S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భూతం అంటే దెయ్యం కాదు..

మన వ్యావహారిక తెలుగు భాషలో, ఇతర ప్రాంతీయ భాషలలో కూడా భూతము’ లేక భూతాలు’ అంటే పిశాచము లేక పిశాచాలు అని అర్థము. కానీ, సంస్కృత భాషలో మొదటిలో అర్థం ఇది కాదు.
వేదాలలో అన్నిటికంటె పురాతనమైనది పురుష సూక్తము. దీనిలో విష్ణువు బ్రహ్మని సృష్టించిన విషయము ప్రస్తావించబడింది.
సంస్కృత భాషలో భూ’ అనేది ప్రాథమిక క్రియగా వ్యవహరించారు. భూవ’ భూవతి’ అనగా ఆమె లేక అతను అవుతుంది లేక అవుతాడు అని భావం.
పురుష సూక్తములో ‘యత్ భూతం యచ్చ్భవ్యం’ అనగా పూర్వంలో ఉన్నది భవిష్యత్తులోనూ ఉంటుంది అని అర్థం. ఇక్కడ భూతం’ అనగా జరిగినది అని అర్థం.
పురుష సూక్తంలో ‘పాదోస్య విశ్వ భూతాని’ అని చదువుతాం. అనగా ప్రపంచంలో ఉన్నది అంతా భగవంతునిలో ఒక పాదం అనగా చతుర్థము అని భావం.
పురాతనమైన ‘శ్రీ సూక్తం’లో శ్రీదేవి అవతరణము గురించిన వర్ణనలో ‘దాసీ భూత సమస్త దేవ వనితాం’ అని వర్ణన ఉంది. అనగా సమస్త దేవతా స్ర్తిలు ఆమె సేవకులు అని. ఇక్కడ ‘్భత’ అంటే ప్రాణులు అని అర్థం.
మంత్ర పుష్పములలో చాలా వస్తువులలో జలము నుంచి ఉద్భవించెనని చెప్పబడింది. ‘అన్తశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిఘ’ అనగా సమస్త ప్రాణుల యొక్క రహస్య స్థలములు అగు హృదయములలో సంచరించుచున్నది. భూతేషు అనగా సమస్త ప్రాణులు అని అర్థం.
సంధ్యావందనంలో సూర్యుడు, సూర్యకాంతి గురించి వర్ణన వివరించబడినది. దీనిలో ‘ఉతిష్టంతు భూత పిశాచహః ఏతే భూమి భారకా’ అనగా భూమికి భారంగా వున్న భూత పిశాచాలు లేచిపోవు గాక అని అర్థం.
ప్రస్తుత కాలంలో కామ క్రోధ మద మాత్సర్యాలు అని చెప్పవచ్చును. సంధ్యా వందనంలో ‘వాసనా వాసు దేవస్య వాసితంతే జగత్త్రయం సర్వ భూతాని వాసోసీ వాసుదేవ నమోస్తుతే’ అని చదువుతాం. ఇక్కడ కృష్ణ భగవానుడు అన్ని ప్రాణులలోను ఉండునని అర్థం. విష్ణు సహస్ర నామాల ఉత్తర పీఠికలో భీష్ముడు ధర్మరాజుకి ద్వాపర యుగాంతములో చెప్పినట్లు
ఏకో విష్ణుర్ మహద్ భూతం
పృథభూతా న్యనేకశ
త్రీన్‌లోకాన్ వ్యాప్త భూతాత్మ
భుంకై విశ్వభుగవ్యయః
అనగా విష్ణువు పెద్ద ప్రాణి (భూతం) అని, భూమిపై అనేక ప్రాణులు( భూతాలు) వున్నాయని అర్థం.
శివుడిని భూతనాథ అని పిలుస్తారు. పిశాచాలకు నాథుడని దీనినిబట్టి భూత అనే మాట మొదట్లో ప్రాణి అని వ్యవహరించబడినది. తర్వాత దయ్యాలు అని అర్థము వచ్చినది.

-కె.ఆర్. బెనర్జీ 97054 72897