S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పురాణేతిహాసాల్లో ‘నగధగలు..!

భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలలో ఆహార్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే వస్తమ్రులు, మాలలు, ఆభరణములు మొదలైన వాటి వివరణ వీటిలో సుదీర్ఘంగా ఇవ్వబడింది. కొన్ని ఆభరణాలు విశిష్ట స్థానాన్ని సంతరించుకుని, తమకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాయి. వేల సంవత్సరాలుగా ఆభరణాల చుట్టూ అల్లబడిన కథలు, సంఘటనలు, కావ్యాలు, నాటకాలు ఉన్నాయి. ఇవి సంస్కృత, తెలుగు, ఇతర భాషల్లో చూస్తాం.
నగలకు సాక్షాత్తూ నటరాజ స్వామి స్థానాన్ని ఇచ్చాడు. నటరాజు కుడిచెవికి పురుష మకర కుండలం, ఎడమ చెవికి స్ర్తిల తాటంకం ధరిస్తాడు. ఇది అర్ధనారీశ్వర తత్త్వానికి సంకేతం. ఆంగ్లంలో కూని శజూ కూది అంటారు. దీన్ని. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
రామాయణంలో...
సీతను రావణుడు అపహరించుకుని వెళ్లినప్పుడు, సీతాదేవి తన ఆభరణాలు కొన్ని మూట కట్టి పడేస్తుంది. సీతను వెతుకుతూ శ్రీరాముడు, లక్ష్మణుడు హనుమంతుని చూస్తారు. అయితే అప్పుడు హనుమంతుడు బ్రాహ్మణుడి రూపంలో ఉంటాడు. కానీ హనుమంతుని మెడలో ఉన్న కాంచనమాల కేవలం శ్రీరాముడు చూసి గుర్తిస్తాడు. దానితో శ్రీరాముడు తన స్వామి అని అర్థం చేసుకుని, ఆతడికి బంటు అవుతాడు. ఆ తరువాత సీతాదేవి నగలు శ్రీరాముడు, లక్ష్మణుడు చూడగా, లక్ష్మణుడు సీతాదేవి గజ్జెలను గుర్తు పడతాడు. ఎందుకంటే అతడు ఎప్పుడూ సీతాదేవిని మాతృస్థానంలో, ఆవిడ కాళ్లు మాత్రమే చూసేవాడు. ఆ తరువాత శ్రీరాముడు హనుమంతునికి తన ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చి పంపుతాడు సీతాదేవికి. లంకలో హనుమంతుడు సీతాదేవిని చూడగా, ఆమె తన చూడామణిని ఇస్తుంది, తన భర్త వద్దకు తీసుకువెళ్లడానికి గుర్తుగా.
మహాభారతంలో...
కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయి.
శకుంతల..
అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు రచించిన ప్రఖ్యాత సంస్కృత నాటకం. ఇందులో దుష్యంతుడు ఇచ్చిన ఉంగరాన్ని శకుంతల నదిలో పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరాన్ని చేప మింగి, మళ్లీ అదే చేప దుష్యంతుని పాకశాలకు చేరుతుంది. ఆ ఉంగరాన్ని చూడగానే మరచిపోయిన స్మృతలన్నీ దుష్యంతునికి గుర్తుకు వచ్చి, శకుంతలను భార్యగా స్వీకరిస్తాడు.
శమంతకమణి..
శ్రీకృష్ణ స్వామి నీలాపనిందలకు లోనయి శమంతకమణిని అపహరించినట్లు పుకార్లు వస్తాయి. ఈ మణి సత్రాజిత్తుది. అతని తమ్ముడు దాన్ని ధరించి వేటకు వెళ్లగా, ఒక సింహం అతన్ని చంపుతుంది. శ్రీకృష్ణుడు దాన్ని వెతుకుతూ జాంబవంతుడి వద్దకు చేరి, యుద్ధంలో గెలిచి, మణిని, కన్యకామణి జాంబవతిని తనదిగా చేసుకుంటాడు. ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు ఇవ్వడానికి వెళ్లినప్పుడు, సత్రాజిత్తు సత్యభామను ఇచ్చి వివాహం చేసి, శమంతకమణిని కూడా శ్రీకృష్ణ స్వామికే ఇస్తాడు.
శిలప్పాదికారం..
ఇల్లాంగో అడిగల్ రాసిన తమిళ మహాకావ్యం ఇది. ఇందులో నాయిక కణ్ణగి. పాండ్య రాజ్యం మహారాణి కాలిగజ్జె దొంగిలించాడన్న తప్పుడు సాక్ష్యం వల్ల కణ్ణగి భర్త మరణశిక్ష పొందుతాడు. ఇది తెలుసుకుని కణ్ణగి పాండ్య రాజు సభకు వచ్చి తన కాలిగజ్జె చూపుతుంది. కణ్ణగి గజ్జె లోపల కెంపులు దాగి ఉంటాయి. మహారాణి గజ్జెలో ముత్యాలు దాగి ఉంటాయి. ఇలా కథ మొత్తం కాలిగజ్జె సాక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది.
మృచ్ఛకటికం..
శూద్రకుడు రాసిన మృచ్ఛకటికం ఎంతో ప్రఖ్యాతమైనది. ఇది సంస్కృతంలో, దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడింది. ఇందులో నాయిక వసంతసేన అనే వేశ్య. నాయకుడు చారుదత్తుడు. వసంతసేన తన నగలను ఒక మట్టిబొమ్మ బండిపై పెడుతుంది. తరువాత అవి దొంగిలింపబడి ఎన్నో మలుపులు తిరుగుతుంది కథ. 1984లో ‘ఉత్సవ్’ అనే హిందీ సినిమా - రేఖ, శేఖర్‌సుమన్, శశికపూర్ తారాగణంగా ఈ మృచ్ఛకటికం నిర్మితమైంది.
ముద్రారాక్షసం..
ఇది విశాఖదత్తుడు రాసిన సంస్కృత నాటకం. ఇందులో చాణక్యుడు రాక్షస మహామంత్రి ఉంగరాన్ని గూఢచారుల ద్వారా దొంగిలించి, అసత్యపు లేఖలు సృష్టించి, ఆ ఉంగరంతో వాటిని రాజలేఖలుగా నమ్మబలుకుతాడు. 1991లో చాణక్య అనే టీవీ సీరియల్ వచ్చింది. ఈ టీవీ సీరియల్ ప్రధానంగా ‘ముద్రారాక్షసం’ మీద ఆధారపడినదే.
రత్నావళి..
హర్షుడు రాసిన రత్నావళిలో కూడా రత్నావళి ఒక సముద్రయాన ప్రమాదంలో చిక్కుకుంటుంది. తరువాత ఆమెకు సాగరిక అనే పేరు పెట్టి, ఉదయనుడి రాజ్యసభకు తీసుకువెళతారు. ఆమె మెడలో వేసుకునే కంఠాహారం చూసి ఈమె ‘రత్నావళి’ అని మంత్రి గుర్తిస్తాడు.
భామాకలాపం..
శ్రీకృష్ణ స్వామిని చూడని సత్యభామ తన నెచ్చెలి మాధవిని రాయబారిగా పంపుదామని అనుకుంటుంది. అప్పుడు మాధవి ముంగెరను పారితోషికంగా అడుగుతుంది. స్ర్తికి ఎన్ని నగలున్నా, ముక్కు ముంగెర ఎంతో ముఖ్యమైనది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి