S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జాతి మెచ్చిన మేధావి.. వౌలానా

1.వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ స్వతంత్ర భారతదేశానికి...?

ఎ.ప్రథమ ఉన్నత విద్యాశాఖ మంత్రి
బి.తొలి విద్యాశాఖ మంత్రి
సి.మొట్టమొదటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
డి.తొలి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి

2.దేశ విభజన, పాకిస్తాన్ సృష్టిని వ్యతిరేకించిన మొట్టమొదటి ముస్లిం నాయకుడు ఆజాద్. వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి పురస్కరించుకుని నవంబర్ 11న ఏ దినోత్సవంగా ప్రకటించారు?

ఎ.జాతీయ ఉర్దూ భాషా దినోత్సవం
బి.జాతీయ మానవ వనరుల అభివృద్ధి దినోత్సవం
సి.జాతీయ అక్షరాస్యత దినోత్సవం
డి.జాతీయ విద్యా దినోత్సవం

3.వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పేరులో అతను కలం పేరుగా చేర్చుకొన్నదేది?

ఎ.వౌలానా బి.కలామ్
సి.ఆజాద్ డి.అబ్దుల్

4.22 ఫిబ్రవరి 1958 నాడు అస్తమించిన వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారికి మరణానంతరం భారతరత్న పురస్కారం ఎప్పుడు లభించింది?

ఎ.1961 బి.1987
సి.1992 డి.1999

5.ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న ఆజాద్ గౌరవార్థం భారతదేశం అంతటా అనేక సంస్థలకి అతని పేరు పెట్టారు. వౌలానా ఆజాద్ లైబ్రరీ ఎక్కడుంది?

ఎ.కలకత్తా బి.లక్నో
సి.అలీగఢ్ డి.్ఢల్లీ

6.35 సంవత్సరాల వయస్సులో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఆజాద్ ఎప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?

ఎ.1916 బి.1920
సి.1923 డి.1934

7.వౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ఒట్టోమన్ సామ్రాజ్యంలో హెజాజ్‌లో జన్మించారు. ఇప్పుడు ఆ ప్రదేశం ఏ దేశంలో భాగం?

ఎ.పాకిస్తాన్ బి.ఆఫ్గనిస్తాన్
సి.బంగ్లాదేశ్ డి.సౌదీ అరేబియా

8.్భరతదేశంలో బ్రిటీష్ రాజ్ పరిపాలన ఎండగట్టడానికి, భారత స్వాతంత్య్ర ఉద్యమం కోసం వౌలానా అబుల్ కలాం ఆజాద్ చేత నెలకొల్పిన ఉర్దూ భాషా వార్తాపత్రిక ఏది?

ఎ.అల్ బలగ్, ఆల్ హిలాల్
బి.ఆల్ హిలాల్, గులాం
సి.వకీల్, సలాం గులాం కలాం
డి.కలాం

9.తన రచనల ద్వారా గాంధీని ఆకట్టుకొన్న వౌలానా కలాం ఏయే ఉద్యమాలలో పాల్గొన్నారు?

ఎ.స్వీయ పాలన
బి.సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమం
సి.స్వదేశీ ఉత్పత్తులు
డి.పైవన్నియు

10.వౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఏ విద్యా సంస్థకు బీజం నాటి స్థాపనలో ఎంతో కృషి చేసి కీలక పాత్ర వహించారు?

ఎ.యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ (యుజిసి)
బి.ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి)
సి.జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం
డి.పైవన్నియు

---------------------------------------------------------------------------------------
గత వారం క్విజ్ సమాధానాలు
1.ఎ. 2.డి 3.బి 4.సి 5.సి 6.డి 7.బి 8.డి 9.డి 10.బి

-సునీల్ ధవళ 97417 47700