S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మునగచెట్టు - డాబా దెయ్యం

మునగఛెట్టు పూల గుత్తుల ముసిముసి నవ్వులు నవ్వుతుంది అన్నది చూశాను - కాని దాని మీద కథ రాయడానికి ప్రేరణ మాత్రం వో చిన్ని సంఘటన - జరిగింది. అప్పటికే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ గారితో పరిచయం గాఢం కాసాగింది. పత్రికకి కథ పంపాలి అన్న కోరిక మొలకెత్తింది. మా పేట హిందువుల సందులో మునగచెట్టు జ్ఞాపకం వచ్చింది.
లోగడ నేను చెప్పానుగా, మాకు మా వించిపేటలో మా పెద్ద మామయ్య గ్రామఫోను గట్రా వున్న బావి పంపుల వీధిలోని విశాలమయిన డాబా యిల్లు సంగతి - నీళ్లు మాత్రం ‘హుళక్కి’ అని. ఆ ఇంట్లో బారాకాసంత డాబా మీదికి - మెట్లు ఎక్కుతూ వుంటే మలుపు దగ్గర నుంచే తలకి మునగకాయలు తగిలే చెట్టుంది. కాకపోతే ప్రక్క సందులోకి ప్రవేశద్వారమున్న ఆ ఇల్లు ‘గామా’ పహిల్వాన్ గారిది. ఈ కాయలు కోస్తే ‘రిస్కుంది’. అట్లాంటి ఆ ఇంట్లోకి మేము మారిపోయాం.
ఓసారి మా సత్యం అత్త (మేనత్త) భర్త బూసి మామయ్య వచ్చాడు. ఆ రోజుల్లో భార్యలకీ భర్తలకీ వయస్సు వ్యత్యాసం యెక్కువ. ఈ బూసి మామయ్య మా అత్తకన్నా చాలా పెద్ద. బాల్డ్‌హెడ్డూ బొజ్జతో వో పహిల్వాన్‌లా వుంటాడు. గళ్లలుంగీ కట్టుకొని, పైన వో తుండు - వైకల్పికంగా వేసుకుంటాడు. ‘గట్టిపిండం’ అనేది మా మామ్మ.
అతను ఫుట్‌బాల్ ఆడే రోజుల్లో ఒకసారి ఎదుటి జట్టు వాడి మీద కసితో బంతిని లాగి గోల్‌లోకి అన్నట్లు లాగి తంతే - అది వెళ్లి - పాపం.. ప్రత్యర్థి క్రీడాకారుడికి ఛాతీ మీద తగిలింది. అంతే, అతడు ‘హరీ’మన్నాడుట! అట్టి ‘్భశాలి’ (అనగా బలశాలి) ‘అబ్బా! గుమాయిస్తుందే (ఉక్కబోతని వైజాగ్ వాళ్లు అలా అంటారు) అమ్మారుూ? అంటూ మా అమ్మనడిగి ఒక చిరుచాపనీ, దిండునీ (వాళ్లు ‘తలగడ’ అంటారు) పట్టుకొని రాత్రి పది గంటల వేళ డాబా ఎక్కేశాడు.
గగనాన కాటుక తివాసీ మీద ముత్యాలు వొలకబోసినట్లు నక్షత్రాల మిలమిలలు చూస్తూ - చుట్ట ఆర్పేసి, ప్రక్క నేల మీద నొక్కేసి పడుకున్నాడు - నిద్రాదేవి ఒడిలో, హాయిగా...
ఓ రాత్రివేళ, అర్ధరాత్రి దాటింది కాబోలు మెట్ల మీద - దడదడా ఏదో దొర్లించినట్లు - చప్పుడు చీకటిలో లాంతరు వొత్తి పైకి లేపి - చూశారు నాన్నగారు. బూసి మామయ్య? హడిలి.. ఛస్తూ - ‘అబ్బ! దెయ్యం వీపు మీద చరిచిందే!’ అంటూ, చేతనున్న చాపా, దిండూ మెట్ల మలుపులోనే జార్చేసుకుంటూ వచ్చాడు. అదేలెండి ‘పడ్డాడు’ - అనాలి గానీ అతిథి, యింటి అల్లుడూ కావున ‘అట్లు అనరాదు.’
‘మీ డాబా మీద.. దాని మొహం తగలెయ్యా.. బండదెయ్యం వుందే - సుబ్బమ్మత్తయ్యా!’ అంటూ చెంబుడు నీళ్లు వొగరుస్తూ త్రాగేశాడు.
తనకి నిద్ర పట్టింది. కృష్ణాతీరానికి స్నానానికి వెళ్లాలని బయలుదేరుతున్నట్లు కల వచ్చింది. కాని, విసుక్కుని అట్నుంచిటు బోర్లా తిరిగాడుట. మునగచెట్టు వూగిందిట పూనకం వచ్చినట్లు. కళ్లు తెరుద్దాం అనుకుంటూ వుండగానే దెయ్యం వీపు మీద ఓ గ్రుద్దు - అబ్బాయిలా గుద్దేసింది - ఆనక మరో రెండు...
‘బద్మాష్! కోనైబే మేరే జగాపీ - ‘బాజేట్’ అంటూ అరిచింది. అదా! మునగచెట్టు మీద దెయ్యమే. మీ డాబా మీది దయితే మీ పిల్లల్ని గుద్దేది కాదా?’ అన్నాడు బూసిమామయ్య, తేరుకుని. అందరం లేచాం. ‘ఆ దెయ్యం వైజాగ్ తురక దెయ్యమే. అతనితోనే వచ్చి ఉంటుంది’ అన్నది మా అత్త, బూసి మామయ్య చెప్పేది వినకుండా. మునగచెట్టు మీదికి నా దృష్టి మళ్లింది. నేను కాలేజీకి రోజూ, మా ఇంటి జంక్షన్ నుంచి - సన్నగా, నైజాం గూడ్సు షెడ్డు వేపు సాగే ‘సందు’గుండా పోయేవాణ్ణి. పేటలో అంతటా హిందువులున్నారు. గానీ, గల్లీల్లో తూర్పు నించి వచ్చి సెటిల్ అయిన ‘ఏరాడ’ కుటుంబాలు అధికంగా ఉన్నాయి. అటు తర్వాత రైల్వే శాఖ తరపున కుస్తీ పోటీలకు వెళ్లిన రెజిలింగ్ యువకుడు గంగా పహిల్వాన్ ఈ వీధి కుర్రాడే. అదే వీధిలో కుడివైపు వో మునగచెట్టు, పెంకుటిల్లు - దాని ముందు రెండు లాగుడు బండ్లు అందులో వో పెద్దామె - ఇలా ఎవరెవరో వుండేవారు.
నేను బుద్ధిగా, తిన్నగా పోతూనే అన్నీ గమనించేవాణ్ని - నాక్కూడా తెలియకుండానే. అదీ, లోకల్‌గా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులతోనూ వన్‌టౌన్ హమాలీల, చూసిన అనుభవంతోనూ ఓ కథ అల్లేను. మా పాల కోటయ్యను చూస్తూ వుంటే నాకు మునగచెట్టులోని రాజయ్య పాత్రకి సరిపోతాడనిపించింది. రాశాను. ఎప్పుడనుకున్నారు? నేను వాల్తేరు నుంచి తిరిగొచ్చాకా. 1960లో అది వీక్లీలో వస్తూనే పండిత పామర జనరంజకం అయింది. అయితే, పత్రిక వీక్లీకి దెయ్యం వూసులేని సీరియస్ కథ రాశాను - ‘ఉదాత్తత’ ప్లస్ మా విశాలాంధ్ర పెద్దలు చెప్పే ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ దెబ్బతింటాయని - కానీ ఇప్పుడు చెబుతున్నాను. మరోసారి విజయ సాహితి పెద్దలు దీన్ని నవల చెయ్యమన్నారు. చేశాను. కానీ దాన్ని మద్రాసుకు తీసుకుపోలేదు. తమ్ముడికిచ్చాను. ముఖచిత్రం కూడా వెయ్యడం పని కూడా అప్పగించాను. కొన్ని అయిడియాలు డిస్కస్ చేసి అప్పగించాను. పబ్లిసిటీ ఆర్టిస్టు కార్టూనిస్టుగా బాగా అందుకుంటున్నవాడు - కవర్‌పేజీలు కూడా వెయ్యాలి - అది మా వాడితోనే మొదలు అవాలి అనిపించింది నాకు.
నేను పోయి, మద్రాసుకి - ఆంధ్రపత్రికలో పడ్డాను. 1961, సెప్టెంబర్ 18. డిసెంబర్ 18న తమ్ముడు బెజవాడ నించి లెటర్ రాశాడు. దేశికవితా మండలి - బొందలపాటి శివరామకృష్ణగారు ‘ఈ నవల నిడివి వంద పుటలు దాటడం లేదు అన్నాడు. కవర్‌పేజీ ‘వోకే’ చేశాడనీ - వోన్లీ ట్వంటీఫైవ్ రుపీసే ఇచ్చాడని - కవర్‌కి.
‘సరే.. నవలని సాగదియ్యటానికి ససేమిరా అని నేను పెద్దల ముందే ప్రకటించాను. ‘అందులో పాత్రలు పెద్దపెద్ద డైలాగులు చెప్పలేవు. అదే పనిగా సీన్‌లు - సీన్‌లు ఆలోచించనూ లేవు’ అని. అంచేత మరి మూడు కథలు చేర్చి - మునగచెట్టు మరియు కొన్ని కథలు’ అని ప్రచురించారు.
ఆ విధంగా ఆ దెయ్యం ఇప్పటిదాకా స్మృతిగర్భంలోనే వుండిపోయింది. డిసెంబర్ 18, 2018న దీనికి విముక్తి ఇలా లభించింది - అనే చెప్పాలి.
సరే, 1960లోకి వెళ్లాం మళ్లీ. ఆనందవాణి కాళిదాసుగారి ఆహ్వానం అలాగే వుంది. నాన్నగారు ఉంటున్న ఆఫీసు తంబుచెట్టి స్ట్రీట్ చివరి భవనం - నెంబర్ 337. ఈ ఆనందవాణి వీధికి ఎదుటి వరుసలో ఉంది. కాకపోతే ఆంధ్రపత్రిక రాధాకృష్ణగారిని కలుసుకోవడం తేలిక. సరిగ్గా ఆంధ్రా ఇన్‌సూరెన్స్ బిల్డింగ్ నాలుగో అంతస్తు ముందు బాల్కనీలోకి వస్తే, చూస్తే. అక్కడ నుంచి సిక్స్ అండ్ సెవెన్ తంబుచెట్టి స్ట్రీట్ ఆంధ్రపత్రిక కార్యాలయం కనపడుతుంది. రాధాకృష్ణగారి రూము కిటికీలో నుంచి - ఆయన వచ్చిందీ లేందీ తెలుస్తుంది కదలికల వల్ల.
రాధాకృష్ణగారు తిరిగి ఆఫీసుని ప్రొద్దున్న పదకొండున్నర ప్రాంతంలో, వదిలే వేళకి, నేను నాన్నగారికి చెప్పి లిఫ్ట్‌లో దిగిపోయేవాణ్ని. రాధాకృష్ణగారి కారులోకి దూరిపోయేవాణ్ని. ఆయన కారుని స్వయంగా డ్రయివ్ చేసుకునేవాడు. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ మైలాపూర్ అమృతాంజనం ఆఫీసు చేరుకునేవాళ్లం. అప్పుడాయన అమృతాంజనం మానేజింగ్ డైరెక్టర్ కూడా. పెద్ద హాలు అంతటి ఆయన ఆఫీసు రూము. అటెండర్ పర్‌కొరేటర్‌లో కాఫీ చేసేవాడు. తన ఆఫీస్ పని చూసుకుంటూనే - ఎన్ని కబుర్లు సాగేవి.
ఈలోగా, ఒక్కోరోజు, శ్రీరంగం నారాయణ బాబుగారు అక్కడికి చేరుకునేవారు. వెంటనే కబుర్లు ‘సిగార్’ మీదికి - అంటే ‘చుట్టలు’ మీదికి మళ్లేవి. నారాయణ బాబుగారు - శ్రీశ్రీ, ఆరుద్రలకు సమీప బంధువు మాత్రమే కాదు - ఇంచుమించు అంత ‘వెయిట్’ అంటే ప్రాముఖ్యతగల అభ్యుదయ కవి. ‘సర్రియలిజా’న్ని కాచి వడబోసినవాడు. గ్రేట్!!
అయితే రాధాకృష్ణగారికి మా ‘ద్రావిళ్ల శాఖ’ అంటే చాలా ఇష్టం. ఆయనకి ‘సూరి’ అని ఒక ప్రాణమిత్రుడుండే వాడు. చాలా మంచివాడు. ససృదయుడూ. కోనసీమ ద్రావిళ్లు. దాంతో రుూయన అంటే ‘శి.రా.’గారు (శివలెంకరా.కృ) మా ‘శాఖ’ మీద మొత్తం అటు బరంపురం దాకా వున్న ఏరియాను కలుపుకొని ఒక ‘రీసెర్చ్’ చేశారు. ఏ సబ్జెక్టు అయినా ‘శి.రా.’గారు లోతుగా అధ్యయనం చేస్తేగానీ వదిలేవాడు కాదు. ‘శిరా’ అని పెట్టుకోండి ‘నిశానీ’ ‘శిరా’క్షరాలుగా రాణించాలి మీ రాతలు’ అనేవాణ్ని.
రాధాకృష్ణగారు దరిమిలా ‘శిరా’ అనే కలంపేరు వాడేవాడు ఒక్కోసారి. పొగ త్రాగటం కూడా మానేశాడు ఆనక.
శ్రీరంగం నారాయణబాబు గారు అంటే -‘రుధిరజ్యోతి’ అని చెప్పాలి. నారాయణబాబు గారు, శ్రీశ్రీ గారూ కూడా మాకు తాత వరస - చుట్టరికం బీరకాయపీచు. మా నాయనమ్మని వాళ్లు బాగా ఎరుగుదురు కూడా.
నేననేవాణ్ని ‘పొలైట్’గా ‘వద్దు సార్! నేను బాల్యంలోనే కవినైనాను. చుట్టూ బీడీ సిగరెట్‌లతో నాకు పని పడలేదు... మీ సురకత్తుల లాంటి మాటల పొందిక వారసత్వంగా నాకివ్వండి’ అని. ఎందుకంటే నారాయణ బాబుగారి కవిత్వం ఒక అనితర సాధ్యం అయిన అక్షరాయుధం. ‘గడ్డిపరకను నేను గడ్డిపరకను’ అంటూ పాడేవాణ్ని (ఆయన పద్యమే) శ్రీశ్రీగారి - పదండి ముందుకు పదండి పదండి త్రోసుకు’ అని పాడుకున్నట్లుగానే యిది కూడా..
ఆయన ‘ఒక బ్యాచులర్స్ లాడ్జ్ (పెద్ద అపార్ట్‌మెంట్‌ల మాన్షన్ అది)లో వుండేవారు. రాధాకృష్ణగారు అప్పుడు సైన్సు ఫిక్షన్ తెగ చదివేస్తూ వుండేవాడు. (పాకెట్ బుక్సుగా ఎన్నో వచ్చేవి) నేను జార్జ్‌గారు ‘ఒన్ టు త్రీ ఇన్‌ఫినిటీ’ అభిమానిని. మాకు రకరకాలుగా ‘వేవ్‌లెంగ్త్’ కలిసింది నాకు రా.కృ.గారికి.
అసలింతకీ అప్పుడు నేనెందుకు మద్రాసు నాన్నగారి దగ్గరికి వెళ్లి వున్నానూ అంటే ఆనందవాణి కాళిదాసుగారు పిలిచారు కనుక. ఆ సంగతులు చెప్పాలి మరి. ఇంకా ఆంధ్రపత్రిక కొలువు లేదు...
(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com