S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డబ్బు- 5సెకండ్స్ రూల్

5 సెకండ్స్ రూల్ అనే అంశంపై ఒ మంచి పుస్తకం వచ్చింది. మనకు ఏ ఆలోచన వచ్చినా దానిపై మనం ఐదు క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే దాన్ని వాయిదా వేస్తాం. మరో ఆలోచన వస్తుంది. ఉదాహరణకు ఉదయానే్న లేచి వ్యాయామం చేయాలి, వాకింగ్ చేయాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని రాత్రి నిద్ర పోతాం. తెల్లవారు జామునే మెలుకువ వస్తుంది కూడా వ్యాయామం చేయాలనే నిర్ణయం గుర్తుకు వస్తుంది కూడా! వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు బాగా తెలుసు కూడా! రాత్రి పడుకునే ముందు ఉదయమే లేవాలనే నిర్ణయం గట్టిగా తీసుకున్నాం అనే విషయమూ గుర్తుంటుంది.
కానీ ఏం జరుగుతుంది. తెల్లవారు జామునే లేవం. ఇంకో పది నిమిషాల తరువాత లేద్దాం. ఇప్పుడు వ్యాయామం చేసినా పది నిమిషాల తరువాత చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు. రేపటి నుంచి చేద్దాం. ఈ రోజు పడుకుందాం. ఈ రోజు మనసు బాగా లేదు రేపటి నుంచి మొదలు పెడదాం. బాగా అలసిపోయినట్టుగా ఉంది. రేపటి నుంచి తప్పకుండా తెల్లవారు జామునే లేచి వ్యాయామం, వాకింగ్ మొదలు పెడదాం అనుకుని హాయిగా నిద్ర పోతాం.
ఇది దాదాపు అందరికీ అనుభవమే. నిజానికి ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. వచ్చినా అప్పటికే పరిస్థితి మీ చేయి దాటి పోయి ఉంటుంది. ఉదయమే లేచి నడకను తప్పించుకోవడానికి మన మనసు మనకు అనేక వంకలను చెబుతుంది.
దీనిపై వచ్చిన పుస్తకమే 5సెకండ్స్ రూల్ బుక్. ఉదయం లేచి వ్యాయామం చేద్దాం అనే ఆలోచన ఐదు సెకండ్ల పాటు ఉంటుంది. ఆ ఐదు సెకండ్లలోనే మీరు నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేస్తారు. లేదంటే వాయిదా ఎప్పటికీ కార్యరూపం దాల్చదు. ఐదు సెకండ్లలో మరో ఆలోచన వస్తుంది. వాకింగ్ ఎప్పుడైనా చేయవచ్చులే ఇప్పుడు హాయిగా దుప్పటి కప్పుకుని పడుకుందాం అనిపిస్తుంది.
ఆలోచన వచ్చిన ఐదు సెకండ్లలో అమలు చేస్తేనే వాకింగ్ చేయగలరు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ మార్నింగ్ వాకింగ్ చేయలేం అని తొలి ఐదు సెకండ్లలోనే మీ మనసుకు గట్టిగా చెప్పుకుని మీ నుంచి మీరే ప్రేరణ పొందితే నిర్ణయాన్ని అమలు చేయగలరు.
ఇది ఒక్క మార్నింగ్ వాకింగ్‌కు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అన్ని ఆలోచన మీద ఇలానే ఉంటుంది. మంచి అనుకున్నది తక్షణమే చేసేయాలి.
5సెకండ్స్ రూల్ బుక్‌కు డబ్బుకు సంబంధం ఏమిటీ? అనిపించవచ్చు. నిజమే ఐదు క్షణాలకు సంబంధించిన అంశం ఒక్క మార్నింగ్ వాకింగ్‌కే కాదు అన్నింటికీ వర్తిస్తుంది. వాయిదాలు వేసే దురలవాటును దూరం చేస్తుంది. పొదుపు చేయాలి ఆనే ఆలోచన వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ నెల నుంచే దీన్ని అమలు చేయాలి అని ఆలోచన వచ్చిన ఐదు సెకండ్లలోనే నిర్ణయం తీసుకోండి. దాన్ని వాయిదా వేస్తే మరో ఐదు సెకండ్లకు మరో ఆలోచన వస్తుంది. ఈ నెల ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, వచ్చే నెల నుంచి పొదుపు చేద్దాం అనే ఆలోచనతో మీరెప్పటికీ పొదుపు మార్గం పట్టలేరు.
విజేతల జీవితాలను పరిశీలిస్తే వారిలో ఒక లక్షణం కామన్‌గా కనిపిస్తుంది. వారిలో నాన్చుడు ధోరణి ఉండదు. త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్ణయంలో మంచి చెడులో అన్ని కోణాల్లో ఆలోచించాలి తప్పు లేదు. ఐతే ఆ నిర్ణయం వల్ల ప్రయోజనం ఉందని భావిస్తే తక్షణమే అమలు చేయాలి. చాలా మంది ఆలోచనలు, వాయిదాల్లోనే కాలం గడిపేస్తారు. కేవలం ఆలోచనలు మాత్రమే విజయాన్ని చేకూర్చవు. ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడే విజయం సాధ్యం అవుతుంది.
విజేతల్లో నాన్చుడు ధోరణి ఉండదు. వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఇదే వారి విజయరహస్యం. నిర్ణయాల వల్ల ఒకొక్కప్పుడు అపజయం తప్పక పోవచ్చు. ఐతే అసలు పనే మొదలు పెట్టని వారి కన్నా పని మొదలు పెట్టి అపజయం సాధించిన వారికి కనీసం అనుభవం అన్నా లభిస్తుంది. మరోసారి ప్రయత్నించినప్పుడు మొదటిసారి చేసిన లోపాలకు అవకాశం ఉండదు. కేవలం ఆలోచనల్లోనే కాలం గడపకుండా ఆచరణలో పెట్టిన వారే విజయం సాధిస్తారు.
5సెకండ్స్ రూల్ నియమాన్ని జీవితంలో అన్నింటికీ అన్వయించుకోవచ్చు. పర్సనల్ ఫైనాన్స్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది. పొదుపు చేయడం వెంటనే ప్రారంభించాలి. పొదుపును ఇనె్వస్ట్ చేయాలి. ఆర్థిక క్రమ శిక్షణకు 5 సెకండ్స్ రూల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
పొదుపు ఇనె్వస్ట్‌గా మారినప్పుడు రేపటి జీవితం ఎలా ఉంటుంది? రేపటి అవసరాలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఊహించుకుంటే మీ నిర్ణయం ధృడంగా అమలు చేసేందుకు మీ ఆలోచనలు మీకు తోడ్పడతాయి.
ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఐదు సెకండ్ల పాటు ఉంటుంది. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మరో ఆలోచన వస్తుంది నిర్ణయాలు మారిపోతాయి. అంటే దీని అర్థం 40 శాతం తక్కువ ధరతో బంగారం ఇస్తాం అనే ప్రచారం చూడగానే గుడ్డిగా నమ్మి ఆన్ లైన్‌లో డబ్బులు చెల్లించడం వెంటనే చేయాలని కాదు. బంగారం ఎవరూ 40 శాతం తక్కువ ధరకు ఇవ్వరు. మీరు డిపాజిట్ చేసిన డబ్బు ఎక్కడా ఆరునెలల్లో రెట్టింపు కాదు. ఇవన్నీ బోగస్ ప్రచారాలు. ఇలాంటి వాటి విషయంలో చాలా మంది తక్షణం నిర్ణయం తీసుకని బోల్తా పడుతుంటారు. అది వాస్తవమా? కాదా? అనే ఆలోచన రావాలి. వాస్తవంగా సాధ్యం అనే నిర్ణయానికి వచ్చిన తరువాతనే ఐదు సెకండ్ల రూల్ ప్రకారం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. సగం ధరకు బంగారం అమ్మడం బోగస్. కానీ నేటి పొదుపే రేపటి జీవితానికి అండ అనేది వాస్తవం.

-బి.మురళి