S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంబోధన

గత వారం వారణాసి వెళ్లాను. రెండు రోజులు అక్కడ వున్న తరువాత గయా, బోద్‌గయా వెళ్లడానికి నిర్ణయించుకున్నాం. ఉదయం ఆరు గంటలకు రమ్మని ఓ కారుని హైర్ చేశాం. యజమాని డ్రైవర్ నెంబర్ ఇచ్చాడు. డ్రైవర్‌కి ఫోన్ చేశాను. ఆరు గంటలకి వస్తానని చెప్పాడు కానీ 7 గంటలకు వచ్చాడు. రావడంతోనే క్షమాపణలు చెప్పాడు ఆలస్యంగా వచ్చినందుకు.
బయల్దేరాం. దారిలో అతనికి ఫోన్లు వస్తున్నాయి. హిందీలో కాకుండా భోజ్‌పురీలో మాట్లాడుతున్నాడు. హైదరాబాద్‌లో పని చేస్తున్న యు.పి. కార్మికులు ఎక్కువగా మాట్లాడేది భోజ్‌పురి భాషే. అందుకు మా డ్రైవర్ మాట్లాడుతున్నది అర్థం కాలేదు కానీ అది భోజ్‌పురీ అని అర్థమైంది.
కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత అతన్ని అడిగాను. మాట్లాడుతున్నది భోజ్‌పురి భాషా అని.
‘అవునని’ చెప్పాడు.
అంతటితో వూరుకోలేదు. ఇంకా ఇలా అన్నాడు. ‘ఇది చాలా తియ్యటి భాష’ అన్నాడు.
ఉర్దూ చాలా తియ్యటి భాష అని తెలుసు. భోజ్‌పురి కూడా తియ్యటి భాష అని తెలియదు.
‘ఎలా అంటున్నావని’ అడిగాను.
‘ఇది తియ్యటి (మీటా) భాషే కాదు. చాలా ప్రేమపూర్వకమైన భాష. ఈ భాషలో మాట్లాడితే ఎదుటి వాళ్లు చాలా ఇష్టపడతారు. ఈ భాషలో తియ్యదనం ప్రేమ మాత్రమే కాదు, గౌరవం కూడా ఉంటుంది’ అన్నాడు.
అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా ఉపయోగించిన పదం ‘జీ’. అది గౌరవంగా పలికే పదం.
దారిలో ఓ లేడీ కానిస్టేబుల్ ట్రాఫిక్ సరిచేస్తూ భోజ్‌పురిలో చెబుతోంది. సంబోధిస్తోంది.
‘ఆమె చెప్పడంలో చాలా తియ్యదనం ఉంది. గౌరవం ఉంది’ అన్నాడు.
‘ఎలా?’ అన్నాను.
చాలా మంది డ్రైవర్‌ని డ్రైవర్ అని మాత్రమే సంబోధిస్తారు. కానీ ఆమె డ్రైవర్‌జీ అని సంబోధిస్తూ హెచ్చరిక చేస్తుంది. ఆమె గొంతులో అధికార దర్పం కన్నా తియ్యదనమే ఎక్కువ విన్పిస్తుంది’ చెప్పాడు అతను.
చాలా మంది డ్రైవర్‌ని డ్రైవర్ అని మాత్రమే సంబోధిస్తారు. పేరుతో సంబోధించరు. అతని పేరు ప్రక్కన జీ అని కూడా అనరు.
‘నిజమే! మీరు చెప్పింది అక్షర సత్యం తివారీజీ!’ అని చెప్పాను.
‘తివారీజీ’ అన్న పదం నా నోటి నుండి రాగానే అతని ముఖం వెయ్యి బల్బుల కాంతితో వెలిగిపోయింది.
గౌరవం ఇవ్వడం వల్ల నా పట్ల అతని గౌరవం వెయ్యింతలు పెరిగింది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001