S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అంచనా (సండేగీత )

మనల్ని ఎవరో అంచనా వేయడానికి అవకాశం ఇవ్వకూడదు. మనల్ని మనం అంచనా వేసుకుని అడుగు ముందుకు వేస్తూ ఉండాలి. మన విజయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ అంచనా విషయంలో మనకు నిజాయితీ ఉండాలి. నిబద్ధత ఉండాలి.
మనల్ని మనం ఏ విధంగా అంచనా వేసుకుంటాం?
మనల్ని మనం ఏ రకంగా క్రమశిక్షణని అలవర్చుకుంటాం?
దీనికి గడిచిన సమయం మొత్తం అవసరం లేదు.
ఒక్క 24 గంటలు చాలు..
గడిచిన 24 గంటల్లో మనం అనుకున్న పనులు ఎన్ని చేశాం? ఎందుకు చేయలేకపోయాం?
దీని గురించి అంచనా వేయాలి.
ఇది కష్ట సాధ్యం కాదు.
సులభమే..
ఈ అంచనాకి మనలో నిజాయితీ ఉండాలి..
నిబద్ధత ఉండాలి..
అంతే కానీ అపజయాలను చూసి మన పట్ల మనం కించపరచుకోకూడదు.. దురుసుగా కూడా ఉండకూడదు..
మన విజయాలకి కారణమైన విషయాలని.. అలాగే అపజయాలకి కారణమైన అంశాలని గమనించాలి. రాబోయే 24 గంటలని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచించాలి.. ఆ దిశగా అడుగులు వేయాలి..

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001