S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

'May the soul rest in peace' తప్పు !

ప్రస్తుత కాలం ఆంగ్ల విద్య చదువుకొన్న హిందువులు, ఆంగ్లంలో పోయిన ఆత్మశాంతిగా విశ్రమించుగాక అని చనిపోయిన వ్యక్తి బంధువులకు సానుభూతి తెలుపుటకు లేక మరణించిన వ్యక్తికి గౌరవం తెలుపుటకు వాడుతున్నారు.
ఈ వాక్యము యూదుల నుంచి క్రైస్తవులకు తరువాత మహమ్మదీయులకు వ్యాపించింది. ఈ మతాల వారు శవాలని భూమిలో పాతిపెట్టి పోయిన ఆత్మ అక్కడే విశ్రాంతి పొందుతూ వుంటుందని విశ్వసిస్తారు. అందువలన ఆత్మ శాంతిగ విశ్రమించు గాక అని అంటారు.
హిందూ మతంలో జీవి చేసుకున్న పాప పుణ్యాలనుబట్టి ఆ వ్యక్తి మరణానంతరం ఆత్మకి స్వర్గ, నరకాలు ప్రాప్తించునని తిరిగి పునర్జన్మ వస్తుందని నమ్మకం.
హిందువులు తక్కిన మతాల వారివలే కాకుండా పోయిన ఆత్మలకు కర్మకాండలు, మాసికాలు, సంవత్సరీకాలు జరుపుతారు. మానవ లోకంలో ఒక సంవత్సరం అంటే ఆత్మలకు ఒక దినము అవుతుంది. ఈ పిండ ప్రదానం మూడు తరాలకు అనగా తండ్రి, తాత, ముత్తాతలకు, తల్లి, తల్లి అత్తకి, తల్లి అత్త అత్తకి చేస్తారు.
ఈ క్రియల వలన హిందువులు పోయిన ఆత్మలు ఉంటాయని, తక్కిన మతాల వారిగా శాంతిగా విశ్రమించవని నమ్ముతారు.
పంజాబ్‌లోని హోషియాపూర్, చెన్నై, రాజమహేంద్ర వరములో లభ్యమయిన తాళపత్రాలలో దొరుకు నాడి జాతకాలలో క్రిందటి జన్మ ప్రస్తుతపు జన్మ గురించి వివరాలు దొరుకుతాయి. వీటి వలన ఆత్మ శాంతిగా పడుకోదని అర్థమవుతుంది.
అందువలన హిందువులు పోయిన ఆత్మ శాంతిగా విశ్రాంతి తీసుకోమని ప్రార్థించకుండా, భగవంతుడు- పోయిన ఆ ఆత్మకి శాంతి ఇవ్వవలనని ప్రార్థించాలి.
ఆంగ్ల విద్య, పాశ్చాత్యుల అనుబంధము వలన పోయిన ఆత్మ శాంతిగా వుండుగాక అని అర్థం తెలియకుండా వాడుతున్నారు. ఇది హిందువులకు వర్తించదు.

-కె.ఆర్. బెనర్జీ 97054 72897