S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చొరవ

నేను వికారాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నప్పుడు మద్రాస్‌లో ఓ సమావేశం జరిగింది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో న్యాయమూర్తుల పాత్ర అన్న అంశం మీద నేషనల్ జ్యుడీషియల్ అకాడెమీ దక్షిణాది రాష్ట్రాలకి చెందిన న్యాయమూర్తుల కోసం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ అది. మేజిస్ట్రేట్ స్థాయి నుంచి జిల్లా జడ్జి స్థాయి వరకు అందరూ పాల్గొన్న కాన్ఫరెన్స్ అది. కాబోయే హైకోర్టు న్యాయమూర్తులతో పాటూ, హైకోర్టు న్యాయమూర్తులు, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.గోఖలే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సదాశివంలతో బాటూ చాలామంది ఆ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన న్యాయమూర్తులు చాలామంది అందులో వున్నారు. ఈ న్యాయమూర్తులందరినీ నాలుగు భాగాలుగా రెండో రోజు కాన్ఫరెన్స్‌లో విభజించారు. ఒక దాంట్లో నేనూ వున్నాను. అందరమూ చర్చించి ఆ గ్రూపు తరఫున ఒకరు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మా గ్రూప్‌ని సమన్వయం చేయడానికి మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విమల వచ్చారు. ఇప్పుడు ఆమె మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.
మా గ్రూప్ తరపున ఎవరు ప్రెజెంటేషన్ ఇస్తారని ఆవిడ మా అందరినీ అడిగారు. నేను చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఆ చర్చలో ఎక్కువ పాల్గొన్నది నేనే. చాలామంది సీనియర్ జిల్లా జడ్జిలు వున్నప్పటికీ, ఆ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. దానికి కారణాలు రెండు - మొదటిది క్రిమినల్ లా మీద నాకు ప్రావీణ్యం ఉండటం, రెండవది నేను మాట్లాడటానికి ఇన్షియేషన్ తీసుకోవడం.
మాది మూడవ గ్రూప్. భోజనానికి ముందు ప్రెజెంటేషన్. అప్పటికి ఇద్దరు సీనియర్ జడ్జీలు ప్రెజెంటేషన్లు ఇచ్చారు. నేను మూడవ వ్యక్తిని. ఓ సీనియర్ సివిల్ జడ్జీ ప్రెజెంటేషన్ ఏముంటుందీ అనుకున్నారు.
నేను మొదలుపెట్టాను. న్యాయమూర్తికన్నా ముందు నేను రచయితనని, కథలూ కవిత్వంతోపాటూ ఓ ఇరవై దాకా ‘లా’ పుస్తకాలు రాశానని చెబుతూ నా ప్రెజెంటేషన్ ఇచ్చాను. ప్రెజెంటేషన్ బాగా వచ్చింది. నేను చెప్పిన అంశాలు సరైనవా కాదానని పుస్తకాలని తెరిచి ప్రధాన న్యాయమూర్తి గోఖలే చూశారు. నా ప్రెజెంటేషన్ అయిన తరువాత అకాడెమీ డైరెక్టర్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్ నా దగ్గర నుంచి జమానత్ ఇంగ్లీష్ కథల పుస్తకం తీసుకున్నారు.
భోజన సమయంలో ప్రధాన న్యాయమూర్తి గోఖలే గారు దగ్గరకొచ్చి మాట్లాడి ‘జమానత్’ కథల పుస్తకాన్ని తీసుకున్నారు.
తెల్లవారి ఉదయం సమావేశంలో ప్రొఫెసర్ మోహన్ గోపాల్ నన్ను సభకు ప్రత్యేకంగా పరిచయం చేసి నా కథని ఒకటి వివరించాడు. న్యాయమూర్తులు లేచి చప్పట్లు కొట్టారు. అందరూ నన్ను అభినందించారు. ఈ అద్భుతమైన సన్నివేశానికి కారణం-
ప్రతిభ మాత్రమే కాదు. నేను తీసుకున్న ఇనీషియేషన్ (చొరవ) దాన్ని అభినందించే సంస్కారం ఉన్న వ్యక్తులు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001