S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (27-1-2019 నుంచి 2-2-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి. వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. కాలం ధనం కోల్పోవద్దు. తొందరపాటు కూడదు. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. సోమవారం ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. గృహ వాహనాదుల్లో కొంత జాగ్రత్త. పరిచయాల్లో ఒత్తిడులుంటాయి. మంగళవారం గౌరవ లోపాలుంటాయి. అనుకోని సమస్యలకు అవకాశం. నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. తృప్తి లోపం. బుధవారం ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు. ఊహించని సంఘటనలుంటాయి. కొత్త పనుల వాయిదా మంచిది. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఉండే అవకాశం. లౌక్యంగా వ్యవహరిస్తారు. శుక్రవారం లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సంతృప్తి. అధికారిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శనివారం ఉన్నత వ్యవహారాలుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)
ఆదివారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. ఎదుటి వ్యక్తులు, విషయాలలో పోటీలలో గెలుపు ఉంటుంది. లాభాలున్నా జాగ్రత్త అవసరం. భాగస్వామ్య లాభాలు. సోమవారం సహకార లోపాలుంటాయి. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. వార్తలలో కొంత క్లారిటీ తక్కువగా ఉంటుంది. మంగళవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో అనుకూలత. నూతన కార్యక్రమాలపై దృష్టి. వ్యవహారాల్లో విజయం. బుధవారం అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు. సామాజిక అనుబంధాల్లో లోపాలకు అవకాశం. గురువారం ఉన్నత వ్యవహారాల్లో అనుకూలత. కీర్తి ప్రతిష్టలు విస్తరిస్తాయి. వ్యాపారాదుల్లో నూతన పరిచయాలుంటాయి. శుక్రవారం అనుకోని సమస్యలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. అసంతృప్తి. దానధర్మాల వల్ల మేలు. శనివారం నిర్ణయాదుల్లో ఇబ్బందులు.
మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం మనోభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్త. మాట తీరు ఇబ్బంది పెట్టవచ్చు. ఆలోచనలకు రూపకల్పన. సంతోషం. మంగళవారం పెద్దలతో పోటీలు కూడదు. వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయం సాధిస్తారు. గుర్తింపు, గౌరవాదులు లభిస్తాయి. బుధవారం పరిచయాలు స్నేహానుబంధాల్లో ఇబ్బందులు. సామాజిక అనుబంధాల్లో వత్తిడులు తప్పకపోవచ్చు. గురువారం వ్యాపార వ్యవహారాల్లో ఇబ్బందులు. నిర్ణయ లోపాలు. సౌకర్యాదులు కోల్పోవచ్చు. పోటీ రంగంలో జాగ్రత్త. శుక్రవారం భాగస్వామ్యులతో అప్రమత్తంగా మెలగాలి. కొంత నైరాశ్య ధోరణి. పరిచయాలు, అనుబంధాల్లో ఒత్తిడులు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఆదివారం ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. ఉన్నత వ్యవహారాల్లో తొందరపాటు కూడదు. నూతన కార్యక్రమాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. సంతోషంగా గడుపుతారు. సోమవారం నిర్ణయ లోపాలుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోవచ్చు. అన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా మెలగాలి. మంగళవారం ఆలోచనలకు రూపకల్పన. మంచి పనులపై దృష్టి. సంతాన వ్యవహారాల్లో సంతృప్తి. సృజనాత్మకత. గుర్తింపు. గౌరవం. బుధవారం వ్యతిరేకతలుంటాయి. పోటీలు ఒత్తిడులున్నా అనుకూలత. విజయం సాధించడానికి ప్రయత్నించాలి. గురువారం వ్యాపార భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అభీష్టసిద్ధి. శుక్రవారం వ్యతిరేకతలు ఎక్కువ. భాగస్వామ్యాల్లో సమస్యలు, నిరాశ.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆదివారం సహకారం సంతోషాన్నిస్తుంది. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలుంటాయి. ప్రమాదాలకు అవకాశం. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. సోమవారం వ్యర్థమైన ప్రయాణాలు. ఖర్చులకు అవకాశం. సహకార లాభాలుంటాయి. సోదర వర్గంతో జాగ్రత్త. మంగళవారం ఆహార విహారాలపై దృష్టి. సౌకర్యాలు పెంచుకుంటారు. మాతృవర్గంతో సంతోషం. ఇంటి వ్యవహారాలు. బుధవారం ఆలోచనల్లో ఇబ్బందులు. ఆలస్య నిర్ణయాలు. సౌకర్యాదుల్లో ఇబ్బందులకు అవకాశం. శ్రమాధిక్యం. గురువారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. విజయ సాధన. వ్యాపారాదుల్లో అనుకూలత. శుక్రవారం అభీష్టాలు నెరవేరుతాయి. పోటీల్లో ఇబ్బందులు.
కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)
ఆదివారం కుటుంబ ఆర్థికాంశాలపై ప్రత్యేక దృష్టి. భాగస్వామ్యాల్లో ఒత్తిడులు. పరిచయాలు స్నేహానుబంధాల్లో ఇబ్బందులకు అవకాశం. మాటల్లో తొందరపాటు కూడదు. సోమవారం లాభాలుంటాయి. పెద్దలతో కొంత జాగ్రత్త. ఊహించని ప్రయోజనాలపై దృష్టి. కుటుంబ సభ్యులతో గడుపుతారు. మంగళవారం పెద్దల సహకారం. ధార్మిక ప్రయాణాలు. గురువులతో గడుపుతారు. మంచి వార్తలు అందుతాయి. బుధవారం ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ప్రయాణాదుల్లో జాగ్రత్త. గురువారం సంతానంతో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సృజనాత్మక వ్యవహారాలు. శుక్రవారం ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సౌకర్యాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో సమస్యలు.
తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)
ఆదివారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. తొందరపాటు కూడదు. విజయాన్ని సాధిస్తారు. నిర్ణయాదుల్లో జాగ్రత్త. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అనేక కార్యక్రమాల బాధ్యతలను నిర్వర్తిస్తారు. కార్యనిర్వహణలో కొంత జాగ్రత్త. మంగళవారం కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. బుధవారం ఇతరుల సహకారం లభిస్తుంది. సేవక వర్గ అనుకూలత. కుటుంబంలో కొంత ఒత్తిడులు తప్పకపోవచ్చు. గురువారం సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఆహార విహారాల్లో ఒత్తిడులుంటాయి. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. శుక్రవారం సంతోషం తగ్గుతుంది. ప్రయాణాదుల్లో ఇబ్బందులకు అవకాశం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదివారం ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త. విశ్రాంతిగా గడుపుతారు. ఆలోచనల్లో ఒత్తిడులకు అవకాశం. ప్రయాణాలలో తొందరపాటు కూడదు. సృజనాత్మకత ఉంటుంది. సోమవారం లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం. సుదూర ప్రయాణాలకు ప్రణాళికలు. అసంతృప్తి. సృజనాత్మకత ఉంటుంది. మంగళవారం ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. బుధవారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో కొంత జాగ్రత్త. నిర్ణయాదుల్లో సమస్యలు. గురువారం వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. ప్రయాణావకాశాలు. సోదర వర్గంతో అనుకూలత. శుక్రవారం కుటుంబంలో శుభ పరిణామాలు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి. ఆర్థిక నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదివారం లాభాలపై దృష్టి. పెద్దల అనుకూలత. ఆశీస్సులు లభిస్తాయి. సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో ఇబ్బందులుంటాయి. శ్రమాధిక్యం. సోమవారం అనుకోని సమస్యలు. లాభాలు కోల్పోయే అవకాశం. తొందరపాటు నిర్ణయాలు కూడదు. పెద్దలతో జాగ్రత్త. మంగళవారం ధార్మిక దానాలపై దృష్టి. విశ్రాంతిగా గడుపుతారు. ప్రయాణాదులపై దృష్టి. అన్ని పనుల్లోనూ సంతోషం. బుధవారం ఆలస్య నిర్ణయాదులు. విశ్రాంతి లోపం. కార్యనిర్వహణలో కొంత జాగ్రత్త. శ్రమతో పనులుంటాయి. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. భాగస్వామ్యాల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. శుక్రవారం నిర్ణయాదుల్లో అనుకూలత ఉన్నా కొంత నిరాశ ఉంటుంది. మాట విలువ తగ్గే సూచనలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలం. గౌరవం పెంచుకుంటారు. అధికారిక వ్యవహారాలపై దృష్టి. ఇతరుల సహకారం లభిస్తుంది. వ్యవహార విజయం. సోమవారం పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. కాని కొంత జాగ్రత్త అవసరం. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. మంగళవారం గౌరవం పెంచుకునే ప్రయత్నం. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యవహారాల్లో అనుకూలత. బుధవారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. విశ్రాంతి లోపాలు. పరామర్శలకు అవకాశం. ప్రయాణ లోపాలకు అవకాశం. గురువారం నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. వ్యాపారాదుల్లో అనుకూలత. అన్ని పనుల్లో లాభాలుంటాయి. శుక్రవారం నిర్ణయ లోపాలు. కొంత నిరాశ ఉంటుంది. ఖర్చులు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో జాగ్రత్త.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం లక్ష్యాలను సాధిస్తారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. సుదూర ప్రయాణాలుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. సోమవారం వ్యతిరేక ప్రభావాలుంటాయి. పోటీలలో జాగ్రత్తగా మెలగాలి. వ్యవహారాల్లో గుర్తింపు కోసం ప్రయత్నం. మంగళవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. శ్రమ ఉన్నా గౌరవం పెంచుకుంటారు. అధికారిక వ్యవహారాలుంటాయి. బుధవారం పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. లాభాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. ఉద్యోగాదులపై దృష్టి. గురువారం వ్యాపార వ్యవహారాల్లో కొంత పెట్టుబడులు తప్పకపోవచ్చు. ప్రయాణాదుల విషయంలో జాగ్రత్త అవసరం. శుక్రవారం వ్యర్థమైన ఖర్చులుంటాయి. లాభాలు సంతోషాన్నివ్వవు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం అన్ని పనుల్లోనూ జాగ్రత్త. తొందరపాటు కూడదు. అప్రమత్తంగా మెలగాలి. నిర్ణయాదులను, కొత్త పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆత్మవిశ్వాస లోపాలు. సోమవారం సృజనాత్మక శక్తి. నూతన కార్యక్రమాలపై దృష్టి. సంతానంతో జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాలు. మంగళవారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గౌరవం. బుధవారం వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. శ్రమాధిక్యం. గురువారం లాభాలు సంతోషాన్నిస్తాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత. సౌకర్యాలు సంతోషాన్ని, సంతృప్తినిస్తాయి. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. లాభాలు సంతోషాన్నివ్వకపోవచ్చు. శనివారం అన్ని పనుల్లోనూ అనుకూలత.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ