S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కాయగూరలు - 2

ఆహార ఫదార్థాలుగా వండుకుని తినదగిన ఆకు కూరలు, పూల కూరల గురించి అనేక విశేషాలు చర్చించాం. ఆకు కూరలు, పూల కూరలు, దుంప కూరలు, కాయగూరల్లో ఏవి ఎక్కువ బలవర్థకమైనవి, శక్తిదాయకమైనవి చాలా మంది ఉత్తరాల ద్వారానూ, ఫోన్ల ద్వారానూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు శాస్త్ర ప్రమాణం ఏమీ లేదు. పెద్దల అనుభవమే ప్రమాణం... కాయగూరలే ఎక్కువ శక్తివంతమైనవని!
కాయగూరల్ని ఇగురు కూరలుగానూ, వేపుడు కూరలుగానూ వండుతుంటారు.
కాయగూరలు, ఆకు కూరలు, పూల కూరలు ఇవన్నీ చాలా కోమలమైన ద్రవ్యాలు. మాంసం లాగా కఠిన ద్రవ్యాలు కావు. వాటిని సౌమ్యంగానే వండటం అవసరం.
నెయ్యి ఉన్న గినె్నకు కొద్దిపాటి సెగ తగిలితే చాలు నెయ్యి కరిగిపోతుంది. దాన్ని గాడిపొయ్యి మీద పెట్టి కాస్తే ఆ నెయ్యి మాడిపోతుంది. మాడిన నెయ్యి విష పదార్థమే! కోమలమైన కూరగాయలు కూడా అంతే. వాటిని అధిక పీడనం ఉండే ప్రెషర్ కుక్కర్ లాంటి పరికరాలలో అధిక ఉష్ణోగ్రత దగ్గర వండితే అవి కూడా విష పదార్థాలుగా మారిపోతాయి.
ఏ ఆహార పదార్థమైనా నూనెలో వేయించినందు వలన దాని గుణాలు సగానికి సగం కోల్పోయి, విష దోషాలు సగానికి సగం పెరుగుతాయని ఆయుర్వేద గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
కాయగూరలన్నీ చలవ చేసేవే! వాటికి అదనంగా పులుసులు, మసాలాలు, శనగపిండి లాంటివి చేర్చి వండటం వలన అవి వేడి చేసేవిగా మారిపోతున్నాయి. కాయగూరల్ని పులుసు, వేపుడు కూర, లేదా మసాలా కూరగా కాకుండా కేవలం తాలింపు కూరగా వండుకోగలిగితే ఆ కూర తిన్న ప్రయోజనాలు కలుగుతాయి. ఇగురు కూరలా ఇలా వండితేనే చలవ చేస్తాయి.
అపురూపమైన కొన్ని కూరగాయల్లోని శక్తివంతమైన ఔషధ గుణాలను కొంత విశే్లషిద్దాం.
అరటి: లేత కాయల కూర, పెరుగు పచ్చడి
బాగా లేతగా ఉన్న కూర అరటి కాయలు జీర్ణకోశ వ్యాధుల్లో ఔషధంగా పని చేస్తాయి. అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్, పేగుపూత, ఎసిడిటీ, మూత్ర వ్యాధులు, ముఖ్యంగా అతిమూత్ర వ్యాధి, బీపీ వ్యాధి తగ్గుతాయి.
కేరళ వారిని ఆదర్శంగా తీసుకుని అరటిని సద్వినియోగం చేసుకోవాలి.
మనకు బంగాళాదుంపల మీద ఉన్న మోజు అరటికాయల మీద లేదు. కాయగూరల్లో అరటి మేలైన ఆహార ద్రవ్యం. వృద్ధాప్యం కారణాల వలన మలద్వారం జారటం, రక్తస్రావం అవుతున్న మొలల లాంటి వ్యాధులతోనూ, ఋతు సమస్యలతోనూ బాధపడుతున్న వారు తప్పనిసరిగా అరటికాయల కూరని వీలైతే రోజూ తినటం మంచిది. బొంత అరటి అంటే లోపల గింజ పెద్దదిగా ఉండే అరటి రకం. ఇవి కూడా చలవచేసేవే!
‘కూర అరటి’ కాయల కూర, పెరుగు పచ్చడి, పచ్చడి వీటిని స్థూలకాయం, షుగరు వ్యాధి ఉన్నవారు కూడా తినదగినవే! ముదిరిన కూర అరటి కాయలు వాత వ్యాధుల్ని పెంచుతాయి. అందుకని కొనేటప్పుడే లేతగా ఉన్నవి చూసి కొనండి. ఫ్రిజుల్లో అరటికాయల్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి. ఫ్రిజ్జులో కూడా అవి ముదురుతాయి. కూర అరటికాయలు చవకగా దొరుకుతున్నప్పుడు తోలు తీసి, ఉప్పు నీళ్లలో సన్నగా చిప్స్ తరిగి, ఎండించి ఒరుగులు చేసుకుంటారు. ఎండిన చిప్స్‌ని మిక్సీ పట్టిన పొడిలో ఉప్పు కారం వగైరా కలిపి కారప్పొడి తయారుచేసుకుని తింటారు.
అవిసె కాయల కూర
గోరుచిక్కుళ్ల మాదిరే చిరుచేదుగా ఉండే అవిసె కాయలు అన్ని వ్యాధుల్లోనూ తినదగిన గొప్ప ఆహార ద్రవ్యం. కేన్సర్ వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఆలస్యంగా అరుగుతుంది. అందుకని వండేప్పుడు అనవసరంగా మసాలాలు, చింతపండు, వగైరా ఎక్కువగా కలిపితే మరింత అజీర్తికరంగా ఉంటాయి. వాత వ్యాధులన్నింటిలోనూ పైత్య వ్యాధుల్లోనూ ఉబ్బసం లాంటి అలర్జీ వ్యాధుల్లోనూ బాగా ఉపయోగపడతాయి. ఉడికించి, నీటిని వార్చేసి, కూరగా వండుకోవచ్చు.
ఆముదం కాయల కూర
ఆముదం అనగానే ముఖం అదోలా పెట్టకండి. వాత వ్యాధులు ఎంతకీ లొంగక ఇబ్బంది పడ్తున్న వారు వారంలో మూడు నాలుగు సార్లయినా ఆముదం కాయలతో కూర వండుకుని తింటే వ్యాధిలో చాలా మార్పు కనిపిస్తుంది. కమ్మగా వండుకోవటం ఎలాగో మీ యుక్తిననుసరించి ప్రయత్నించండి.
గడ్డలు, వాపులు కరుగుతాయి. వాతం అదుపులో ఉంటుంది. వీర్యకణాలు పెరుగుతాయి. పురుషులలో లైంగిక శక్తి పెరుగుతుంది. బలకరం, శుభకరం కూడా! పొట్టని శుభ్రపరచి విరేచనం అయ్యేలా చేస్తుంది. ఏ జబ్బూ లేనివారు తినదగిన పదార్థాలే ఇవన్నీ! చెట్టులేని చోట ఆముదం వృక్షం అంటారు. కూరగాయల మార్కెట్టు లేని రోజున ఆముదం కాయలు దొరికితే ఆహార పదార్థంగా ఓ ప్రయత్నం చేయండి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com