S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆలోచనలు( సండేగీత)

కొత్త ఆలోచనలు అందరికీ వస్తాయి.
భావాలూ అంతే!
కల్పనా శక్తి అందరికీ వుంటుంది.
ప్రణాళికలు చాలామంది రచిస్తారు.
నూతన సంవత్సరం రాగానే ఎన్నో పనులు చేయాలని అనుకుంటాం.
మనమే కాదు.
ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతి మనిషి ఇదే విధంగా ఆలోచిస్తాడు.
దాదాపు అందరి ఆలోచనలు ఒకే విధంగా వుంటాయి. వాటిలో కొన్ని ఈ మాదిరిగా వుంటాయి.
అలారం బెల్ మ్రోగక ముందే లేవాలి. అమ్మ లేపక ముందే లేచి చదువుకోవడం మొదలుపెట్టాలి.
ఓ మిత్రుడికి పుస్తకానికి ముందు మాట రాసి ఇద్దామని అనుకున్నాను. అది ఈ రోజు తప్పక రాయాలి.
ఉబుసుపోని మాటలు మానేసి, ఉపయోగపడే పనులు చేయాలి.
మొన్న ఆ పని చేయాల్సి వుండింది. ఈ రోజైనా ఆ పని పూర్తి చేయాలి.
కొంత దయతో వుండాలి. కొంత ప్రేమతో వుండాలి.
కొన్ని విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలి.
అందరి ఆలోచనలు దాదాపు ఇలాగే ఉంటాయి.
వాళ్లు చేస్తున్న వృత్తులను బట్టి, ప్రాంతాన్ని బట్టి ఈ ఆలోచనా ధోరణి మారవచ్చు.
అయితే భేదం ఒక్కటే.
విజయం సాధించాలనుకున్న వ్యక్తులు తమ ఆలోచనలు ఆలోచనల మాదిరిగా వుంచరు. వాటిని అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు.
మిగతా వ్యక్తులు ప్రతి రోజూ అలా ఆలోచిస్తూనే ఉంటారు. అవి కొనసాగుతూనే ఉంటాయి.
నిరంతరంగా.
ఆలోచనలని అమలు చేయాలి.
అందుకువెంటనే ప్రయత్నం ప్రారంభించాలి.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001