S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (19-5-2019 నుంచి 25-5-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో కొన్ని వ్యతిరేక సంఘటనలు ప్రభావితం చేస్తాయి. సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. శ్రమాధిక్యం. అనుకోని నష్టాలకు అవకాశం. అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్య భావనలుంటాయి. అసంతృప్తి. దైవధ్యానం, దర్శనం వల్ల మేలు. కుటుంబ ఆర్థికాంశాలు. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. వారం మధ్యమంలో కొత్త పనులపై దృష్టి. దూర ప్రయాణ భావన ఉన్నా ఫలితం సాధారణం. ఆధ్యాత్మిక యాత్రలకు అవకాశం. సద్గురు మార్గం కోసం యత్నిస్తారు. నిర్ణయాదుల్లో కొంత వేగం ఉంటుంది. బాధ్యతలు పరిపూర్ణంగా, సంతోషంగా నిర్వర్తిస్తారు. వారాంతంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి ఉంటుంది. అధికారిక వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలపై దృష్టి. సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. కార్యనిర్వహణలో శుభ పరిణామాలు. గృహ వాహనాది సౌకర్యాదులు సంతోషాన్నిస్తాయి. ప్రయాణాల్లో అనుకూలత. విద్యారంగంలోని వారికి అన్ని విధాలుగా శుభ పరిణామాలు. వారం మధ్యమంలో ఆలోచనలు ప్రభావితం చేస్తాయి. సంతానంతోనూ జాగ్రత్త అవసరం. ఆలస్య నిర్ణయాదులు ఇబ్బంది పెట్టే సూచనలు. క్రియేటివిటీ తగ్గవచ్చు. ప్రణాళికలు ఆశించిన సంతోషాన్నివ్వకపోవచ్చు. వారాంతంలో పోటీలు ఒత్తిడులుంటాయి. వ్యతిరేక ప్రభావాలు ఇబ్బంది పెట్టే అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అయితే గుర్తింపు లభిస్తుంది. శ్రమతో కార్యనిర్వహణ. లాభాలు ప్రభావితం చేస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. దానధర్మాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారాదుల్లో మేలు కలుగుతుంది. కార్యనిర్వహణలో సంతోషం. సంతృప్తి. ప్రయాణాదుల్లో అనుకూలత. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. పోటీలు ఒత్తిడులపై విజయం సాధిస్తారు. అన్ని పనుల్లోనూ శుభ పరిణామాలుంటాయి. వారం మధ్యమంలో బద్ధకం అధికం. నిర్ణయాదుల్లో అత్యధికమైన ఆలస్యం. కొంత నిరాశ తప్పకపోవచ్చు. బాధ్యతల నిర్వహణలో జాగ్రత్త వహించాలి. కొన్ని అనుమానాలు, అవమానాలు ఎదురుకావచ్చు. తొందరపాటు కూడదు. ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచనలు కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. స్ర్తి సంతానంతో సంతోషం. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలపై ప్రత్యేక దృష్టి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం. పెద్దలతో పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. కొత్త పనుల నిర్వహణపై దృష్టి పెరుగుతుంది. సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం. ధైర్యం, చాతుర్యంతో ఎదుర్కోవాలి. నిర్ణయాదుల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త వహించాల్సిందే. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. నిరాశగా గడిపే అవకాశం. ఆధ్యాత్మిక వ్యవహారాలు, ప్రయాణాదుల వల్ల మేలు. దానధర్మాల వల్ల లోపాలన్నిటి నివారణ కలుగుతుంది. వారాంతంలో కార్యనిర్వహణలో మేలు. ఉన్నతమైన వ్యవహారాలపై దృష్టి.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలను వింటారు. ఇతరుల సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. గురుతుల్యుల అనుకూలత, అనుగ్రహం దొరుకుతుంది. దగ్గరి ప్రయాణాదులుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలలో సంతోషం, సంతృప్తి. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు అనేకం లభిస్తాయి. వారం మధ్యమంలో సౌకర్య లోపాలుంటాయి. ఆహార విహారాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. శ్రమాధిక్యం. విద్యారంగంలోని పిల్లలకు, పెద్దలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. గృహ వాహనాదుల విషయంలోనూ కొత్త నిర్ణయాదులు కూడదు. ప్రయాణాదుల్లో ఇబ్బందులు అధికవౌతాయి. వారాంతంలో అభీష్టాలు నెరవేరే అవకాశం. అన్ని పనుల్లోనూ అనుకూలత. వ్యవహారాల్లో శుభ పరిణామాలు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. లాభాలు అనేక రూపాల్లో వచ్చే అవకాశం. సంతోషంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు, అనుకూలత. గౌరవనీయ వ్యక్తులతో గడిపే అవకాశం కలుగుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ఖర్చులు తప్పవు. పెట్టుబడుల వృథా అయ్యే అవకాశం. ఆచితూచి వ్యవహరించాలి. శ్రమాధిక్యం. తొందరపాటు కూడదు. కాలం ధనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రయాణాదులు, కార్యక్రమాల నిర్వహణ వల్ల మేలు కలుగుతుంది. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. వారాంతంలో నిర్ణయాదులలో అనుకూలత. కొత్త పనుల నిర్వహణలో సంతోషాన్ని సంతృప్తిని పొందుతారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు, వ్యతిరేకతలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో అనుకూలత. అనేక కార్యక్రమాలను నిర్వహించే అవకాశం. రుణాలపై విజయం. రోగనిరోధక శక్తి పెంచుకుంటారు. అందరితో జాగ్రత్తగా మెలగాలి. శత్రు భావనకు దూరంగా గడపాలి. వ్యాపారాల కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం. వారం మధ్యమంలో పరిచయాలు స్నేహానుబంధాలు పెంచుకునే ప్రయత్నం. అన్ని పనుల్లోనూ కొంత ఒత్తిడి పెరుగుతుంది. భాగస్వామితో జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. వ్యాపారాది భాగస్వామ్యాల్లో కొంత నైరాశ్య ధోరణి ఉంటుంది. వేరువేరు రూపాల్లో లాభాలుంటాయి. వారాంతంలో అనుకోని సమస్యలుంటాయి. ఇబ్బందులకు అవకాశం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో అనుకూలంగా గడుపుతారు. నిల్వధనం బాగా పెంచుకునే ప్రయత్నం. మాటల్లో అనుకూలత. మాట విలువ బాగా పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత. అందరికీ తలలో నాలుకలా మెలగుతారు. వ్యాపారాదుల్లో కొంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారం మధ్యమంలో సంప్రదింపులకు అనుకూలం. శ్రామిక, కార్మిక వర్గ సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయాణాదులకు అనుకూలం. సోదర వర్గంతో కొంత జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. కృషి పట్టుదలతో కార్యక్రమాలను బాగా నిర్వహిస్తారు. గృహ వాహనాదులు ప్రభావితం చేస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అన్ని రకాలుగా మేలు కలుగుతుంది.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అనేక కార్యక్రమాల నిర్వహణలో తలమునకలవుతారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. బాధ్యతలు అధికం. సామాజిక గౌరవం పెరుగుతుంది. శ్రమ మాత్రం అత్యధికం. వేరువేరు పనులన్నీ ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. ఒత్తిడి తప్పకపోవచ్చు. దైవధ్యానంతో కార్యక్రమాలను నిర్వహించడం వల్ల మేలు కలుగుతుంది. వారం మధ్యమంలో లాభాలు ఆశించినంతగా ఉండకపోవచ్చు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త. ప్రయోజనాలను కోరుకోవద్దు. పెద్దలతో ఇబ్బందులుంటాయి. తొందరపాటు కూడదు. సోదర వర్గంతో కూడా అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు ప్రభావితం చేస్తాయి. ఆహార విహారాలుంటాయి. సౌఖ్యం, సంతోషాదులపై దృష్టి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో ఆలోచనలకు రూపకల్పన. సృజనాత్మకత. అభీష్టాలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కార్యనిర్వహణలో సంతోషం. తక్కువ శ్రమతో ఎక్కువ పనులు పూర్తి చేస్తారు. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాదుల్లో లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. ఉన్నత విద్యలపై దృష్టి. వారం మధ్యమంలో వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. శ్రమ అధికవౌతుంది. మొండితనంతో పనులు చేయాల్సి వస్తుంది. గుర్తింపు కోసం ప్రయత్నం. రుణ రోగాదులపై ప్రయత్నపూర్వకమైన విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో శుభ పరిణామాలుంటాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలను పెంచుకునే ప్రయత్నం. దూరపు మిత్రుల కలయిక.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అన్ని పనులకూ అనుకూలం. కార్యనిర్వహణా దక్షత. నిర్ణయాదులు అన్ని రకాలుగా ఉపకరిస్తాయి. గౌరవం పెంచుకునే ప్రయత్నం. బాధ్యతలు విస్తరిస్తాయి. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో కుటుంబ ఆర్థికాంశాల్లో అప్రమత్తంగా మెలగాలి. బద్ధకం బాగా పెరుగుతుంది. శ్రమతో కార్యక్రమాలుంటాయి. మాట విలువ తగ్గిపోయే సూచనలు. నిరాశతో వ్యవహరిస్తారు. మాట్లాడుతారు. ముందు జాగ్రత్త తీసుకోవాలి. బంధువర్గంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. వ్యతిరేకతలపై విజయం. అధికారిక భాగస్వామ్యాల్లో సమస్యలు. వారాంతంలో సంప్రదింపులకు అనుకూలం. సహకారం పరిపూర్ణంగా లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఉన్నత లక్ష్యాలపై దృష్టి. కార్యనిర్వహణలో సంతృప్తి. వైజ్ఞానిక ధోరణి పెంచుకుంటారు. ఆధ్యాత్మిక జీవితం సంతోషాన్నిస్తుంది. సుదూర ప్రయాణ భావన. అనేక కార్యక్రమాల నిర్వహణలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. సోదరవర్గ వ్యవహారాల్లోనూ శుభ పరిణామాలు. వ్యాపారవేత్తల సహకారం లభిస్తుంది. ఉన్నతి. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమ తప్పకపోవచ్చు. చేసే పనుల్లో జాగ్రత్త అవసరం. అన్ని పనుల్లోనూ సమస్యలుంటాయి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. మాటల్లో చమత్కార ధోరణి ఉంటుంది. ఆర్థిక నిల్వలను పెంచుకునే ప్రయత్నం. వారాంతంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. లాభాలు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. పెద్దల ఆశీస్సులు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744