S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (23-6-2019 నుంచి 29-6-2019 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఈ వారం ప్రారంభంలో లాభాలపై దృష్టి. ప్రయోజనాపేక్ష. పెద్దల ఆశీస్సులు. సోదరవర్గంతో అనుకూలత. ఆలోచనలకు రూపకల్పన. సంతానవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. వార్తలు కొన్ని అయోమయానికి గురి చేయవచ్చు. గౌరవ లోపాలకు అవకాశం ఉంది. వారం మధ్యమంలో ఖర్చులు పెట్టుబడులుంటాయి. సుదూర ప్రయాణాలకు అవకాశం. విందులు వినోదాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కాలాన్ని వెచ్చిస్తారు. కొంత అసంతృప్తి. ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. వ్యతిరేక ప్రభావాలుంటాయి. వ్యతిరేకతలు అధిగమించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వారాంతంలో నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. అనేక బాధ్యతలు తప్పకపోవచ్చు. వేరువేరు పనులు నిర్వహించాల్సి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఈ వారం ప్రారంభంలో భాగస్వామ్యాలు సంతోషాన్నిస్తాయి. కొత్త పరిచయాలు, పాత స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణించే అవకాశం. వ్యాపారాదుల్లోనూ అనుకూలత. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాల్లో అననుకూలత. విద్యా రంగంలోని వారికి అభివృద్ధి. వారం మధ్యలో ఇబ్బందులు అధికం. నిర్ణయాదుల వాయిదా మంచిది. అనారోగ్య భావనలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో అతి జాగ్రత్త అవసరం. కొన్ని ఊహించని సంఘటనలుంటాయి. ఆలోచనల్లో ఒత్తిడులు అధికం. ఆలస్య నిర్ణయాలుంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. అయినా జాగ్రత్త అవసరం. వారాంతంలో ఉన్నత కార్యక్రమాలపై దృష్టి. లక్ష్యాలను సాధించే ప్రయత్నం. కార్యనిర్వహణ దక్షత.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఈ వారం ప్రారంభంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలుంటాయి. సోదర వర్గంతో అనుకూలత. భాగస్వామితో కొంత జాగ్రత్తగా మెలగాలి. పరిచయాలు ఇబ్బంది పెట్టే సూచనలుంటాయి. ధార్మికమైన పెట్టుబడులుంటాయి. దానాదులు సంతోషాన్నిస్తాయి. వారం మధ్యమంలో సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. ఆహార విహారాలకు అనుకూలం. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. గృహ వాహనాదులపై దృష్టి. నిర్ణయాలలో ఆలస్యం ఉంటుంది. బద్దకం తగ్గించుకోవాలి. వ్యాపారాదుల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు కూడదు. జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో వృత్తిపరమైన ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాలపై దృష్టి. సామాజిక గౌరవం పెరుగుతుంది. తండ్రి, పితృవర్గం వారి వ్యవహారాలు చర్చకు వస్తాయి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నిల్వధనం తగ్గిపోయే సూచనలు. భాగస్వామ్యాల్లో అన్ని రకాలుగా శుభ పరిణామాలు. అనుబంధాలు విస్తరిస్తాయి. వారం మధ్యమంలో అన్ని పనుల్లో ప్రయోజన దృష్టి. సేవారంగంలో ఉంటే మేలు కలుగుతుంది. లాభాలు కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి. అనుకోని సమస్యలు. వ్యాపార పరమైన సంప్రదింపులకు అనుకూలం. ఇతరుల సహకారం లభిస్తుంది. ఆలోచనలకు రూపకల్పన. వారాంతంలో ఖర్చులు పెట్టుబడులు ప్రాధాన్యం వహిస్తాయి. ప్రయాణాదులకు అనుకూలం. విందులు వినోదాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఈ వారం ప్రారంభంలో పోటీలు, ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. అన్ని పనుల్లోనూ శ్రమ ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అధికమైన శ్రమ. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. బాధ్యతలు అధికం. పెద్దలతో సంప్రదింపులుంటాయి. మంచి వార్తలు వినే అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాలు. వారం మధ్యమంలో భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలుంటాయి. పాత అనుబంధాలను గుర్తు చేసుకునే అవకాశం. నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. సౌకర్య లోపాలుంటాయి. వ్యాపార లాభాలు సంతోషాన్నిస్తాయి. వారాంతంలో అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కొత్త నిర్ణయాలను వాయిదా వేసుకోవాలి. అన్ని కార్యాలు సమస్యాత్మకంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఈ వారం ప్రారంభంలో కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెంచుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు. బంధు వర్గంతో ఆనందంగా కాలం గడుపుతారు. వ్యతిరేక ప్రభావాలను అధిగమిస్తారు. అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారం మధ్యమంలో కొత్త వార్తలు వినిపిస్తాయి. సంప్రదింపుల్లో అనుకూలత. సహకార లాభాలుంటాయి. దగ్గరి ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ. కాలం ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. పరామర్శలకు అవకాశం. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో గృహ వాహనాదులకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి. విందులు వినోదాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి మంచి ఫలితాలు. సౌకర్యాలు సమకూర్చుకుంటారు.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఈ వారం ప్రారంభంలో కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. గుర్తింపు, గౌరవాదులు కూడా లభిస్తాయి. నిర్ణయాదుల్లో మాత్రం కొంత జాగ్రత్త. సుదూర ప్రయాణాలపై దృష్టి. ఆధ్యాత్మిక ప్రయాణాదుల వల్ల మేలు. దాన ధర్మాలు సంతృప్తినిస్తాయి. పోటీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేక ప్రభావాలున్నా విజయం సాధిస్తారు. వారం మధ్యమంలో పనిచేసే చోట గుర్తింపు ఉంటుంది. సామాజిక గౌరవం పెంచుకుంటారు. ఆహార విహారాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. అనేక రకాల బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు. భాగస్వామ్యాల్లో కొంత జాగ్రత్త అవసరం. మాటల్లో కొంత చమత్కార ధోరణి ఉంటుంది. నిల్వధనం పెంచుకుంటారు. వారాంతంలో లాభాలు సంతోషాన్నిస్తాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఈ వారం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికాబద్ధమైన జీవనం. సంతానంతో సంతోషం. కొత్త నిర్ణయాలకు అవకాశం. సృజనాత్మకత. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. దూర ప్రాంతాలకు ప్రయాణ భావన. కుటుంబంలో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుంటారు. వారం మధ్యమంలో పోటీలు అధికం. వ్యతిరేకతలు పెంచుకోవద్దు. చికాకులను శ్రమతో అధిగమించాలి. రుణాదులను గూర్చిన ఆలోచనలుంటాయి. శ్రమ తప్పకపోవచ్చు. విజయం సాధిస్తారు. గుర్తింపు కోసం ప్రయత్నం. సేవక వర్గంతో సంప్రదింపులు. వృత్తిలో అనుకూలత. వారాంతంలో పరిచయాలు కొత్తవి ఏర్పడవచ్చు. అనుబంధాలు పెంచుకుంటారు. పాత మిత్రులు జ్ఞప్తికి వచ్చే అవకాశం.

కుంభం (్ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఈ వారం ప్రారంభంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక రకాల బాధ్యతల నిర్వహణ. కార్యనిర్వహణ దక్షత. నూతన కార్యక్రమాలపై దృష్టి. కొత్త పనుల ప్రారంభం. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సంతాన విషయంలో జాగ్రత్త. వృత్తిపరమైన ఒత్తిడులు, శ్రమ అధికం. గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యమంలో కుటుంబ, బంధువర్గ బాధ్యతలు సంతోషాన్నిస్తాయి. ఆర్థిక నిల్వలపై ప్రత్యేక దృష్టి. లాభాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయోజనాలు కోల్పోవచ్చు. వ్యాపారాదుల్లో అనుకూలత. మాట విలువ పెరుగుతుంది. వారాంతంలో సంప్రదింపులుంటాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. సౌకర్యాలు సంతృప్తి నిస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఈ వారం ప్రారంభంలో అనుకోని ఇబ్బందులను ఎదుర్కోవాలి. మానసికమైన వత్తిడి అధికం. ఊహించని సంఘటనలుంటాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. కొత్త నిర్ణయాదులను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యర్థమైన ఖర్చులు ప్రయాణాదులకు అవకాశం ఉంది. పరామర్శలకు కూడా అవకాశం. ఆలోచనలు కొన్ని ఫలించవచ్చు. వారం మధ్యమంలో గొప్ప కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ఉద్యోగాదులు సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తాయి. వ్యతిరేకతలు ఇబ్బంది పెట్టే సూచనలు. పోటీ రంగంలో జాగ్రత్త. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలుంటాయి. వారాంతంలో అధికారిక కార్యక్రమాలు, పర్యటనలు తప్పకపోవచ్చు. అనేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. శ్రమ అధికం.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఈ వారం ప్రారంభంలో ఆహార విహారాలు ప్రభావితం చేస్తాయి. సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ప్రయాణావకాశాలు. విద్యారంగంలోని వారికి అనుకూలత. గృహ వాహనాదులపై ప్రత్యేక దృష్టి. వౌలిక వసతుల ఏర్పాటు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. అనుకోని సమస్యలు. వారం మధ్యమంలో సంతానవర్గ వ్యవహారాలపై దృష్టి. క్రియేటివిటీ పెంచుకుంటారు. నూతన కార్యక్రమాలపై దృష్టి. కొత్త ప్రణాళికలు. ఆలోచనలకు రూపకల్పన. కుటుంబంలో వత్తిడులుంటాయి. మాటల్లో కొంత జాగ్రత్తగా మెలగాలి. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. వారాంతంలో శత్రువులపై విజయం సాధించే ప్రయత్నం. పోటీలు అధికం. వ్యతిరేక ప్రభావాలు విస్తరించే అవకాశం. గుర్తింపు లభిస్తుంది. శ్రమ తప్పకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. అనేక విషయాల కోసం పెట్టుబడులుంటాయి. విందులు వినోదాలకు అవకాశం. సంతోషం కోసం వెచ్చిస్తారు. ప్రయాణాలకు అవకాశం. దాన ధర్మాలవల్ల మరింత మేలు కలుగుతుంది. సౌకర్యాలు శ్రమకు గురి చేయవచ్చు. ఉన్నత కార్యక్రమాల నిర్వహణ. కీర్తిప్రతిష్ఠలు పెంచుకునే అవకాశం. వారం మధ్యమంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. అనేక బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. కార్యనిర్వహణ దక్షత. కొత్త పనులపై దృష్టి. భాగస్వామ్యాల్లో అనుకూలత. వృత్తి ఉద్యోగ బాధ్యతలు ఇబ్బంది పెట్టే అవకాశం. వ్యాపారాదుల్లో శుభ పరిణామాలు. క్రియేటివిటీని పెంచుకునే ప్రయత్నం. వారాంతంలో కుటుంబ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక నిల్వలను పెంచుకునే దిశగా ప్రణాళికలుంటాయి.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744