S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుండాలాట

మన తెలుగు ఆటల పేర్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అనడానికి, వినడానికి కూడా బాగానే ఉంటాయి. ఒకప్పుడు అంటే పది పనె్నండేళ్ల క్రితం అయితే ఒక వాడలోని పిల్లలంతా ఒక దగ్గర చేరుకుని ఆటలాడుకునేవారు. అలా కలసిమెలసి ఆడుకోవటం వల్ల స్నేహితులుగా కాకుండా తోబుట్టువుల మాదిరిగా ఉండేది వారి మధ్య బంధం. ఇక ఇప్పుడు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు.. ఇదే లోకం. బయటి వారి స్నేహం కాదు ఇంట్లో వాళ్ల మీద ప్రేమానుబంధాలు ఉండటంలేదు. స్పీడ్ టెక్నాలజీతో పిల్లలు బాగా జ్ఞానం సంపాదించుకుంటున్నారనుకుంటున్నాం. కానీ ప్రేమలు సన్నగిల్లిపోతున్నాయి. ఇంట్లోనే ఉండి ఒంటరిగా యూ ట్యూబ్, గూగుల్, నెట్ చూసుకుంటూ అందులో లీనమై పోతున్నారు. టెక్నాలజీ వల్ల ప్రతి పిల్లవాడు జ్ఞానం పెంచుకోవచ్చు లేదా పెంచుకోకపోవచ్చు. కానీ పాతకాలంనాటి ఆటలు ఆడినట్లయితే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పురాతన ఆటల్లో ఒకటి ‘గుండాలాట’.
ఎలా ఆడాలో చూద్దాం.
గుండాలాటలో వృత్తాలు (గుండాలు) గీస్తారు ఒకదానికొకటి కలుపుతూ. ఈ ఆటను ఎంతమందయినా ఆడవచ్చు. కాకపోతే ఒక్కొక్కరుగా ఆడాలి. ఒక పెంకుముక్కను కానీ, చిన్న పలుచని రాయిముక్కను కానీ ముందుగా ఒకటో గుండంలో వేయాలి. ఆ తరువాత ఒక వ్యక్తి ఆ మొదటి గుండంలో అడుగు వేయకుండా దాటి కుంటుకుంటూ 5వ గుండంలో రెండు కాళ్లు వేసి మళ్లీ తిరిగి కుంటుకుంటూ ఒక్కొక్క గుండం దాటుకుంటూ వచ్చి మొదటి గుండంలోని పెంకుముక్కను ఒక్క కాలుతో బయటకి నెట్టి, రెండు కాళ్లతో ఆ పెంకుముక్కను తొక్కాలి. అలా త్రొక్కకపోతే ఓడిపోయినట్లవుతుంది. అలాగే 5వ గుండం కూడా అయిపోయిన తర్వాత 5వ గుండం దాటి బయట విసిరి కుంటుకుంటూ వెళ్లి దాన్ని త్రొక్కి అక్కడి నుండి మొదటి గుండం దాటి నెట్టాలి. అలా బయటకి రాకుండా మధ్యలోని ఏదయినా గుండంలో గానీ, గీతల మీద కానీ పడినట్లయితే వాళ్లు ఓడిపోయినట్లే. ఎవరయితే 5 గుండాలు, 5వ గుండం అవతల కూడా పెంకుముక్కను త్రొక్కి బయటకి నెట్టి దానిని త్రొక్కుతారో వారు గెలిచినట్లు లెక్క.

-శ్రీనివాస్ పర్వతాల 9490625431