S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రామాయణం.. 113 మీరే డిటెక్టివ్

భరతుడు తిరిగి వెళ్లిపోయాక రాముడు తపోవనంలో నివసిస్తూ అక్కడ ఉన్న మహర్షులు భయపడుతున్నట్లు, ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలి అనుకుంటున్నట్లు తెలుసుకున్నాడు. ఆ చిత్రకూట పర్వతం మీది ఆశ్రమంలో గతంలో తనని ఆశ్రయించి సంతోషంగా ఉన్నవాళ్లే ఇప్పుడు ఎందుకో కంగారు పడుతున్నట్లు రాముడికి అనిపించింది.
ఆ మునులు భయపడుతూ చూపులతో, కనుబొమల కదలికలతో రాముడి వైపు సౌంజ్ఞలు చేస్తూ, ఏమేమో గొణుక్కుంటూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. రాముడు ఏదో జరుగుతోందని గ్రహించి, తన వల్ల ఏదైనా అపరాధం జరిగిందేమోనని అనుమానించి, ఆ ఆశ్రమానికి అధిపతైన ఋషి దగ్గరికి వెళ్లి నమస్కరించి చెప్పాడు.
‘ఓ పూజ్యుడా! ఈ మునులు అందరిలో ఏదో మార్పు కనపడుతోంది. నా ప్రవర్తనలో వికారమేమీ లేదు కదా? నా తమ్ముడైన లక్ష్మణుడు పొరపాటుగా ఏదైనా చేయకూడని పని చేయలేదు కదా? నాకు శ్రద్ధతో శుశ్రూష చేస్తూ మీకు కూడా సేవ చేసే సీత మీ విషయంలో స్ర్తి ప్రవర్తించాల్సిన పద్ధతిలో ప్రవర్తించింది కదా?’
ఆ మాటలు విని ముసలితనం చేత, తపస్సు చేత కూడా వృద్ధుడైన ఆ మహర్షి వణుకుతూ ప్రాణులందరి మీదా దయగల రాముడితో చెప్పాడు.
‘తండ్రీ! సీత మంగళకరమైన స్వభావం కలది. ఎల్లప్పుడూ శుభకార్యాల మీదే ఆసక్తి కలది. అలాంటి సీత వల్ల ధర్మలోపం ఎలా కలుగుతుంది? ముఖ్యంగా మునుల విషయంలో ఎలా కలుగుతుంది? నీ మూలంగా మునులకి, రాక్షసులకి ఆపద కలుగుతోంది. దాంతో భయపడ్డ వీళ్లు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ రావణాసురుడి తమ్ముడైన రాక్షసుడు జనస్థానంలో ఉన్న మునులందర్నీ సమూలంగా చంపేశాడు. దృఢమైన వాడు, క్రూరుడు, మానవ భక్షకుడు, యుద్ధాలలో విజేత, గర్విష్ఠి, పాపాత్ముడైన ఆ రాక్షసుడు నిన్ను చూసి ఓర్వలేక పోతున్నాడు. నాయనా! నువ్వు ఈ ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకున్నది మొదలు రాక్షసులు మునులని బాధిస్తున్నారు. ఆ రాక్షసులు జుగుప్స కలిగించే, క్రూరమైన, వివిధ రూపాల్లో ఉన్న, వికృతమైన రూపాలతో, చూడటానికి వికారమైన ఆకారాలతో కనపడుతున్నారు. దుష్టులైన రాక్షసులు కొందరు మునులపైన అపవిత్రమైన చెడ్డ పదార్థాలని పడేస్తున్నారు. మరి కొందర్ని చంపుతున్నారు. నీచ బుద్ధిగల వీళ్లు ఆశ్రమంలో ఆయా ప్రదేశాల్లో తెలీకుండా దాక్కుని మునులని చంపుతూ ఆనందిస్తున్నారు. హోమం జరిగేప్పుడు స్రుక్కులని, హోమద్రవ్య పదార్థాలని దూరంగా పారేస్తున్నారు. కలశాలని ముక్కలు చేస్తున్నారు. ఇప్పుడు ఋషులంతా దుర్మార్గులు ఆక్రమించిన ఆశ్రమాలని వదిలి మరో ప్రదేశానికి వెళ్దామని నన్ను కోరుతున్నారు. రామా! ఆ దుర్మార్గులు మునుల విషయంలో శారీరక హింసని కూడా చేస్తున్నారు. అందుకని ఈ ఆశ్రమాన్ని విడిచి నేను మునులందరితో కలిసి ఇక్కడికి సమీపంలో అధికంగా ఫలమూలాలు లభించే చిత్రమైన వనంలోని ఆ ప్రాచీన ఆశ్రమానికే వెళ్తాను. ఆ ఖరుడు నీ విషయంలో కూడా చెడ్డగా ప్రవర్తిస్తాడు. అందువల్ల నీకు ఇష్టమైతే ఈ ప్రదేశాన్ని వదిలి మాతో రా. రామా! నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత సమర్థుడివైనా భార్యతో కలిసి నీకు ఇప్పుడు ఇక్కడ నువ్వు నివసించడం వల్ల కష్టం కలుగుతుంది.’
ఆశ్రమాన్ని విడిచి వెళ్లిపోడానికి తొందరపడే ఆ మునిని ఎన్ని మాటలు చెప్పినా రాముడు వెళ్లకుండా ఆపలేకపోయాడు. ఆ కులపతి రాముడ్ని అభినందించి వీడ్కోలు చెప్పి అతన్ని అంగీకరింపచేసి, ముని సమూహాలతో కలిసి ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్లిపోయాడు.
‘నువ్వు ఆ రాక్షసుడ్ని చంపి మాకు రక్షణ కలిగించు’ అని వెళ్లే మునులు రాముడ్ని కోరారు.
రాముడు కొంతదూరం వాళ్లని అనుసరించి వెళ్లి ఆ మునులకి వీడ్కోలు చెప్పి, కులపతికి నమస్కరించాడు. అధికంగా సంతోషించి, వారు ఉపదేశించిన విషయాలని తెలుసుకుని, వారి అనుమతి పొంది పవిత్రమైన తన కుటీరానికి వచ్చాడు. ప్రభువైన రాముడు ఋషుల్లేని ఆ ఆశ్రమాన్ని క్షణకాలమైనా విడవలేదు. ఋషుల ధర్మాలని ఆచరించడంలో విశిష్టత పొందిన ఆ ఋషులు ఇంత దాకా సదా రాముడ్నే అనుసరించి ఉండేవారు కదా?

(అయోధ్యకాండ 116వ సర్గ)

‘అయోధ్య కాండలోని 116వ సర్గ ముగిసింది. ఇంక రెండు సర్గలతో ఈ కాండ పూర్తవుతుంది’ హరిదాసు రాముడికి నమస్కరిస్తూ చెప్పాడు.
ఆశే్లష హరికథని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లి తల్లికి వినిపించాడు. శారదాంబ మొత్తం విని చెప్పింది.
‘ఆయన చెప్పిన దాంట్లో నాలుగు తప్పులు ఉన్నాయి. అవేమిటో తెలుసా?’
‘తెలీదు’ ఆశే్లష చెప్పాడు. ‘అవేమిటో చెప్తా విను’
*
మీరా తప్పులని పట్టుకోగలరా?
*
1.గురువులైన వశిష్ఠులు మొదలైన బ్రాహ్మణులు తూర్పు వైపు తిరిగి నందిగ్రామం వైపు వెళ్లారు. హరిదాసు దిక్కుని సూచించలేదు.
2.పాదుకలకి గొడుగు పట్టమని భరతుడు సమస్త ప్రకృతి మండలంతో చెప్పాడు అని వాల్మీకి రాశాడు. కాని భరతుడు ‘అందరితో’ అన్నట్లుగా హరిదాసు చెప్పాడు.
3.అశరీరవాణి ‘బాగు బాగు’ అని పలకడం వాల్మీకి రాయలేదు. అది హరిదాసు కల్పన.
4.భరతుడు జటలు, నారచీరల్ని ధరించి, ముని వేషంలో నందిగ్రామానికి వెళ్లాడు. కాని హరిదాసు దీన్ని చెప్పలేదు.
5.ప్రజలు కూడా భరతుడి పాలన రామరాజ్యంలా ఉందని కీర్తించారు అని వాల్మీకి రాయలేదు.

*
మీకో ప్రశ్న

ఖరుడు ఎవరి కొడుకు?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

నంది గ్రామానికి గల మరో పేరేమిటి?
భరతకుండ్

-మల్లాది వెంకట కృష్ణమూర్తి