S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘నేను’ అమ్మతనాన్ని

-1-
నేను
అమ్మను
అమ్మ అమ్మను
అయినా, కాను అమ్మమ్మను
అవునవును, కుటుంబాన అమ్మమ్మను
వసుధైక కుటుంబాన అమ్మల అమ్మను.
*
నేను
అమృతాన్ని
అమ్మతనాన్ని
అమ్మతన అమృతభాండాన్ని
విశ్వామృత నిస్వార్థ పంపకాన్ని
ఇహ పర ఆనంద తాండవాన్ని
-2-
నేను
అమ్మను
అద్వితీయాన్ని
అయినా, కాను అడుగుల సవ్వడిని
అవునవును, అందరి
సవ్వడుల నిశ్శబ్దాన్ని
సడిచేయని భావోద్వేగ జోడు
అందెల రవళిని
*
నేను
అస్తిత్వాన్ని
పారాడే అంతస్తత్వాన్ని
అనంత పోరాట పటిమని
పేగుబంధ అంతర్గత తత్వాన్ని
ఆది అంత రహిత అనంతత్వాన్ని
-3-
నేను
అమ్మను
గర్భానుబంధాన్ని
నాభీ స్వరానికి అందని భావోద్వేగాన్ని
నాడీ కేంద్రానికి చేరని ప్రేమోదంతాన్ని
ప్రపంచ భాషలకు దక్కని జీవ రహస్యాన్ని
*
నేను
రక్షాకవచాన్ని
అమ్మతన జీవనస్రవంతిని
ముద్దిడిన కొండంత అండను
ప్రవాహ సదృశ పులకింతను
భాషకు పరిమితం కాని తాదాత్మ్యాన్ని
-4-
నేను
అమ్మను
ఆడపడుచును
సృష్టిక్రమ మాతృగర్భను
తరతరాల పుట్టింటి మాతృకను
ఏడు తరాల మెట్టినింటి నవగర్భను
భవిష్యత్తర అందాన్ని
ఆనందాన్ని అస్తిత్వాన్ని
*
నేను
అమ్మ ఒడిని
తొలి విజయ క్షేత్రాన్ని
అక్షరాభ్యాస పాఠశాలని
జీవనక్షాత్ర కళాశాలని
జీవ రహస్య విశ్వవిద్యాలయాన్ని
-5-
నేను
అమ్మను
సౌభాగ్య సీమను
సౌశీల్య సంపదను
కనిన కరుణిమను
కనరాని వేదనను
*
నేను
కన్నతల్లిని
కుటుంబ వ్యవస్థన సాలీడుని
అల్లుకుపోతున్న విశ్వవలయాన్ని
రాణీవాస బహుముఖీన ప్రజ్ఞను
ఏకతా రాగంలా అనిపించే
ఐక్యతా రాగాన్ని
-6-
నేను
అమ్మను
సహస్రదళను
కౌటుంబిక వనమాలిని
అన్ని జాతుల అమ్మతనాన్ని
రంగు రుచి వాసనల సంగమాన్ని
*
నేను
పురిటి బాధను
షిఫ్ట్‌లకు అందని వర్కోహాలిక్‌ని
ఇన్‌స్ట్రుమెంట్స్ లేని కాల్ సెంటర్‌ని
బాధకు రియాక్ట్ కాగల రిసీవర్‌ని
గడియ పడని తలుపుని తమ్మ తలపుని
-7-
నేను
అమ్మను
సమతూకం లేనిదాన్ని
కనలేని విజ్ఞాన సర్వస్వాన్ని
అయినా, కడదాకా కేరాఫ్ అడ్రస్‌ని
రిటైర్‌మెంట్ లేని ఫుల్‌టైమ్ రెస్పాన్సిబిలిటీని
*
నేను
ఆత్మగీతను
మృతతత్వం దరిచేరని అమృతత్వాన్ని
సంస్కృతీ సంప్రదాయాల ప్రజ్ఞాపాటవాన్ని
నిఘంటువుల కెక్కని సంపూర్ణార్థాన్ని
నీ కోసం నా గీతను దాటినవాన్ని.

-విశ్వర్షి 93939 33946