S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దశదిశలా దివ్వెల కాంతులు

దీపావళి పండుగ ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, విశిష్టత కలిగినది. అంతేకాదు.. ఇది చాలా అందమైన పండుగ కూడా.. పూర్వం విశాఖదత్తుడు తన ముద్రా రాక్షస నాటకంలో దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా వర్ణించాడు. కౌముది అంటే వెనె్నల. కార్తీక మాసాన్ని కౌముదీ మాసంగా పరిగణిస్తారు. కార్తీక మాసం ప్రారంభమయ్యే దీపావళి అమావాస్య రోజు దీపాల వెలుగులతో నిండి ఉంటుంది కాబట్టి దీపావళిని ‘కౌముదీ మహోత్సవం’గా చెప్పాడు. అంతేకాదు ఈ మాసమంతా ముత్తయిదువలు దీపాలను వెలిగించి చివరగా జీవనది ద్వారా స్వర్గానికి చేర్చడం వల్ల తమతమ సుమంగళ్యత్వం, పాడిపంటల సమృద్ధి, సంతానాభివృద్ధి చెందుతుందని హైందవుల ప్రగాఢ విశ్వాసం. దీపావళి రోజునే విక్రమార్కుడు పట్ట్భాషిక్తుడయ్యాడనే మరో చారిత్రక కథ ఉంది. ఆ దీపావళిని స్వర్ణ దీపావళిగా ఋగ్వేదం విశదీకరించింది. భోజమహారాజు దీనిని ‘సుఖరాత్రి’గా అభివర్ణించాడు. హర్ష చక్రవర్తి దీపావళిని ‘దీప ప్రతి పాదోత్సవం’గా వ్యవహరించాడని నైషధ్య కావ్యం చెబుతోంది. జాతి, కుల, మత, వర్గ విచక్షణ లేకుండా సర్వమానవ సౌభ్రాతం వెల్లివిరిసి దశదిశలా చాటే పండుగే దీపావళి పండుగ.
దీపావళి భారతదేశ సాంస్కృతిక ప్రతీక అని పలుదేశాల్లో ప్రతీతి. వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో ఈ పండుగను జరుపుతారు. మానవునిలో దాగున్న విచారాన్ని (చీకటిని) పోగొట్టి ఆనందాన్ని (వెలుగును) వికసింపచేసేదే దీపావళి. దీపాలు వెలిగించడం సంతోషానికి సంకేతం. యావద్భారతదేశమే కాకుండా విదేశాల్లోనూ దీన్ని జరుపుకోవడం విశేషం.
* జపాన్‌లో ‘తోరనో గోష్టి’ అనే పేరుతో దీపావళిని జరుపుకుంటారు.
* మారిషస్, వియత్నాంలలో దీపావళిని నూతన సంవత్సరంగా జరుపుకొంటారు.
* సుమిత్రా, జావా ద్వీపాల్లోనూ, జర్మనీలోనూ దీపావళిని చాలా ఘనంగా జరుపుకుంటారు.
* ఇరాన్, ఇరాక్, ఆస్ట్రేలియా, స్వీడన్‌లలోనూ ‘లూసియా డే’ అనే పేరుతో దీపావళిని జరుపుకుంటారు.
* నేపాల్‌లో ‘నేపాల్ తీహార్’ పేరుతో దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటారు. ‘గైఫాక్స్’ అనే పేరుతో ఆంగ్లేయులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.
* బర్మాలో ‘అంగేజుల పండుగ’ అన్న పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. దీనే్న ‘తంగజు’ అని కూడా అంటారు.
* చైనాలో ఈ పండుగను ‘నాయి మహూబా’ అన్న పేరుతో దీపాల్ని వెలిగించి పండుగ చేసుకుంటారు.
* థాయ్‌లాండ్‌లో దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. థాయ్‌లాండ్‌వారు దీపాల్ని వెలిగించడం పవిత్రకార్యంగా భావిస్తారు. వీరు పండుగ రోజున బాణాసంచాను ఘనంగా కాలుస్తారు.
* శ్రీలంకలో దీపావళిని జాతీయ పర్వదినంగా జరుపుకొంటారు.
* ఇజ్రాయిల్‌లో వారి స్వతంత్ర యోధుడు ‘మెకాబ్బిన్’ స్మృత్యర్థం ‘హనుక’ అనే దీపోత్సవం జరుపుతారు.
* గోవా పేరు చెప్పగానే అందరికీ అందమైన బీచ్‌లు, ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి దృశ్యాలు గుర్తుకు వచ్చేస్తాయి. దేశమంతా అట్టహాసంగా జరుపుకునే దీపావళి పండుగను గోవా వాసులు ఎంతో సంప్రదాయంగా జరుపుకుంటారు. దీపావళిని ‘దియాంచి ఆలి’ అంటే దీపాల వరుస అని గోవాలో పిలుస్తారు. దీపాలను కొంకణీ భాషలో ‘దియులీస్’ అంటారు. ఈ రోజున గోవా ప్రజలు అత్యంత ఉత్సాహంతో ప్రతి ఇంట్లో ఆకాశ దీపాలు వెలిగిస్తారు.
* దీపావళి రోజు సిక్కులు అమృతసర్‌లోని స్వర్ణదేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించి ప్రార్థనలు జరుపుతారు. వారి మత గురువైన గురుహర గోవింద సాహిల్ మొగల్ చక్రవర్తుల చెర నుండి విడుదలైన రోజు కనుక వీరు దీపావళిని ఉత్సాహంగా జరుపుకుంటారు.
* గుజరాత్, బెంగాల్ రాష్ట్రాల్లో దీపావళిని రైతులు ‘పశుపూజారి’ దినోత్సవంగా జరుపుకుంటారు. ‘్ధనతేరస్’ పేరున వీరికి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది.
* జైనులు దీపావళిని మహావీరుని నిర్వాణ దినంగా భావించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఆ రోజున అందరూ జైన మత గ్రంథాలను పారాయణం చేస్తారని జైన హరివంశం తెలుపుతోంది.
* ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దీపావళి రోజు గోవర్ధన గిరిని నిర్మించి పూజిస్తారు. ఉత్తరప్రదేశ్‌లో ‘్భరత్‌మిలాన్’ పేరిట దీపావళిని జరుపుకుంటారు.
* రాజస్థాన్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాల్లో దీపావళిని విభూత దయా నిర్దేశికంగా జరుపుతారు. కుక్కలకు, కాకులకు తృప్తిగా ఆహారాన్ని పెట్టి పసుపు కుంకుమలతో పూజించడం విశేషం. రాజస్థాన్‌లో దీపావళి పండుగ రోజు ‘హిడ్’ పూజ నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని ‘కాకత్సోహార్’ అంటారు.
* తమిళనాడు, మధుర ప్రాంతాల్లో దీపావళి పేరుతో ‘అన్నకూట్’ నిర్వహిస్తారు. అంటే పశుపక్ష్యాదులకు ఆహారాన్ని పెట్టి గౌరవిస్తారు. వీరు నరక చతుర్దశి రోజున ‘గోవర్థన గిరి’ని నిర్వహిస్తారు. దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి చేరి కానుకలు తెచ్చుకోవడం సంప్రదాయం.
* పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల్లో కాళీ పూజలు జరుపుతారు. ఈ పూజను ‘జగద్ధాత్రి’ అని పిలుస్తారు.
* కేరళలో బలిచక్రవర్తిని జయించిన రోజుగా పరిగణించి దీపావళి పండుగను జరుపుకుంటారు.
* మహారాష్టల్రో దీపావళి రోజున లక్ష్మీపూజను చేయడం పరిపాటి.
* మొఘల్ చక్రవర్తి అక్బరు దీపావళి పండుగను ఘనంగా జరపడం వల్ల ఆయన వ్యక్తిత్వం, ఔన్నత్యం ప్రదర్శితమవుతున్నాయని ‘అబ్దుల్ ఫజిల్’ రిసిన అక్బరు జీవిత చరిత్ర అనే గ్రంథం ద్వారా విశదమవుతోంది.
* రెడ్డి రాజుల కాలంలో దీపావళిని ‘దివ్వెల పండుగ’గా జరుపుకునేవారని ‘సింహాస నాద్వా త్రిశంక’ ద్వారా తెలుస్తోంది.
ఇలా భారతదేశంలోనే కాకుండా దేశవిదేశాల్లో అనాదిగా అన్ని మతాలవారు, అన్ని వర్గాలవారు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ దీపావళి పండుగ. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేదే దీపావళి పండుగ. మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే ఉషస్సులను నింపుతుంది కనుక ఈ దీపావళిని మనమంతా ఎన్నో ఆశలతో, ఆనందాలతో ఆహ్వానిద్దాం..

సూర్యదేవర. -ఉమా మహేశ్వరి