S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (14-4-2019 నుంచి 20-4-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో సౌకర్యాదులను పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలుంటాయి. వ్యాపార పరమైన పెట్టుబడులకు అవకాశం. ఆలోచనలు విస్తరిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్లానింగ్ ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. సంతాన వర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. విందులు విలాసాల కోసం వెచ్చిస్తారు. విహార యాత్రలకు అనుకూలం. వారం మధ్యలో వ్యతిరేక ప్రభావాలుంటాయి. విజయ సాధన కోసం ప్రయత్నిస్తారు. శ్రమాధిక్యం. శారీరకమైన ఒత్తిడులు, ఉష్ణ రోగాలుంటాయి. ఆహార విహారాల్లోనూ జాగ్రత్త అవసరం. వారాంతంలో భాగస్వామ్యాలు వృద్ధి చెందుతాయి. సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వామ్యాల్లోనూ అనుకూలత. కుటుంబ ఆర్థికాంశాల్లో తొందరపాటు కూడదు. మాటల్లో జాగ్రత్త తప్పనిసరి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు, పెట్టుబడులుంటాయి. విందులు విహారాలు సౌఖ్యం కోసం వెచ్చిస్తారు. ప్రయాణావకాశాలు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. గుర్తింపు లభిస్తుంది. నిర్ణయాదుల్లో అనుకూలత. కార్యనిర్వహణపై దృష్టి. ఆలోచనల్లో కొంత నైరాశ్య భావన. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. వారం మధ్యమంలో కుటుంబ బాంధవ్యాదుల్లో శుభ పరిణామాలు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత. మాట తీరు సంతోషాన్నిస్తుంది. ఉన్నత వ్యవహారాలు, పితృవర్గ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి. అధికారుల ఆదరణ. ఖర్చులు కూడా సంతృప్తినిస్తాయి. వారాంతంలో సంప్రదింపులు సంతోషాన్నిస్తాయి. సహకార లాభాలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అనారోగ్య భావనలు. కార్యనిర్వహణలో సమస్యలు. సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలపై క్రమంగా దృష్టి పెరుగుతుంది. గుర్తింపు గౌరవాదులుంటాయి. ధార్మిక ఆధ్యాత్మిక దృష్టి. వైజ్ఞానికమైన ప్రయాణాలు, పరిశోధనలకు అవకాశం. నిర్ణయాదుల్లో ఒక్కోసారి ఇబ్బందులకు అవకాశం. ఆహార విహారాల్లో అనుకూలత. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. పదోన్నతులపై దృష్టి. హోదా పెంచుకునే సూచనలు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. అనేక బాధ్యతల ఒత్తిడులుంటాయి. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. భాగస్వామ్యాల్లో జాగ్రత్త వహించాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, వ్యాపార లాభాలు కూడా ఉంటాయి. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలపై దృష్టి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ప్రయాణాదుల్లో అనుకూలత. అనుకోని ఇబ్బందులు. అనారోగ్య భావనలు. కొన్ని లాభాలు, సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. వారం మధ్యమంలో మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. మంచి ప్రణాళికలుంటాయి. సంతానవర్గ అనుకూలత ఉంటుంది. పన్నుల చెల్లింపులకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. ఖర్చులు అధికం. కొత్త వార్తలు అందే అవకాశం. అనుకూల నిర్ణయాలుంటాయి. వారాంతంలో వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో అనుకూలత. శ్రమాధిక్యం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కొన్ని లాభాలు కనిపిస్తుంటాయి. ప్రయోజనాలు వచ్చే సూచనలు అధికం. భాగస్వామ్య వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. పెట్టుబడుల వల్ల అనుకూలత. ప్రయాణాలు ఉంటాయి. విందులు వినోదాలపై దృష్టి ఉన్నా కొంత ఆసుపత్రులు, పరామర్శలకు కూడా అవకాశం ఉంది. సౌకర్య లోపాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. పరిచయాలు, స్నేహానుబంధాల్లో కొంత అనుకూలత. సత్సాంగత్యం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెంచుకునే సూచనలు. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. బాధ్యతల నిర్వహణ సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తుంది. అధికారులతో అనుకోని సమస్యలు. టాక్స్‌లు, చెల్లింపుల విషయంలో ముందు జాగ్రత్త అవసరం. లాభాలపై ప్రత్యేక దృష్టి. వారాంతంలో కుటుంబంలో అనుకూలత.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై దృష్టి. సామాజిక అనుబంధాలు మెరుగుపడతాయి. సంప్రదింపులకు అనుకూలం. వ్యాపార వర్గ సహకారం లభిస్తుంది. క్రమంగా అనుకోని సమస్యలు, అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవాలి. సౌకర్యాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో అన్ని పనుల్లో అనుకూలత. లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నత వ్యవహారాలు, విద్య, ధార్మిక కార్యక్రమాలపై దృష్టి. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. కొన్ని ప్రయాణాలు తప్పవు. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలం. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు. సామాజిక గౌరవం పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. ఆర్థిక నిల్వలపై దృష్టి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. సహకార లాభాలుంటాయి. కొత్త వార్తలకు అవకాశం. దగ్గరి ప్రయాణాదులు తప్పకపోవచ్చు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ ఉన్నా గుర్తింపు, అనుకూలత. వారం మధ్యలో ఆహార విహారాల్లో శుభ పరిణామాలు. సౌకర్యాదులు పెంచుకునే ప్రయత్నం. అధికారుల ఆదరణ. పెద్దల అనుకూలత. ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో శుభ పరిణామాలు. వారాంతంలో అభీష్టాలు నెరవేరుతాయి. సంతాన వ్యవహారాల్లో శుభ పరిణామాలు. కొత్త పనులపై దృష్టి. క్రియేటివిటీ పెంచుకుంటారు.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. వ్యతిరేకతలపై విజయం. వ్యాపారాదుల్లో అనుకూలత. అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త. వార్తల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. పోటీలు, ఒత్తిడులు, చికాకులు ఉన్నా విజయ సాధన. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. దానధర్మాల వల్ల మరింత మేలు. విశ్రాంతి కోసం ప్రయత్నం. అయినా భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. అధికారులతో కొంత జాగ్రత్తగా మెలగాలి. వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుంది. వారాంతంలో నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలను అధిగమించాలి. పోటీలు ఒత్తిడులున్నా వ్యవహార విజయం సాధిస్తారు. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమాధిక్యం. మాటల్లో చమత్కార ధోరణి. క్రమంగా భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరించే అవకాశం. లాభాలు కొన్ని ఉన్నా ఆశించిన సంతోషం, సంతృప్తి ఉండకపోవచ్చు. మాట విలువ పెంచుకునే సూచనలు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. ఊహించని సంఘటనలకు అవకాశం. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. అధికారికమైన ఒత్తిడులుంటాయి. వారాంతంలో లక్ష్యాలను సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. సౌకర్యాలు, సౌఖ్యంపై దృష్టి ఉన్నా తొందరపాటు ఇబ్బంది పెట్టవచ్చు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో బాధ్యతల నిర్వహణ తప్పకపోవచ్చు. శారీరకమైన ఒత్తిడులున్నా గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలకు అవకాశం అధికం. కుటుంబ ఆర్థికాంశాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెంచుకుంటారు. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం. వ్యతిరేక ప్రభావాలపై విజయం. శ్రమ ఉన్నా కార్యనిర్వహణ. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సుదూర ప్రయాణాలు, విహార యాత్రలకు అవకాశం. వారం మధ్యమంలో కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సోదర వర్గంతో అనుకూలత. వృత్తి పరమైన ఒత్తిడులున్నా గుర్తింపు. పదోన్నతి. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. సంప్రదింపుల వల్ల పరిష్కారాలుంటాయి. వారాంతంలో ఆహార విహారాల్లో అనుకూలత. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. గృహ వాహనాదులను పెంచుకునే ప్రయత్నం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో లక్ష్యాలను సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు. వృత్తిలో రాణిస్తారు. శ్రమతో అన్ని కార్యక్రమాల నిర్వహణ. బాధ్యతలు పెరిగే అవకాశం. గుర్తింపు, గౌరవాదులుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొన్ని ఇబ్బందులు. మాటల్లో కొంత నైరాశ్య ధోరణి. సంతాన వర్గంతో సంతోషం. సృజనాత్మక భావాలు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు పొందే అవకాశం. వ్యవహారాల్లో అనుకూలత. పోటీల్లో విజయం సాధిస్తారు. వ్యతిరేకతల వల్ల కొన్ని ఇబ్బందులుంటాయి. కొంత సంయమనంతో వ్యవహరిసాతరు. లక్ష్యాలను సాధించే యత్నం. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు తప్పవు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో సంతాన వర్గంతో సంతోషం. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తారు. నిర్ణయాదుల్లో శుభ పరిణామాలు. వ్యాపారాల్లో అనుకూలత. క్రమంగా వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. కార్యక్రమాల్లో శ్రమతో గుర్తింపు. వృత్తి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించాలి. కొంత నైరాశ్యం తప్పదు. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. వారం మధ్యమంలో పరిచయాలు నూతనంగా ఏర్పడవచ్చు. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి. కుటుంబంలో కొన్ని ఒత్తిడులు ఏర్పడతాయి. ఆర్థిక నిల్వలు తగ్గే సూచనలు. మాటల్లో అధికారిక ధోరణి. అభీష్టాలు నెరవేరుతాయి. వారాంతంలో అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744