S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వీరనారి లక్ష్మీబాయి

1.19 నవంబర్ 1828లో మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన రాణి ఝాన్సీ లక్ష్మీబాయి ఎక్కడ జన్మించారు?

ఎ.వారణాసి, ఉత్తరప్రదేశ్
బి.ఝాన్సీ, ఉత్తరప్రదేశ్
సి.గ్వాలియర్, మధ్యప్రదేశ్
డి.సతారా, మహారాష్ట్ర

2.1857 స్వాతంత్య్ర సమరం, సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరేమిటి?

ఎ.వసుంధర బి.మణికర్నిక
సి.వసంత లక్ష్మి డి.మనుభాయ్

3.వీరనారి, మొదటి మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలైన రాణి లక్ష్మీబాయి బ్రిటీష్ సేనలతో వీరోచితంగా పోరాడి 18 జూన్ 1858 నాడు నేలకొరిగింది. ఏ ప్రదేశంలో మరణించింది?

ఎ.జైపూర్ బి.గ్వాలియర్
సి.ఝాన్సీ డి.కాన్పూర్

4.బాల్యంలోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీబాయి ఇంటి పట్టున ఉండి విద్యాబుద్ధులు, విలువిద్య, కత్తియుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకొని చిన్నతనంలో ధైర్య సాహసాలు, స్వతంత్ర జీవనం అవలంబించుకొంది. ఏ కోటని రాణి లక్ష్మీబాయి తాంతియా తోపేతో కలిసి వశపరచుకొని బ్రిటీష్ సేనపై యుద్ధం కొనసాగించారు?

ఎ.ఆగ్రా బి.ఎర్రకోట
సి.గ్వాలియర్ డి.అజ్మీర్

5.1842లో ఝాన్సీ మహారాజు, రాజా గంగాధర్‌రావు నెవాల్కర్‌ను వివాహం చేసుకొని పండంటి బిడ్డని కన్న ఝాన్సీ రాణికి నాల్గు నెలల్లోనే పుత్రశోకం మిగిలింది. బిడ్డను దత్తత తీసుకున్నాకా దత్తత బిడ్డ వారసుడు అవ్వడని కోట ఖాళీచేసి పొమ్మన్నది ఎవరు?

ఎ.లార్డ్ కర్జన్ బి.లార్డ్ డల్హౌసీ
సి.జనరల్ డయ్యర్ డి.జనరల్ రాబర్ట్ క్లైవ్

6.ఝాన్సీ రాం భర్త మరణానంతరం కోటను వదిలివెళ్లిపోతే ఎంత రొక్కం పింఛనుగా ఇస్తామని బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఝాన్సీ రాణికి చెప్పింది?

ఎ.రూ.1000 బి.రూ.5000
సి.రూ.15000 డి.రూ.60000

7.రాణి లక్ష్మీబాయ్ తెలివైనది, ధీరవంతురాలు, అందమైనది మరియు ఆమె ‘అందరు భారతీయ స్వాతంత్య్ర తిరుగుబాటుదారులకన్నా అత్యంత ప్రమాదకరమైనది’ అని ఎవరు కితాబిచ్చారు?

ఎ.సర్ హ్యూరోజ్
బి.గవర్నర్ జనరల్ చార్లెస్ క్యానింగ్
సి.గవర్నర్ జనరల్ రిచర్డ్ వెల్లస్లీ
డి.విక్టోరియా రాణి

8.లక్ష్మీబాయి యొక్క విగ్రహాలు భారతదేశంలోని అనేక ప్రదేశాలలో కనిపిస్తాయి. లక్ష్మీబాయి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ నెలకొల్పారు?

ఎ.వారణాసి బి.జబల్పూర్
సి.గ్వాలియర్ డి.ఇండోర్

9.మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది?

ఎ.్ఢల్లీ బి.ఝాన్సీ
సి.గ్వాలియర్ డి.ఘజియాబాద్

10.రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఆరంభించారు?

ఎ.మద్రాస్
బి.అండమాన్ అండ్ నికోబార్ దీవులు
సి.కొచ్చిన్
డి.మంగళూరు

11.ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క మహిళా విభాగానికి ఝాన్సీ రాణి రెజిమెంట్‌గా సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టి నెలకొల్పారు? ఝాన్సీ రాణి రెజిమెంట్‌కి ఎవరు నాయకత్వం వహించారు?

ఎ.సరోజినీ నాయుడు
బి.లక్ష్మీ సెహగల్
సి.దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్
డి.బికాజీ కామా
-----------------------------------------------------------------------------------
గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.డి 3.సి 4.సి 5.ఎ 6.సి 7.డి 8.ఎ 9.డి 10.డి

-సునీల్ ధవళ 97417 47700