S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (28-4-2019 నుంచి 4-5-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో గుర్తింపు లభిస్తుంది. స్థాయిని పెంచుకునే ప్రయత్నం. శారీరకమైన ఒత్తిడులుంటాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పదోన్నతులపై దృష్టి. ఆహార విహారాలు సౌకర్యాదులపై దృష్టి. శ్రమతో కార్యనిర్వహణ. అన్ని పనుల్లోనూ అనుకూలత. మాట్లాడే ధోరణిలో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు లభిస్తాయి. పెద్దల ఆశీస్సులకు అనుకూలం. సోదర వర్గంతో ఆనందంగా గడిపే అవకాశం. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ప్రయాణాలుంటాయి. సంప్రదింపుల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. పనిలేని వార్తల వల్ల ఇబ్బందులు. గౌరవ లోపం లేకుండా చూసుకోవాలి. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికవౌతాయి. ఆచితూచి వ్యవహరించాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు. పోటీ రంగంలో గుర్తింపు గౌరవాదులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో పరిచయాలు పెంచుకుంటారు. అనుబంధాలు పెరుగుతాయి. మిత్రుల కలయిక. భాగస్వామితో ప్రయాణాదులకు అవకాశం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. లాభాలు కొన్ని ఉన్నా ఉపయోగపడవు. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలుంటాయి. వారాంతంలో అన్ని విషయాల్లో అనుకోని సమస్యలు. వ్యర్థమైన వ్యవహారాలుంటాయి. పాత బాకీల వసూళ్లు, అనారోగ్య భావన. ఊహించని సంఘటనలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆర్థిక నిల్వలపై దృష్టి. మాటతీరు లాభిస్తుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఉంటాయి. పోటీ రంగంలో కొంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. మంచి వార్తలు వింటారు. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. ఉన్నతవిద్య, ఉద్యోగాదులపై దృష్టి కేంద్రీకరిస్తారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. గౌరవం కోసం ఖర్చులు చేస్తారు. వారాంతంలో సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. విద్యాత్మక రంగంలో శుభ పరిణామాలు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత. శ్రమతో విజయం సాధిస్తారు. కొంత బద్ధకం తగ్గించుకోవాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో కీర్తిప్రతిష్ఠలు పెంచుకుంటారు. గుర్తింపు లభిస్తుంది. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై ప్రత్యేక దృష్టి. నిర్ణయాదుల్లో తొందరపాటు కూడదు. దగ్గరి లేదా దూర ప్రయాణాలను గూర్చిన చర్చ. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వ్యవహారాలకు చాలా అనుకూలం. వారం మధ్యమంలో వృత్తిలో ఉన్నతి. ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలు. పదోన్నతులపై దృష్టి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. ఆహార విహారాలకు అనుకూలం. గౌరవం పెరుగుతుంది. బాధ్యతల నిర్వహణపై పరిపూర్ణ దృష్టి. కుటుంబంలో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్యాల్లో అనుకూలత. స్నేహానుబంధాలు పెంచుకుంటారు. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుంటాయి. లాభాలు సంతోషాన్నీ సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు, అభినందనలను అందుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. అభీష్టాలు నెరవేరుతాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. లాభాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. దూర ప్రయాణ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. అసంతృప్తి. వారం మధ్యమంలో వ్యతిరేకతలుంటాయి. పోటీలను తట్టుకోవాలి. వ్యవహారాల్లో విజయం. గుర్తింపు కోసం ప్రయత్నం. శ్రమ తప్పకపోవచ్చు. శత్రు రోగ రుణాదులు ఇబ్బందులు పెట్టినా అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. ఖర్చులు పెట్టుబడులుంటాయి. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. పెద్దలతో సంప్రదింపులు ఫలిస్తాయి. వారాంతంలో భాగస్వామ్యాలపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో ఉన్నతి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. నిర్ణయాదులు లాభిస్తాయి. కార్యనిర్వహణ దక్షత. బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. ఆలోచనల్లో తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో మాట తీరులో సంతృప్తి. నిల్వధనం పెంచుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలలో శుభ పరిణామాలు. కొన్ని అనుకోని సంఘటనలుంటాయి. అధిగమించాల్సి వస్తుంది. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు, అనేక రూపాల్లో లాభాలుంటాయి. వారాంతంలో సంప్రదింపులుంటాయి. సహకార లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారాదుల్లో అనుకూలత. వ్యర్థమైన ఖర్చులు ప్రయాణాలకు కూడా అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాలకు అనుకూలం. మంచి వార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కొన్ని అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం. కార్యనిర్వహణలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలం ధనం వ్యర్థంగా కోల్పోయే అవకాశం. కుటుంబ ఆర్థికానుబంధాలపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. వారం మధ్యమంలో ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. దూర ప్రయాణాలుంటాయి. ఉన్నత విద్య, ఉద్యోగాదులు సంతోషాన్నిస్తాయి. పరిశోధనలు వెలుగు చూస్తాయి. గౌరవం పెంచుకుంటారు. నిర్ణయాదుల్లో కొంత జాగ్రత్త. తొందరపాటు కూడదు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. వారాంతంలో వృత్తిలో శుభ పరిణామాలు. ఉద్యోగాదుల్లో పదోన్నతులు. అధికారులతో సంప్రదింపులు. చర్చలు ఫలిస్తాయి. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. విద్యాత్మక వ్యవహారాలపై దృష్టి. గృహ వాహనాదుల విషయంలో ప్రత్యేక దృష్టి. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ. కొన్ని అనుకోని ఒత్తిడులు, ప్రమాదాలకు అవకాశం. జాగ్రత్త వహించాలి. వారం మధ్యమంలో ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాదులుంటాయి. అన్ని పనులకు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. క్రియేటివిటీతో తక్కువ శ్రమతో ఎక్కువ పనుల నిర్వహణ. సుదూర ప్రయాణాలపై దృష్టి. కొంత అసంతృప్తి. కుటంబంలో మంచి భావనలు. ఆర్థిక నిల్వలను పెంచుకుంటారు. వారాంతంలో పోటీలు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలను అధిగమించాలి. అప్పులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తారు. సేవక వర్గంతో సంప్రదింపులు.
కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలకు కూడా అవకాశం. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల్లో తొందరపాటు కూడదు. వారం మధ్యమంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత. అనేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. గుర్తింపు, గౌరవాదులుంటాయి. భాగస్వామ్యాల్లోనూ శుభ పరిణామాలు. ఆలోచనల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. వృత్తిపరమైన గుర్తింపు, శ్రబ ఉంటాయి. వారాంతంలో కుటుంబ బాధ్యతలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. మాట విలువ పెంచుకునే ప్రయత్నం. చమత్కారంగా, సంతోషంగా వ్యవహరిస్తారు. కొన్ని అనుకోని సంఘటనలుంటాయి. జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో చర్చలు ఫలిస్తాయి. స్నేహానుబంధాలు విస్తరించే తరుణం. పరిచయాలను పెంచుకుంటారు. నిర్ణయాదుల్లో అనుకూలత. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. లాభాలున్నా ఆశించిన ఫలితాలు అందకపోవచ్చు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావనలకు అవకాశం. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. అభీష్టాలు కొన్ని నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. వారాంతంలో కీర్తి ప్రతిష్ఠలు పెంచుకునే ప్రయత్నం. ఉన్నతోద్యోగాలు ప్రభావితం చేస్తాయి. ఆధ్యాత్మిక, వైజ్ఞానిక యాత్రలకు అనుకూలం. పరిశోధనలు సంతోషాన్నిస్తాయి. పోటీ రంగంలో కొంత జాగ్రత్త అవసరం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. అనేక రకాల వార్తలు అందుతాయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి. ఇతరుల సహకారం లభిస్తుంది. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. ఉన్నత విద్య, ఉద్యోగాదులు, కీర్తిప్రతిష్ఠలు ప్రభావితం చేస్తాయి. వారం మధ్యమంలో ఆహార విహారాలకు అనుకూలం. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. సౌఖ్యంగా కాలం గడుపుతారు. శ్రమ ఉన్నా విద్యాత్మక రంగాల్లో అనుకూలత. వృత్తి వ్యవహారాల్లోనూ రాణిస్తారు. సామాజికమైన గుర్తింపు లభిస్తుంది. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. కొంత కాలం ధనం వ్యర్థం కావచ్చు. గౌరవం పెంచుకుంటారు. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన. చక్కని ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తారు. కార్యనిర్వహణాదక్షత. సృజనాత్మకత వ్యవహారాలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు సంతోషాన్నిస్తాయి. ఆలోచనలకు రూపకల్పన. సంతాన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలుంటాయి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. విశ్రాంతిగా గడుపుతారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమించే ప్రయత్నం. పోటీలున్నా విజయం సాధిస్తారు. ప్రయాణావకాశాలుంటాయి. సౌకర్యాల విషయంలో ఇబ్బందులు. ప్రయాణాల్లో జాగ్రత్త. ఉన్నత విద్య, ఉద్యోగాదులు, కీర్తిప్రతిష్ఠలకు అనుకూలం. వారాంతంలో నిర్ణయాదులు ప్రభావితం చేస్తాయి. బాధ్యతలు సంతోషంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. కార్యనిర్వహణ దక్షత. గుర్తింపు లభిస్తుంది. సంతృప్తి. భాగస్వామ్యాలు ప్రభావితం చేస్తాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744