S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (9-12-2018 నుంచి 15-12-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఆదివారం కీర్తిప్రతిష్టలు విస్తరిస్తాయి. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు. గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్యాలు విస్తరిస్తాయి. కుటుంబ అనుబంధాలు సంతృప్తికరం. పరిచయాలు పెరుగుతాయి. సోమవారం అనుకోని ఇబ్బందులుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడులు. అధికారుల వల్ల సమస్యలు. అభీష్టాలు నెరవేరుతాయి. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త. ఆరోగ్య సమస్యలుంటాయి. సామాజిక గౌరవం లోపించవచ్చు. బుధవారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పదు. గురువారం లాభాలున్నా కొన్ని ఒత్తిడులు తప్పకపోవచ్చు. నిర్ణయాదులు లాభిస్తాయి. అనుకోని ప్రయోజనాలుంటాయి. శుక్రవారం సౌకర్యాదులున్నా సంతృప్తి ఉండదు. అపోహలు అధికం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. విందులు, వినోదాలు, విహారాలకు అవకాశం. సోదరీ మణులతో సంతోషంగా గడుపుతారు. సోమవారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. అభీష్టాలు నెరవేరడంలో ఒత్తిడులు. ఆహార విహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. బుధవారం విశ్రాంతి కోసం ప్రయత్నం. ప్రయాణాలలో ఒత్తిడులుంటాయి. పోటీలు ఒత్తిడులు, చికాకులున్నా విజయం. గురువారం పరిచయాలు భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. స్నేహానుబంధాల్లో చికాకులకు అవకాశం. శుక్రవారం కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. విశ్రాంతి లోపిస్తుంది. భాగస్వామితో ప్రయాణం చేస్తారు. శ్రమాధిక్యం. శనివారం ఆహార విహారాలపై దృష్టి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. అన్ని పనుల్లో ప్రయోజనాలు ఉంటాయి. లాభాలు సంతృప్తినిస్తాయి. సంతోషంగా కాలం గడుపుతారు. బాధ్యతలెన్ని ఉన్నా సులువుగా నెరవేర్చుతారు. సోమవారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. అధికారిక ప్రయాణాలుంటాయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. బుధవారం కొన్ని సమస్యలున్నా అధిగమిస్తారు. ఊహించని సంఘటనలుంటాయి. వ్యవహారాల్లో శ్రమతో అనుకూలత. గురువారం సంప్రదింపుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. వార్తలలో కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సహకారం లభిస్తుంది. శుక్రవారం అనుకోని సమస్యలుంటాయి. తొందరపాటు కూడదు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం పోటీ రంగంలో గుర్తింపు. తొందరపాటు చర్యలు కూడదు. అనుకోని సంఘటనలుంటాయి. వ్యతిరేకతలు పెరిగే సూచన. అనారోగ్యావకాశాలుంటాయి. సోమవారం అధికారిక భాగస్వామ్యాలుంటాయి. సౌకర్యాలు సంతోషాన్నివ్వవు. ఆరోగ్య లోపాలకు అవకాశం. జాగ్రత్త. మంగళవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. పెద్దల పరిచయం. సంప్రదింపులకు అనుకూలం. బుధవారం సోదర వర్గంతో సంతోషంగా గడుపుతారు. మంచి వార్తలు అందుతాయి. ఉన్నత విద్యావకాశాలు. ప్రయాణాలుంటాయి. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమతో కార్యక్రమాలుంటాయి. భాగస్వామ్యాల్లో ఇబ్బందులు. గౌరవం తగ్గుతుంది. శుక్రవారం సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. సహకార లోపాలు. వార్తల విషయంలో జాగ్రత్త. ప్రయాణాల్లో ఒత్తిడులు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత. ఆర్థిక నిల్వలు పెంచుకుంటారు. మాటల్లో చమత్కార ధోరణి. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. సోమవారం సంప్రదింపుల్లో శుభ పరిణామాలు. అధికారిక ప్రయాణాలుంటాయి. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. మంగళవారం ఖర్చులు పెట్టుబడుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక సహకారం లభిస్తుంది. ప్రయాణాదుల్లో సంతోషం. బుధవారం లాభాలపై దృష్టి. పెద్దల అనుకూలత. ఆశీస్సులు లభిస్తాయి. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. గురువారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలలో విజయం సాధించే ప్రయత్నం. గుర్తింపు లభిస్తుంది. శ్రమాధిక్యం. శుక్రవారం లాభాలున్నా సంతోషం ఉండదు. తొందరపాటు కూడదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదులపై దృష్టి. ఖర్చులు పెట్టుబడుల్లో అనుకూలత. విశ్రాంతి లభిస్తుంది. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. వ్యవహారాల్లో అనుకూలత. సోమవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. అధికారుల ఆదరణ. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. కొంత శ్రమ. మంగళవారం బాధ్యతలు అధికం. వ్యవహారాల్లో అనుకూలత. కార్యసాధనపై దృష్టి. శ్రమ ఉన్నా సంతోషం కలుగుతుంది. బుధవారం భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కార్యసాధన. గురువారం కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. మాటల్లో తొందరపాటు కూడదు. శుక్రవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా మెలగాలి. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాలి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. మనోల్లాసం. పరిచయాలు విస్తరిస్తాయి. శ్రమ ఉన్నా కార్యనిర్వహణలో సంతోషం. నూతన కార్యక్రమాలపై దృష్టి. విశ్రాంతి. సోమవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత ఒత్తిడులుంటాయి. మంగళవారం సంప్రదింపుల్లో శ్రమ ఉంటుంది. వ్యతిరేకతలున్నా గుర్తింపు లభిస్తుంది. అనుకోని సమస్యలుంటాయి. బుధవారం కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. ఊహించని సంఘటనలు. కార్యక్రమాలను వాయిదా వేయాలి. గురువారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. తొందరపాటు కూడదు. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం. కొంత అసంతృప్తి. శుక్రవారం కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట్లాడే తీరులో జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సంతోషంగా గడుపుతారు. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. సంప్రదింపులుంటాయి. మంచి వార్తలు. సోమవారం కుటుంబంలో ఒత్తిడులుంటాయి. అధికారిక సహకారాలపై దృష్టి. మాటలలో తొందరపాటుకు అవకాశం. మంగళవారం లాభాలపై దృష్టి. నిల్వధనం విషయంలో ఒత్తిడి. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శ్రమాధిక్యం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శ్రమ ఉన్నా గుర్తింపు. గౌరవాలు. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి. గురువారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతానవర్గ సమస్యలు. సృజనాత్మకత. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో బాధ్యతలు అధికం. అనేక కార్యక్రమాలను నిర్వహించాలి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం లక్ష్యాలను సాధిస్తారు. అన్ని పనుల్లోనూ సంతోషం. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆదరణ లభిస్తుంది. ఉన్నత విద్యా వ్యవహారాలు, కీర్తిప్రతిష్టలుంటాయి. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి. అధికారిక వ్యవహారాలుంటాయి. పదోన్నతి. గుర్తింపు. బాధ్యతలు అధికం. మంగళవారం ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. విశ్రాంతి కోసం ప్రయత్నం. వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. బుధవారం పోటీలు ఒత్తిడులున్నా విజయసాధన. ప్రయాణావకాశాలు. ఖర్చులు పెట్టుబడులుంటాయి. పరామర్శలు. గురువారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. తొందరపాటుకు అవకాశం. కార్యనిర్వహణలో సమస్యలు. ఆత్మవిశ్వాస లోపం. శుక్రవారం వ్యతిరేకతలు ఇబ్బందిపెట్టే అవకాశం. కొన్ని చికాకులుంటాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం పోటీలు ఒత్తిడులు చికాకులున్నా గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో అనుకూలత. గృహ వాహనాది వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సోమవారం ఆలోచనల్లో ఒత్తిడులు. సంతాన వర్గంతో జాగ్రత్త. వ్యతిరేకతలను శ్రమతో అధిగమించాలి. అభీష్టసిద్ధి. మంగళవారం కుటుంబంలో అనుకూలత. సృజనాత్మకత లోపం. నిర్ణయాదులను సమీక్షించుకోవాలి. బుధవారం నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. గురువారం అన్ని పనుల్లోనూ ఒత్తిడులు, ప్రమాదావకాశాలు. అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్య భావనలుంటాయి. శుక్రవారం తొందరపాటు నిర్ణయాలు కూడదు. ఆత్మవిశ్వాసం కోల్పోతారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం విందులు వినోదాలు విహారాలపై దృష్టి. విశ్రాంతిగా గడిపే ప్రయత్నం. కాలం దనం వ్యర్థంగా పోకుండా చూసుకోవాలి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సోమవారం శారీరక ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. అధికారిక వ్యవహారాల్లో సమస్యలుంటాయి. మంగళవారం అనారోగ్య భావనలు. సంప్రదింపులకు అనుకూలం. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. వార్తలలో అనుకూలత. బుధవారం కొత్త పనులకు శ్రీకారం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తిప్రతిష్ఠలు విస్తరిస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. గురువారం సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో ఇబ్బందులుంటాయి. శ్రమతో కార్యక్రమాలు. సౌఖ్యం కోసం ఆరాటం. శుక్రవారం ఉన్నత విద్యలపై దృష్టి. దూర ప్రయాణ భావనలు. కొంత అసంతృప్తి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం కార్యనిర్వహణలో కొంత జాగ్రత్త. వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తంగా మెలగాలి. సంప్రదింపులకు అనుకూలం. అనుకోని సమస్యలకు అవకాశం. అధికారిక వ్యవహారాలు. సోమవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. మంగళవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆదరణ. అనుకూలత. ప్రయోజనాల విషయంలో సంతృప్తి. బుధవారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతోషంగా గడుపుతారు. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. గురువారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. తొందరపాటు కూడదు. విశ్రాంతి లోపం కలుగుతుంది. పరామర్శలు. శుక్రవారం మానసిక వత్తిడులుంటాయి. కార్యనిర్వహణలో సమస్యలు. నిర్ణయాదుల్లో జాగ్రత్త.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744