S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విరామమెరుగని ‘నృత్య నీరాజనం’

త్రోవగుంట చందు ఒంగోలులో ప్ర ఖ్యాత కూచిపూడి గురువు, నర్తకుడు. వీరు దశాబ్దాలుగా ‘చందు’ డాన్స్ అకాడెమీ స్థాపించి, కూచిపూడి, జానపద నృత్యం నేర్పిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినా, ఏ ఆలయంలో ఉత్సవాలు జరిగినా, చందు డాన్స్ అకాడెమీ ట్రూప్ వచ్చి, సంప్రదాయ నృత్యం ప్రదర్శించి వెళతారు. ఒంగోలు పెద్ద పట్టణం కాదు. ఇక్కడ అవకాశాలూ ప్రోత్సాహం తక్కువ. అయినా మట్టిలో మాణిక్యంలా, చందు గత కొన్ని దశాబ్దాలుగా కళాసేవ చేస్తూనే ఉన్నారు. వీరికి వేల శిష్యులు ప్రశిష్యులు ఉన్నారు.
వారితో ముఖాముఖి..
* * *
మా అమ్మానాన్నలు త్రోవగుంట రాజ్యలక్ష్మి, సుబ్బారావు. మా గురువుగారు కాజా సుబ్రహ్మణ్యం (గుం టూరు). చిన్నప్పుడు సరదాగా కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టాను. శర్మ కాలేజీలో బి.కాం. కూడా చేశాను. నృత్యం పూర్తిగా ప్రొఫెషన్‌గా చేస్తాను అనుకోలేదు. దాదాపు 10 సంవత్సరాలు నేర్చుకున్నాను నృత్యం. చిన్నప్పుడు కేసెట్లు ఉండేవి. అవి టేప్‌రికార్డర్‌లో పెట్టి అభ్యాసం చేసేవాడిని. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది.
ఇక్కడ ప్రభుత్వం నుండి, జిల్లా అధికారుల నుండి పెద్దగా ప్రోత్సాహం లభించదు. ఒక నృత్య రూపకం చేయాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చవుతుంది. ఎక్కడా ఏ విధమైన ప్రోత్సాహం, సహాయం దొరకడంలేదు. నేనే సొంతంగా ఖర్చులు పెట్టుకుని చేస్తున్నాను.
ఇక ముఖ్యమైన జ్ఞాపకాలు చెప్పాలంటే - అంజలీదేవి గారి ముందు ‘లవకుశ’ చేయించాను. అలాగే శే్వత కోకిల సుశీలమ్మ గారు తుపాను బాధితులకు విరాళాలకు ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు నా బృందం నృత్య ప్రదర్శన ఇచ్చింది. అమరావతి శంకుస్థాపన సమయంలో, కృష్ణవేణి నది పుష్కరాల సందర్భంగా ప్రదర్శన తీయటి అనుభూతి. అలాగే వెయ్యి మంది పిల్లలతో ఒకసారి ప్రదర్శన ఇప్పించాను. హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన, ఇలా ఎన్నో మధుర స్మృ తులు. టిటిడి నాద నీరాజనంలో శ్రీనివాస కల్యాణం, కార్తీక మహోత్సవాలు, గణపతి నవరాత్రులు, ఉగాది, శ్రీరామ నవమి, దేవీ నవరాత్రులు, ఇలా ప్రతి పండుగ, ఉత్సవం ఆలయంలో చేయడం గర్వకారణం. మన నృత్యంతోనే అసలైన ఉత్సవం, వేడుక మొదలవుతుంది. ఎన్నో గౌరవాలూ పురస్కారాలు పొందటం నా అదృష్టం. నాట్య మయూరి, శ్రీకృష్ణదేవరాయ పురస్కారం, ఉగాది పురస్కారం, రాజహంస, నృత్య చూడామణి, చిరంజీవి సుఖీభవ పురస్కారం.. కానీ అసలైన గౌరవం ప్రేక్షకుల ఆదరణ, నా శిష్యుల భక్తి గౌరవంలోనే ఉన్నాయి.
నేను చేసిన కొన్ని నృత్య రూపకాలు - నదుల అనుసంధానం, క్షుద్రభూమి, నాట్య వికాసం, హిరణ్యాక్షుడు, కృష్ణవేణి చరితం, శ్రీనివాస కల్యాణం, గుండ్లకమ్మ చరితం, శ్రీమద్రామాయణం.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి