S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాతిమేఢ నిర్మాణం ఎట్లా?

కొన్ని తమాషాలు హమేషా స్మృతి పథాన - మరపురాని మనోజ్ఞమైన సన్నివేశాలై నిలుస్తాయ్! నేను రాతి మేడ అనే చిన్న రొమాంటిక్ నవల రాయడం అట్లా జరిగింది. 1959-60 అంతా నేను కథలు - నవలలు నిర్విరామంగా రాస్తూనే వున్నాను. ఇరవై కథలు దాకా ప్రధాన పత్రికల్లోనే ప్రచురణ అయ్యేయి. తొలిమలుపు - రాయడం ఒక జీవిత కాలపు తపస్సు అయితే - రాతిమేడ రాయడం - ఒక యాదృచ్ఛికమైన మనోజ్ఞ సన్నివేశం. తొలి మలుపు సాపు కాపీ రాస్తున్నప్పుడు - నేను విశాలాంధ్ర దినపత్రికలో వాళ్లు వాడకుండా పడేసిన ‘టాస్’ బులెటిన్స్ తెచ్చుకుని (తమ్ముడిది క్రెడిట్) యొక్క వీపులను వాడుకున్నాను - సైక్లోస్టైల్ పావుటావు కాగితాలవి. వాడు చిన్నారిలోకం పేజీలు పెట్టడంలో పరకాల గారికి సాయం చెయ్యడానికి వెళ్లేవాడు. నేను క్యాంపస్ నవల రాస్తున్న సంగతి మహీధరకి - ఆయన ద్వారా సీనియర్ గారికి - (వీళ్లే అక్కడ సిద్ధాంత పత్రిక సందేశం పెద్దలు) రామమోహనరావుగారికి తెలిసింది. కొన్ని పుటలు తెప్పించుకుని చదివారు. సంతోషం పట్టలేక - సీనియర్ గారితో కలిసి మొగల్రాజపురం నుంచి ఇంచిపేటకి వచ్చారు రామోగారు. అమ్మనడిగి పీటలు వేసుకుని కూర్చున్నారు. ఉప్మా పెడితే తిన్నారు. ఈ ‘సిగ్గుల పెళ్లికొడుకు’ కొత్త నవల రాస్తున్నాడు.. దాన్ని ‘ఎక్కలాగి’ (ఈ మాట మహీధర గారిది) జనం ముందు పెడతాము - ‘మీరో మాట చెప్పండమ్మా. సభా పిరికితనం పోవాలి’ సీనియర్‌గారు మా కుర్రాళ్లు మీ వాడికి ఇంటర్‌లో ఫ్రెండ్సేనమ్మా అన్నప్పుడు - నాకు ఇదేదో మహా పతకం లభించినట్లు మనసు ఉద్దేలమై పోయింది. మీ వాళ్లు ఇద్దరూ (తమ్ముడు అప్పుడు పిళ్లా సుబ్బరావు శాస్ర్తీ) మీకు పేరు తెస్తారు చింత వద్దు అని. వాడి ఇష్టాన్ని వాళ్ల నాన్నగారు వెనకేసుకు వస్తూనే వుంటారు అన్నది అమ్మ ఆశ్చర్యాన్ని దాచుకుంటూ. కొడుకు ‘కలం జీవి’ అవడానికి ఆమె సమ్మతి ఇచ్చేసింది అన్న మాట. ‘కాఫీ ఇస్తాను అని చెప్పరా నాన్నా’ అని వెళ్లిపోయేవారిని ఆగమన్నట్లు చూసింది. ఈసారి భోజనానికే దిగడతాము’ అన్నాడు మహీధరగారు - అట్లా నా రాత విజయ సాహితిలో రచ్చ కెక్కింది. గెలిచింది. ఒకసారి నవల ‘నాటి భాగం’ చదవడం అయిన తరువాత - చర్చ చిత్రంగా మారింది - జనతా శాస్ర్తీగారు, బజారుబిడ్డలు ఫేం శ్రీహర్రావుగారు - శ్రీవిరించి - వాదులాడుకుంటూ ‘ఏమి వీరాజీ? నవలకి చెప్పే తీరా? కథా?’ అని సవాల్ విసిరారు. ‘చెప్పడం గొప్పగా వుంటే - ఇతివృత్తం - ఓ ‘వృత్తం’ సున్నా అయినా ఫర్వాలేదండి అన్నాను అప్రయత్నంగా. ఘర్షణ సాగింది పెద్ద వాళ్ల మధ్య. నేను అన్నాను ‘ఇక్కడ నుంచి మొగల రాజపురం గుహల నుంచి రైల్వేస్టేషన్ దాకా రక్తి కట్టిస్తే రచన అదే నవలలాగ సాగుతుంది’ (నోరుజారి). శ్రీవిరించి గారు మీరే అట్లా రాసి చూపరాదా? అంటూ కొంటెగా నవ్వాడు. ఎంత టైము కావాలి అన్నారు మరి కొందరు. ఇంటి దారిలో తమ్ముడన్నాడు - రాసేయ్ ముందో 15 పేజీలు. పై ‘వీక్ చదువు’ - బుర్రలో దాక్కున్న ఫైల్స్ తెరుచుకున్నాయి. చిన్ననాటి వైజాగ్ (మా అమ్మ - అమ్మమ్మ గారిల్లు - రాంభట్ల వారి రాతి గృహం)లో చేవులవారి వీధి పాత ‘స్టోన్ హౌస్’ మెరిసింది. లొకేషన్ దొరికింది. ఒక పువ్వు వికసించినా.. ఒక అగ్ని పర్వతం పగిలినా - దానికి గత గర్భంలో చాలా ఘర్షణ సాగుతుంది. అది ఒక విస్ఫోటనం లాగ సంభవిస్తుంది. లోగడ, నేనూ గోపాలం (నా అమూల్యుడు అయిన రూమ్మేటు) విజయనగరం వెళ్లేము - ఆ భాష ఆ యాస ఆ తీరు - అది మా తాతగారి ఊరే అయినా నాకు కొత్త. గంట స్తంభం చూసి ఫిదా. అందమైన సరస్వతి మనసులో తళుక్కుమన్నది. అట్లా, హేమాహేమీలైన పెద్దల ప్రేరణతో - మరుసటి వారం నేను రాతిమేడని ఆవిష్కరించాను. నీ పేరు ఏ లలితకుమార్ అనో మార్చుకో. వీరత్వం కన్నా సున్నిత మధురిమలు అనురాగ సరాగాలు చిలిపి కలహాలు వున్నాయి - గెలిచావ్ ఫో’ అన్నారంతా.. మొట్టమొదటిసారి మూడేళ్ల తరువాత నా మనసులో జేగంట మోగింది. మనసు నాన్నగారూ అని ఆక్రోశించింది. ఆ చీకటి వెలుగుల నీడన ఓ కన్నీటి చుక్క నిలిచింది. నాన్నగారు మూడేళ్లుగా మద్రాసులో వుంటున్నారు. వస్తున్నారు. వెళ్తున్నారు. ఎర్రని గులాబీ మొగ్గలాగ (బీడీలు కాలుస్తారు అది వేరే సంగతి) వుంటారు. పువ్వు మొగ్గకి మొగ్గ మొక్కకి - మొక్క విత్తుకి విత్తు నేలకి రుణముంటాయి. నాన్నగారు మద్రాసులో వున్నారు గనుకనే మరుసటేడు నేను అక్కడికి వెళ్లాను. అది అట్లుండనిండు. రాతిమేడ కదా నేను క్లుప్తంగా చెప్పలేను - నా ప్రేమకు పగ్గాలు సీరియల్‌గా వస్తున్నప్పుడు జరిగిన కథ మాధవరావు - విడీవిడని చిక్కులకి ఎస్.వెంకటేశ్వరరావులు రాశారు వారం వారం (నా కొలీగ్స్) దీన్ని మహనీయులు ఏటుకూరి, శార్వరి, పోలవరపు ప్రభృతులు తారాపథంలో పెట్టేస్తూ రివ్యూలు చేశారు. ‘ఒక్క బిగువున చదివించే నవల’ (ఏటుకూరి) క్షణ క్షణం మారే బొమ్మలను చూస్తో, మరో కొత్త వాక్యంతో వచ్చే మరో కొత్త బొమ్మను వేస్తూ నవల చివరికంటా అలా పరిగెడుతూనే ఉంటాం.. ప్రభలో శార్వరి - ఈయన తమ్ముడు (ప్రభలోనే వున్నాడు) వెంట తినగా మా ఇంటికి వచ్చి అభినందించారు. పోలవరపు భూమి డైలీలో ఇది ఒక కొత్త సారస్వత ప్రక్రియ.. అనుభవించినట్లు రాశారు - అన్నారు. ఇతివృత్తాన్ని రివ్యూల నుంచే కోట్ చేస్తాను...’ భార్య పట్ల ప్రేమతోపాటు కించిత్తు అనుమానం భర్త పట్ల గౌరవంతో పాటు, స్ర్తి సహజమైన అతిశయం గల జగన్నాథం సరస్వతుల దాంపత్య జీవితంలోని మొదటి ఘట్టం ఇది. దీనిని భాషా సౌకుమార్యంతోపాటు - భావ మృదుత్వం, వర్ణనా కౌశల్యం సహజత్వంతో రచన సాగింది అన్నారు (విశాలాంధ్ర ప్రచురణాలయం). కాని నా మెంటార్ రామ్మోహన్‌జీకి నన్ను తెలుగు పాఠకులకు నవలా రచయితగా పరిచయం చేసే క్రెడిట్ తనకే దక్కాలని కోరిక (్ధన్యుణ్ణి) నాదీ అదే కోరిక. మీరు పయనీర్ నవల తొలి మలుపు వెయ్యగల స్తోమత వున్న వాళ్లు - నాకు రాతిమేడని వదిలేయండి అంటూ తీసుకున్నారు. రాజమండ్రి వెళ్లి జగన్మోహనరావు గారితో (తన తమ్ముడు) మాట్లాడి అజంతా ప్రచురణగా (పేరున్న వారి సంస్థ) వేశారు. పైగా అప్పు చేసి మరీ... నాకు వద్దు సార్ అన్నా వినకుండా నూట యాభై రూపాయలు పారితోషికం ఇచ్చారు. వున్నారా? నేడట్టివారు?.. ఏంటో?
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com