S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆ ప్రతిభ ‘అనిత’రసాధ్యం!

గురుస్థానంలో ఉండి గత 20 సం.లుగా ఉపాధ్యాయురాలిగా నృత్య కళా గురువుగా దాదాపు 5వేల మందికి కళను నేర్పిస్తూ మరోవైపు తన కళాప్రతిభను సామాజిక, నైతిక విలువలతో కూడిన ఎన్నో నృత్య రూపక ప్రదర్శనలను జనరంజకంగా వినోదంతో కూడిన విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, సంప్రదాయ నృత్యాలను జానపద కళారూపాలను ప్రతి కుటుంబంలోని పిల్లలు అభ్యసించి కళాకారులుగా ఉండాలని సమాజంలోని ప్రతి ఒక్కరినీ కళ వైపు ప్రోత్సహిస్తూ కళను రేపటి తరానికి అందించడానికి అహర్నిశలు శ్రమిస్తూ రాబోయే తరాలకు వారధిగా నిలుస్తున్నారు. కళ పట్ల తనకున్న అభిమానాన్ని చూపించే ప్రయత్నంలో నృత్య శాఖలో తాను పరిశోధించిన పిహెచ్.డి. గ్రంథాన్ని నృత్య రూపకంగా మార్చి ప్రదర్శించిన మొట్టమొదటి కళాకారిణి మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఏకైక నృత్య ఉపాధ్యాయురాలు డా.అనితారావు.
1977, మే 23 పాతబస్తీలోని బేలా అనే ప్రాంతంలో పద్మావతి, రమాకాంతరావు గార్లకు జన్మించారు అనిత.
ప్రస్థానం
తండ్రిగారి ప్రోద్బలంతో చిన్నప్పటి నుండి నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. గురువులు శ్రీమతి అనూరాధ, డా.గోపాల్‌రాజ్ భట్, డా.ఉమారామారావు, డా.్భగవతుల సేతురాం, డా.అలేఖ్య పుంజల వంటి ఎందరో గొప్ప గురువుల వద్ద నృత్యం నేర్చుకుని ఉన్నత కళాకారిణిగా అయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయంలో బి.ఏ. నృత్యం, ఎం.ఏ. నృత్యం 1993-98లో చేసి, బి.ఏలో స్వర్ణ పతకం, ఎం.ఏలో స్వర్ణపతకం సాధించారు. 1991లో తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో పిజి డిప్లొమా చేశారు. ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. తండ్రిగారు, గురువుల ప్రోత్సాహంతో యుజిసి నెట్ పాసయ్యారు. ఆ రోజుల్లోనే గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూలు - నాంపల్లిలో నృత్యం టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. 1998లో డా.కోట్ల హనుమంతరావుగారితో వివాహం జరిగింది. వీరి పిల్లలు కూడా మంచి కళాకారులు. జానపదంలో, ఇంటర్ డిసిప్లినరీ ప్రాతిపదికలో ‘కూచిపూడి భాగవత ప్రదర్శన పద్ధతి’ మీద ఎం.్ఫల్, తరువాత ‘కూచిపూడి భాగవతుల వివిధ కళారూపాలు’ పరిశోధనాంశంతో పిహెచ్.డి. 2009లో చేశారు. 2010-12లో ఎంపిఏ ఫోక్ ఆర్ట్స్ చేశారు. ‘కూచిపూడి మహత్వం’ ‘తమసోమా జ్యోతిర్గమయ’ ‘లోకస్సమస్తా సుఖినోభవంతు’ ‘జయజయహే తెలంగాణ’ ‘గంగిరెద్దు’ ‘బాబాసాహెబ్ అంబేద్కర్’ వంటి ఎన్నో నృత్య రూపకాలు చేశారు.
నృత్య దర్శకత్వం.. 2016లో ‘నాయకురాలు నాగమ్మ’ అనే నాటకానికి డా.కోట్ల హనుమంతరావు గారు దర్శకత్వం వహించారు. అందులోని పాటలకు అనితారావు గారు నృత్య దర్శకత్వం చేశారు. 2017లో ‘రామప్ప’ అనే చారిత్రక నాటకానికి, ఇదే సంవత్సరంలో ఎం.ఎన్.శర్మ గారి దర్శకత్వంలో ‘అంధాయుగ్’ అనే నాటకానికి కూడా నృత్య దర్శకత్వం వహించారు. 2018లో ‘ప్రతాప రుద్రమ’ అనే చారిత్రక ట్రైలజీ నాటకంలోని మొదటి భాగానికి నృత్య దర్శకత్వం అందించారు. తర్వాత రెండు భాగాలకు కూడా నృత్య దర్శకత్వం వహిస్తామన్నారు.
భవిష్యత్తులో చేయబోయే నృత్య రూపకాలు
‘స్ర్తి శక్తి’ - స్ర్తిలు ఎటువంటి మహోన్నత స్థానానికి ఎదిగినా పురుషాధిక్య సమాజంలో తగిన గుర్తింపు పొందలేక పోతున్నారని, స్ర్తి శక్తిని ప్రదర్శించే ప్రదర్శనను రూపొందించటం ద్వారా సమాజానికి స్ర్తి ఔన్నత్యాన్ని తెలియజేసే ప్రయత్నం దిశగా పయనిస్తున్నారు అనిత.
రచనలు
1.మన కూచిపూడి - కూచిపూడి నాట్య ప్రదర్శనకు సంబంధించిన విజ్ఞానాన్ని సరళమైన భాషలో పుస్తకంగా రాశారు.
2.కూచిపూడి భాగవతం ప్రదర్శన పద్ధతులు
3.కూచిపూడి భాగవతం వివిధ కళారూపాలు
4.్భరతీయ జానపదం, అన్ని రాష్ట్రాలకు చెందిన జానపద కళారూపాలను ఈ పుస్తకం ద్వారా అందించనున్నారు.
అంతేకాకుండా - తెలంగాణ సంస్కృతిని వ్యాప్తి చేయడానికి 30కి పైగా జాతీయ, అంతర్జాతీయ పత్ర సమర్పణ చేశారు. 2015లో గోవాలో ‘చిందు ఎల్లమ్మ’ గురించి పత్ర సమర్పణలో దేశ విదేశాలకు సంబంధించిన గౌరవ అతిథులు మరియు పాత్ర సమర్పకులు 45 నిమిషాలకు పైగా చర్చలు జరిపారు. ఒక విధంగా అనితారావుగారు నృత్య రంగంలో స్థిరపడటానికి కారణమైన గోపాల్‌రాజ్ భట్‌గారి పేరు మీద జయంతి ఉత్సవాలను నిర్వహించి పెద్దలను సన్మానించుకోవటం చేస్తున్నారు. ఇది గత 3 సం.ల నుండి చేస్తున్నారు.
విజయాలు
1.బి.ఎ మరియు ఎం.ఏ.లో గోల్డ్‌మెడల్
2.నేషనల్ కొరియోగ్రఫీ అవార్డు (2012)
3.విశిష్ట సేవా పురస్కారం (2017)
4.గ్లోబల్ అవార్డు -2016 (బెస్ట్ టీచర్ అవార్డు)

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి