S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారతరత్న’ బాబూ రాజేంద్ర

1.స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ఏ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేవారు?

ఎ.పాట్నా
బి.ఒరిస్సా, పాట్నా
సి.కలకత్తా, పాట్నా
డి.పాట్నా, అలహాబాద్

2భారత గణతంత్ర దేశానికి ప్రథమ దేశాధ్యక్షుడు అయిన రాజేంద్రప్రసాద్ స్వాతంత్య్రానంతరం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు బాధ్యత వహించారు?

ఎ.హోంమంత్రి
బి.ఆహారం మరియు వ్యవసాయ మంత్రి
సి.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
డి.న్యాయశాఖా మంత్రి

3.డిసెంబర్ 3, 1884న జన్మించిన బాబు రాజేంద్రప్రసాద్ ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమింపబడ్డారు?

ఎ.1 బి.2
సి.3 డి.4

4.క్రింది వానిలో భారత ప్రథమ రాష్టప్రతి గూర్చి ఏది సరియైనది?

ఎ.మూడు పర్యాయాలు రాష్టప్రతిగా నియమింపబడ్డ ఏకైక వ్యక్తి
బి.రెండు పర్యాయాలు రాష్టప్రతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి
సి.12 సంవత్సరాలు రాష్టప్రతిగా సేవలందించిన ఏకైక వ్యక్తి
డి.పైవన్నియు

5.రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు ఎన్నికయ్యారు?

ఎ.18 ఆగస్టు 1947
బి.5 మార్చి 1947
సి.9 డిసెంబర్ 1946
డి.11 డిసెంబర్ 1946

6.ఫిబ్రవరి 28, 1963 నాడు భగవంతుడిలో ఐక్యమైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్మృతి ఎక్కడ ఉంది?

ఎ.్ఢల్లీ
బి.సివాన్, బీహార్
సి.పాట్నా, బీహార్
డి.అలహాబాద్, ఉత్తరప్రదేశ్

7.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఏ సంవత్సరంలో భారతరత్న పురస్కారం ఇచ్చారు?

ఎ.1978 బి.1971
సి.1965 డి.1962

8.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రచనలేవి?

ఎ.బాపు అడుగుజాడల్లో
బి.దేశ విభజన
సి.స్వాతంత్య్రానంతరం
డి.పైవన్నియు

9.1934లో బీహార్ అతి పెద్ద భూకంపం వచ్చినప్పుడు జైల్లో ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ని స్వచ్ఛంద ఉపశమన కార్యకలాపాలు చేయ నిమిత్తం బ్రిటీష్ అధికారులు విడుదల చేశారు. రాజేంద్ర ప్రసాద్ జీవితంలో మూడేళ్లకు పైగా జైలు జీవితం గడిపారు. ఆయన ఏ ఉద్యమంలో పాల్గొనడం వలన జైలుకెళ్లారు?

ఎ.ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం
బి.సైమన్ కమిషన్, హోమ్‌రూల్
సి.సిపాయిల తిరుగుబాటు, స్వదేశీ ఉద్యమం
డి.పైవన్నియు

10.డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన స్వీయ చరిత్రని జైల్లో ఉన్నప్పుడు మొదలెట్టారు. ఆయన ఆత్మకథ పుస్తకం పేరేమిటి?

ఎ.జన్మ జన్మకీ భారతగడ్డపై పుడతాను
బి.ఆత్మకథ
సి.ఎన్ని జన్మల పుణ్యమో నా ఈ జన్మ
డి.నాకీ జన్మ చాలు
==========================================================
గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.డి 3.బి 4.డి 5.డి 6.ఎ 7.ఎ 8.సి 9.ఎ 10.డి

-సునీల్ ధవళ 97417 47700