్లో బిఇలో ఆనర్స్ మార్కులు సంపాదించాడు. నరసింహం న్యూక్లియర్ ఫిజిక్స్ అర్థం చేసుకోను పొమ్మన్నాడు ఫిలాసఫీలో కొట్టుకుపోయి - మహారాష్టల్రో యోట్మల్ కాలేజీలో ఫిజిక్స్ పాఠాలు ఎంతో అసంతృప్తితో చెపుతూ జీవన రథాన్ని లాగించాడు. జ్యేష్ఠ కథకుడు. నన్ను కృష్ణ అనే రిఫర్ చేసేవాడు. అతను రాసిన ఉత్తరాలు కొల్లలు. టిపికల్‌గా ఎన్ని రాసేవాడో? అవి పబ్లిషబుల్ కూడా. వాటికి భిన్నంగా ఇంగ్లీషులో మాత్రమే పేజీలకు పేజీలు కట్టలు రాసేవాడు సింహం. ఒకసారి. రావిశాస్ర్తీ గారితో కలిసి - శ్రీశ్రీ మా హాస్టల్ క్యాంపస్‌కి వచ్చాడు. ఆ ఇద్దరూ అంటే జ్యేష్టకి పూనకమే. శ్రీశ్రీ కొత్త. కానీ మాకు రావిశాస్ర్తీగారు అలవాటే. ఆనాడు, కొండముది శ్రీరామమూర్తి కూడా వున్నాడు. మా చర్చలతో ఆకాశం చిన్నబుచ్చుకున్నట్లు - చీకట్లు వాలసాగాయి. జ్యేష్ఠ ఓ పది రూపాయల నోటు తీశాడు... అది చూసి తన సిగరెట్టుని శ్రీశ్రీ రెండు వేళ్ల మధ్యకి మార్చుకుని గట్టిగా దమ్ము లాగాడు. నోటు మీద ఆటోగ్రాఫ్ ఇమ్మన్నాడు బసవరాజు అను జ్యేష్ఠ - శ్రీశ్రీ నోటు అటూ ఇటూ తిప్పి ‘కొత్తదే...’ అన్నాడు. ‘అందుకే మీ సంతకం కావాలి’ -జ్యేష్ఠ - బాబ్బాబూ ఇది నాకిచ్చీ కూడదా? ఫ్యాగ్‌కి ఇచ్చేస్తాను. పావుకావు మీద ఓ పుంజీడు సంతకాలు పెట్టీస్తాను - నవ్వుతూ శ్రీశ్రీ గారన్నారు.
‘ఉహూ.. నో వాల్యూ - మెసేజ్ అండ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంతే...’
‘సరే...’ అంటూ ఆ నోటు మీద రీడ్.. రీడ్ అండ్ రీడ్ అని గొలికి సంతకం పెట్టాడు మహాకవి. చాలా సెన్సిటివ్ రాజు (నేను తనని రాజు అని ఏకవచనంలో పిలవాలని అతని డిమాండ్) అలక, కోపం ముక్కుమీదే వుండేవి. మూడు రోజుల దాకా మండిపోతూనే ఉన్నాడు. ‘్ఛ! ఇంత ‘వోరేషస్ రీడర్ని’ నేను.. రీడ్ రీడ్ అంటాడా? శ్రీశ్రీ నన్ను, ఒప్పుకోను’ అన్నాడు. అతని పీక ఇలా నొక్కేయ్యాలి. ఇన్సల్ట్ చేస్తాడా? బుసలు కొట్టాడు విత్ ఆల్ లవ్ ఫర్ శ్రీశ్రీ.. నిజంగా జ్యేష్ఠ గొప్ప థింకర్. లోతైన స్టడీ చేసి కథలు రాసినవాడు - నా కవిత్వాన్ని ప్రేమించాడు - ఆనక జ్యోతి వీక్లీకి కాలమ్ కూడా రాశాడు.
అతని పేర ప్రతిష్ఠాత్మకమయిన అవార్డులు కూడా పెట్టారు. మద్రాసు వెళ్లినాక అతనితో టచ్ లేదు.
ఇక ఎస్‌ఎల్ అర్జెంటుగా ఓ రాత్రి వచ్చాడు. పోదాం రమ్మన్నాడు. నా రూమ్మేటు గోపాలం అను పీఎస్వీజీ కృష్ణమూర్తికి నిద్ర పట్టింది అప్పుడే. లేకపోతే తరిమేవాడు సింహాన్ని.. కాని మేము గేటు చివర బడ్డీ కొట్టు దాని దగ్గర పక్కకి- పల్లంలోకి వెళ్లిన తరువాత చెప్పాడు. ఆ పుట్టలో ఓ పాముంది. అది వచ్చి పడగ విప్పేలాగా నేనో మంత్రం ప్రాక్టీసు చేశాను -అన్నాడు.
‘మనం పాముల వాళ్లం కాదు. రూమ్‌కి పదపద. ఆ మంత్రం నేను కూడా చదువుతా. ముందా బుక్ నాకియ్యి (నాకు చెమటలు పడుతున్నాయి)
అదే మిత్రమా! నేను చెప్పేదీ ఆ పాము బయటికి రాంగానే దాని కనులలోకి నేను సూటిగా ఇలా లోతుగా చూడాలి - దాంతో అది స్థాణువై పోతుంది అన్నాడు.
గోపాలం వచ్చినా బాగుణ్ణు వీడి కళ్లల్లోకి వాడు చూస్తే వీడు తోక ముడిచేవాడు... ఎలాగరా భగవంతుడా.. అనుకోని ‘ఆగు సింహం! అమావాస్య రేపే.. మై ఫ్రెండ్ - రేపు వద్దాం’ అని నా సమయస్ఫూర్తికి నేనే వీపు తట్టుకున్నాను. నోనో.. టుడే రుూస్ ‘నో మూనే్డ’ అన్నాడా అప్పలనాయుడు..’ అన్నాడు. నేను పిడపర్తి వారి కేలండరు చూశానని కోశాను. మా వాడు నిత్యాగ్నిహోత్రుడు. ‘మానరా, మానవా ఆ స్మోకింగు - నిన్ను చంపేస్తుందిరా అంటే వినేవాడు కాదు.. అంతలో బడ్డీ నాయుడు ‘బాబూ... గోల్డు ఫేక్ ఇదిగో అట్టే పెట్టాను - బేగి రాకపోతే పోద్ది - రీసెర్చ్ బాబులున్నారు ఎత్తుకుపోతారు’ కేక వేశాడు. నిప్పు చాన్తాడు కోసం ఆగాడు నరసింహం. బ్రతుకుజీవుడా అని రూమ్‌కి పరుగులాంటి నడక సాగించాను. కాని, ఐతే నరసింహం వారం తరువాత వచ్చి- ‘గీత పారాయణ చేస్తున్నా.. మనస్సుకి శాంతిగా ఉంది. పాముల మీద ప్రయోగం స్టాప్’ అన్నాడు. నువ్వు కూడా గీత చదువు... అని చెప్పాడు. ‘నాకు నోరు తిరగదు ఇంగ్లీషులో- జిస్టు తెలుసుకుంటానులే’ నవ్వేశాను. నిజమే. చివరిసారి అవుట్ గేట్ దగ్గర నాకు ఈ దృశ్యం జ్ఞాపకానికి వచ్చింది. చనిపోతేనే? ఆత్మ కొత్త డ్రెస్సు వేసుకోవడానికి పోవాలా? అనడిగాను గోపాలాన్ని. బతికుండగా ఆత్మ బయటకు వస్తుందా మరి.. నువ్వే చెప్పు కృష్ణా...?
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com