S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (26-5-2019 నుంచి 1-6-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో అన్ని పనుల్లోనూ ప్రయోజనాలు ఆశిస్తారు. లాభాలు సంతోషాన్ని సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. సంప్రదింపుల్లో కొంత జాగ్రత్త అవసరం. వార్తల వల్ల కొంత ఇబ్బంది. ప్రయాణాలలో సమస్యలుంటాయి. వారం మధ్యమంలో ఖర్చులు అధికవౌతాయి. అనేక రూపాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. వ్యాపారాదుల్లో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది. గౌరవ లోపం లేకుండా చూసుకోవాలి. దానధర్మాల వల్ల మేలు. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. వ్యాపారాదుల కోసం కాలం ధనం వెచ్చిస్తారు. వారాంతంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిర్ణయాదులు లాభిస్తాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. నూతన కార్యక్రమాల నిర్వహణపై దృష్టి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాల్లో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సామాజిక వ్యవహారాలను నేర్పుగా సాగిస్తారు. భాగస్వామితో సంతోషంగా ప్రయాణం చేస్తారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి. అనుకూలత కోసం ప్రయత్నించాలి. అనేక రూపాల్లో లాభాలున్నా తొందరపాటు కూడదు. సోదరవర్గంతో సమస్యలు లేకుండా చూసుకోవాలి. సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలకు అనుకూలం. వారం మధ్యమంలో అనుకోని సమస్యలు. అనారోగ్య భావన. చికాకుగా ఉంటుంది. నిర్ణయాల వాయిదా మంచిది. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతానవర్గ సమస్యలు. అన్ని పనుల్లోనూ ఆలస్యం ఉంటుంది. ఉన్నత వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వారాంతంలో ఉన్నత విద్యపై దృష్టి. సుదూర లక్ష్యాలను సాధిస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులకు అనుకూలం. అనేక రకాల సహకారం లభిస్తుంది. సమాచారం సంతోషాన్నిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదరవర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక వ్యవహారాలు, విద్యాత్మక ప్రయాణాలకు అనుకూలం. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త. కొత్త పరిచయాలు శ్రమకు గురి చేస్తాయి. స్నేహితుల కోసం కాలం ధనం శ్రమ కోల్పోయే అవకాశం. వారం మధ్యమంలో ఆహార విహారాది సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. గృహ వాహనాదులపై కొత్త భావనలుంటాయి. విందులు వినోదాలు ప్రభావితం చేస్తాయి. వాటి కోసం ప్రయాణాదులుంటాయి. మాతృవర్గ అనుకూలత. ఆలస్య నిర్ణయాదుల వల్ల సమస్యలు. వ్యాపారాదుల్లో కొంత అప్రమత్తంగా మెలగాలి. వారాంతంలో ఆలోచనలకు రూపకల్పన.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. సామాజికమైన గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు అధికం. అనేక కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించాల్సి వస్తుంది. ఆహార విహారాలపై ప్రత్యేక దృష్టి. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. మాటల్లో తొందరపాటు ఉంటుంది. ఆర్థిక నిల్వలు కోల్పోవచ్చు. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. వారం మధ్యమంలో అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి ఉంటుంది. లాభాలు ప్రభావితం చేస్తాయి. పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తారు. ఆలోచనలకు రూపకల్పన. అనుకోని ఇబ్బందులుంటాయి. అనారోగ్య లోపాలుంటాయి. కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు అధికం. ప్రయాణాలకు అవకాశం. విశ్రాంతి కోసం ప్రయత్నం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు అధికవౌతాయి. రుణాదులను గూర్చి చర్చిస్తారు. విజయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. వ్యవహార దక్షత. బాధ్యతలను సక్రమంగా శ్రమతో నిర్వహిస్తారు. గుర్తింపు లభిస్తుంది. మొండితనం పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. అనేక రకాల పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. వారం మధ్యమంలో పరిచయాలు పెరుగుతాయి. పాత మిత్రులు పలకరిస్తారు. భాగస్వామితో సంతోషంగా కలిసి ప్రయాణిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వ్యాపార వ్యవహారాలకు అనుకూల సమయం. సౌకర్య లోపాలుంటాయి. జాగ్రత్త. ప్రయాణాదుల్లో ఒత్తిడులు. అత్యున్నత విద్యలు, ఫారిన్ ప్రయాణాదులపై ప్రత్యేక దృష్టి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబ, బంధువుల బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆర్థిక నిల్వలు ప్రభావితం చేస్తాయి. మాట విలువ పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. అనుకోని ఇబ్బందులున్నా అధిగమిస్తారు. వ్యతిరేకతలపై విజయం. గుర్తింపు లభిస్తుంది. పోటీ రంగంలో జాగ్రత్త. శ్రమాధిక్యం. లాభాలు సంతోషాన్నిస్తాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి. వారం మధ్యమంలో సోదరవర్గ అనుకూలత. ఇతరుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ లాభిస్తాయి. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలకు అవకాశం. లక్ష్యాలను సాధిస్తారు. ఖర్చులు పెట్టుబడుల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. ఆలోచనలకు రూపకల్పన. వారాంతంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. శ్రమ ఉన్నా సంతోషంగా గడిపే ప్రయత్నం.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో లక్ష్యాలను సాధించే ప్రయత్నం. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. విద్యాత్మక అంశాల్లో శుభ పరిణామాలు. సుదూర ప్రయాణాల గూర్చి చర్చిస్తారు. ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల నిర్వహణ. దానధర్మాలు సంతృప్తినిస్తాయి. నిర్ణయాదుల్లో ఒత్తిడులు. అనుకోని సమస్యలుంటాయి. తొందరపాటు కూడదు. వ్యతిరేకతలపై విజయం. పోటీ రంగంలో గుర్తింపు. వారం మధ్యమంలో వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక కార్యక్రమాల్లో శుభ పరిణామాలు. సామాజిక బాధ్యతలు అధికం. గౌరవం పెంచుకుంటారు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారాదుల్లో పెట్టుబడులు అధికం. వారాంతంలో లాభాలు ప్రభావితం చేస్తాయి. ప్రయోజన దృష్టి. ఆలోచనలకు రూపకల్పన.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త పనులకు రూపకల్పన. స్పెక్యులేషన్ లాభిస్తుంది. విద్యాత్మక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. అన్నింటిలోనూ లాభాలుంటాయి. అసంతృప్తి ఉన్నా దూర ప్రయాణాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు లభించే అవకాశం. లక్ష్యాలను సాధించడంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మాట విలువ, నేర్పు పెరుగుతాయి. వారం మధ్యమంలో విజయంపై దృష్టి. వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీ రంగంలో గుర్తింపు. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారు. సేవక వర్గానుకూలత. వ్యాపార లోపాలుంటాయి. వారాంతంలో పరిచయాలు స్నేహానుబంధాలు పెరుగుతాయి.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాదులకు అనుకూలం. కొత్త పనులపై దృష్టి. గుర్తింపు. గౌరవాదులకు అవకాశం. భాగస్వామ్యాల్లో శుభ పరిణామాలు. పరిచయాలు విస్తరిస్తాయి. ఆలోచనల్లో ఒత్తిడులు. సంతానవర్గంతో కొంత జాగ్రత్త. ప్రణాళికల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులున్నా గౌరవం. వారం మధ్యమంలో కుటుంబ వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. స్థిరాస్తుల గూర్చి ఆలోచిస్తారు. నిల్వధనం పెంచుకుంటారు. మాటల్లో శుభ పరిణామాలు. లాభాలున్నా ఆశించినంతగా సంతోషం ఉండకపోవచ్చు. వ్యాపారాదుల్లో చాలా అనుకూలత. వారాంతంలో ఇతరుల సహకారం లభిస్తుంది. సోదరవర్గంతో అనుకూలత. సంప్రదింపులు బాగా విస్తరిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)
ఈ వారం ప్రారంభంలో అనుకోని సమస్యలుంటాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. కార్యనిర్వహణలో లోపాలకు అవకాశం. వ్యర్థమైన ఖర్చులుంటాయి. కాలం ధనం కోల్పోయే సూచనలు. పెట్టుబడుల్లో లోపాలు. విశ్రాంతి తగ్గిపోతుంది. ఆలోచనల్లో అనుకూలత. మానసిక బలం పెంచుకుంటారు. విద్యాత్మక వ్యవహారాలకు అనుకూలత. వారం మధ్యమంలో ఉన్నత వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుంటారు. దానధర్మాల వల్ల మేలు. వ్యతిరేకతలపై విజయం. పోటీలు, ఒత్తిడులను అధిగమిస్తారు. వ్యాపారాదుల్లో లాభాలు అధికం. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. వారాంతంలో పదోన్నతులకు అవకాశం. సామాజిక గౌరవం పెంచుకుంటారు.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో విద్యారంగంలోని వారికి అనుకూలత. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. గృహ వాహనాది సౌకర్యాలపై దృష్టి. శ్రమతో వ్యవహారాలను నిర్వహిస్తారు. సామాజిక గౌరవం పెంచుకునే ప్రయత్నం. ప్రయాణాదులకు అవకాశం. మాతృవర్గం వారి వ్యవహారాలు చర్చకు వస్తాయి. అనుకోని సమస్యలు, ప్రమాదావకాశాలుంటాయి. కార్యనిర్వహణలో అప్రమత్తత. బాధ్యతలు అధికవౌతాయి. గుర్తింపు. వారం మధ్యమంలో సంతానవర్గ సంతోషం. ఆలోచనలు ఫలిస్తాయి. ప్లానింగ్ ప్రకారం కార్యనిర్వహణ. లాభాలు సంతోషాన్నిస్తాయి. వ్యాపారాదుల్లో ఆలోచనలకు రూపకల్పన. కొత్త ప్రణాళికలుంటాయి. కుటుంబంలో కొంత వత్తిడి తప్పకపోవచ్చు. వ్యాపార భాగస్వామ్యాల్లో అనుకూలత. వారాంతంలో పోటీలు ఒత్తిడులు వ్యతిరేకతలు అధికవౌతాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. పెట్టుబడులు అనేక రూపాల్లో ఉంటాయి. ప్రయాణావకాశాలు. విశ్రాంతి కోసం ప్రయత్నం. కొన్ని పరామర్శలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుకూలం. సౌకర్య లోపాలకు అవకాశం. గృహ వాహనాదుల్లో కొంత జాగ్రత్త. ఆహార విహారాల్లో తొందరపాటు కూడదు. అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. ఉన్నత లక్ష్యాలపై దృష్టి. సంతృప్తి. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. బాధ్యతల నిర్వహణ సంతృప్తినిస్తుంది. అనేక కార్యక్రమాలపై దృష్టి. సామాజిక గౌరవం పెంచుకుంటారు. సమర్థత నిరూపించుకుంటారు. వృత్తిలో కొంత ఒత్తిడి. వ్యాపార వర్గంతో సంప్రదింపులుంటాయి. వారాంతంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744