S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్టెనోగ్రఫీ (సండేగీత)

స్టెనోగ్రఫీ చాలా కష్టమైన విద్య.
ఎన్నో నెలలు నిరంతర శ్రమతో నేర్చుకునే విద్య. వాళ్లు రాసుకున్న గీతలు వాళ్లకి తప్ప ఇతరులకి అర్థం కావు. వాళ్లు పడిన శ్రమని ఏ రంగంలో చూపినా ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చేది.
త్వరగా ఉద్యోగం వస్తుందని వాళ్లు ఈ విద్యని నేర్చుకుంటారు. స్టెనోగ్రాఫర్స్ చేసే పనిలో క్రియేటివిటీ తక్కువగా ఉంటుంది. కొంత ఇంగ్లీషు మంచిగా వచ్చిన స్టెనోగ్రాఫర్స్ డిక్టేషన్ ఇచ్చిన వ్యక్తి భాషని కొంత సంస్కరిస్తారు. మిగతా వాళ్లు డిక్టేషన్‌ని యథాతథంగా టైప్ చేస్తారు. మరి కొంతమంది తప్పులతో టైప్ చేస్తారు.
ఉద్యోగం కోసం స్టెనోగ్రఫీ ఫర్వాలేదు.
కానీ.. నిజ జీవితంలో మాత్రం స్టెనోగ్రాఫర్ కూడా స్టెనోగ్రాఫర్‌గా ఉండకూడదు.
అతను క్రియాత్మకంగా, సృజనశీలిగా ఉండాలి.
ఆ మాటకొస్తే ఎవరూ కూడా నిజ జీవితంలో స్టెనోగ్రాఫర్‌గా మారకూడదు.
గతించిన జీవితంతో సంబంధం లేకుండా, రాబోయే జీవితంలోని స్క్రిప్ట్‌ని ఎవరికి వాళ్లే రాసుకోవాలి.
మరొకరి డిక్టేషన్‌కి అనుగుణంగా అతని భవిష్యత్తు వుండకూడదు.
సలహా అవసరమే.
నిర్ణయం మాత్రం మనదే ఉండాలి.
మన జీవితం ఇతరుల గొంతుతో ప్రభావితం కాకూడదు.
మనమున్న స్థితికి మనమే కారణం.
పరిస్థితులు సరే!
ఎక్కువగా మనమే కారణం.
మన భవిష్యత్తుకు మనమే కారణం కావాలి.
అంతే!
స్టెనోగ్రఫీ కష్టమైన విద్య
జీవితంలో అత్యంత సులువైన విద్య.
మన భవిష్యత్తు గీతలు మనం రాయడమే అవసరం.
అది కష్టమైనా సరే!

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001