S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సమీపార్థాలు

ఒకొక్కప్పుడు సమీపార్థాలు ఉన్న రెండేసి మాటలని ఒకేసారి తెలిగిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకి: ‘ఇన్పుట్, ఔట్పుట్’ (input, output) ‘ప్రోఫిట్, లాస్’ (profit, loss), ‘పబ్లిక్, ప్రైవేట్’ (public, private), ‘ఎరైవల్, డిపార్చర్’ (arrival, departure) ఇనె్వన్షన్, డిస్కవరీ(invention, discovery),), ఇనె్ఫక్షన్, కంటేజియన్ (infection, contagion) ‘సోలో, గ్రూఫ్’ (solo, group),), ఛానల్, కెనాల్ (channel, canal) ఎబార్షన్, మిస్ కేరేజ్ (abortion, miscarriage మొధలైనవి.
ఇంగ్లీషు వాళ్లు మన దేశం రాక పూర్వం కూడా మనం వ్యాపారం చేసేవాళ్లం. కనుక లాభం (ప్రోఫిట్, profit), నష్టం (loss) పెట్టుబడి (ఇనె్వస్ట్‌మెంట్), దిగుబడి (yield)), ఆదాయం (ఇన్‌కం) ఖర్చు (ఎక్స్‌పెండిచర్), వగైరా మాటలు మనకి ఉన్నాయి. అవి వాడుకోవచ్చు.
విమానాశ్రయంలో దిగగానే రాకడ (arrival), పోకడ (డిపార్చర్), అన్న మాటల అవసరం కనిపిస్తుంది. రాకపోకలు అనేవి బాగా వాడుకలో ఉన్న మాటలే కనుక ‘ఆగమనాలు’, ‘నిష్క్రమణలు’ అనటానికి బదులు రాకడలు (రాకలు), పోకడలు (పోకలు) అని పేర్లు పెట్టుకోవచ్చు.
ఛానల్, కెనాల్.. ఛానల్ అంటే చాలా అర్థాలు ఉన్నాయి కానీ, ఇక్కడ ఈ ప్రశ్న అడిగిన సందర్భంలో ఛానల్ అంటే సహజమైన జలమార్గం. కెనాల్ అంటే తవ్వబడ్డ జలమార్గం. పంట కాలువ (irrigation canal), మురుగు కాలువ drainage canal), మొధలైనవి. కాలువలో జలమే ప్రవహించనక్కరలేదు. చెవి కాలువ(ear canal) గుండా శబ్ద తరంగాలు పైనుండి లోపలికి ప్రవహిస్తాయి. లోపల నుండి లాడి బయటకి ప్రవహిస్తుంది. కానీ ఈ కాలువ సహజమైనది; తవ్వబడ్డది కాదు. కనుక తర్కబద్ధంగా ఉండాలంటే దీనిని ఇంగ్లీషులో ‘ఇయర్ ఛానల్’ అనాలి. ఇంగ్లీషులో కూడా అంత తర్కబద్ధంగా ఉండదు.
ఈ రెండు మాటల అర్థాలలోను ఉన్న పోలికని గుర్తించకుండా అజాగ్రత్తగా వాడడం వల్ల జరిగిన కథ ఒకటి చెబుతాను. పూర్వం, ఇటలీలో షియాపరెల్లీ అనే ఖగోళ శాస్తవ్రేత్త దుర్భిణిలో అంగారక గ్రహం వైపు చూసినప్పుడు ఆయనకి ఏవేవో గజిబిజిగా గీతలు కనపడ్డాయి. వాటికి ఆయన ‘కెనాలీ’ అని ఇటలీ భాషలో పేరు పెట్టేడు. ఈ మాట ఆయన ఆచితూచి వాడేడో, అజాగ్రత్తగా వాడేడో మనకి తెలియదు. కానీ షియాపరెల్లీ రాసిన వృత్తాంతం చదివి అమెరికాలో పెర్సివల్ లోల్ అనే మరొక ఖగోళ శాస్తవ్రేత్త ఆ ‘కెనాలీ’ని ‘కెనాల్’ అని ఇంగ్లీషులోకి అనువాదం చేసి ఊరుకున్నాడా? లేదు. కెనాల్ అంటే కాలువ కనుకనున్నూ, కాలువ అంటే తవ్వబడ్డ జలమార్గం కనుకనున్ను అంగారక గ్రహం అంతటా పంట కాలువలు ఉన్నాయనిన్నీ, అంగారక గ్రహం యొక్క ధ్రువ మండలాల్లో ఉన్న మంచుని కరిగించి, ఆ నీటిని ఈ కాలువల గుండా ప్రవహింపజేసి, పంటలు పండిస్తున్నారనిన్నీ ఊహాగానాలు చేసేడు. ఈ ఊహాగానాలు విని హాలీవుడ్ నిర్మాతలు ఊరుకున్నారా? లేదు. అంగారక గ్రహ వాసులు భూమి మీదకి దండెత్తి వచ్చేరంటూ సినిమా తీసేరు. ఆ సినిమా అంత నిజమే అని నమ్మేసి, అమెరికా ప్రజలు వీధులలోకి ఎగబడి పెద్దగా గాభరా పడ్డారు!
ఇన్‌పుట్, అవుట్‌పుట్.. కంప్యూటర్ రంగంలో వాడకానికి ఈ రెండు మాటలతో ఇబ్బంది వస్తోంది. ఈ రెండు మాటలకి సమానార్థకాలైన మంచి తెలుగు మాటల కోసం నేను ఇంకా తంటాలు పడుతున్నాను. నేను నిర్మించిన నిఘంటువులో ‘ఇన్‌పుట్’ కి ప్రవేశాంశం, ప్రవేశికం, ఆగతం, అంతర్యానం, అంతర్యాగం, అంతర్హితం, లొరవానా (లోపలికి రవానా) మేత, దాపలం అనే మాటలు అభ్యర్థులుగా ఉన్నాయి. అదే విధంగా ‘ఔట్‌పుట్’కి నిర్గమాంశం, నిర్గతం, బహిర్యానం, బహిర్యాగం, ఫలోత్పత్తి, నిర్గళితం, నిర్గాతం, బహిర్హితం, బరవానా, పోత, వెలపలం అనే అభ్యర్థులు ఉన్నాయి. వీటిలో ఏవి అందరికీ ఆమోదయోగ్యం అవుతాయో నాకు తెలియదు. నాలుగైదు సందర్భాలలో ప్రయోగించి ఏది ఎక్కడ నప్పుతుందో చూడాలి.-

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా