నీ రాకకై నిరీక్షణ
Published Saturday, 7 September 2019చిగురాకులలో చిలకమ్మవని.. మరుమల్లెలలో మకరందమని..
నువ్వు వస్తావని మనసిస్తావని కలలు కలలుగా
నేగని.. కథలు కథలుగా నే విని..
నిదురపోకుంటిని నీ రాకకై నే వేచి ఉంటిని..
నే కాటుకనై నీ కళ్లనంటుకుని
నే పమిటనై నీ నడుము నంటుకుని
కెంజాయలో విరిసే సంపెంగలో
విరిమల్లెలో విరజాజిలో పువ్వై నవ్వై
నిదురపోకుంటిని.. నీ రాకకై
నే వేచి ఉంటిని
పుచ్చపువ్వులా విచ్చినా వెనె్నల
నా ఊహకు నిచ్చెనయై.. నా కన్నుల
ఆ విరులను కురులను తురిమి
ఆ విరులను ఎదను అదిమి
నడిచొచ్చే సిరివెనె్నల నను మెచ్చే విరి కన్నియ
చిటికెనేలు తాకిరావ ఏడడుగులు నడిచిరావ