S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అజ్ఞాత చరిత్ర పుటలు

ఆనాటి వీరోచిత కృత్యాల నిజానిజాలను ఎంతో వ్యయప్రయాసలకోర్చి శ్రీ ఖండేరావు కులకర్ణి ఆ విమోచనద్యోమంలోని వెలుగు చూడని వివరాలను వెలికితీసి హిందీ పుస్తక రూపంలో ‘హైదరాబాద్ ముక్తి సంగ్రామం - కొన్ని అజ్ఞాత పుటలు’ పేరుతో తీసుకువచ్చారు. ఈ పుస్తకాన్ని సరళానువాదం చేసి ‘హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర పుటలు’ పేరుతో తెలుగులోకి తీసుకువచ్చారు నిఖిలేశ్వర్. ఇందులో ఇరవైకి పైగా చారిత్రాత్మక గాథలున్నాయి. నిరంకుశుడైన నిజాం, అతని రజాకారు శక్తులతో ప్రజలు ఒక్కో రంగంలో.. ఒక్కో సమయంలో.. జరిపిన పోరాటం.. ఒక్కో గాథగా ఇందులో వర్ణించారు. అధర్మాన్ని, విధర్మీయ దౌష్ట్యాన్ని సహించలేని ఆత్మచైతన్యం ఒక జ్వాల. అలాంటి జ్వాలలను నలుదిశలా ప్రజ్వలింపచేసి లోకానికి వెలుగులు చూపించారు కొందరు. అలాంటి వీరోచిత గాథల్లో కొన్ని మీకోసం..
ఉమ్రీ బ్యాంక్ దోపిడీ
1947 తర్వాత ఉక్కుమనిషి సర్దార్ పటేల్ భారతదేశంలోని చిన్న పెద్ద సంస్థాలనాలన్నింటిని కేంద్రంలో విలీనం చేశారు. కానీ నిజాం పెత్తనం కింద వున్న హైదరాబాద్ మాత్రం మొండిగా స్వతంత్ర ప్రతిపత్తిని కోరింది. అందువల్ల శస్తచ్రికిత్స అవసరంమైంది. ఆ శస్త్ర చికిత్సయే పోలీస్ చర్యగా పరిణమించింది. అంతకుపూర్వమే అనేకమంది విప్లవవీరులు మాజీ సంస్థాన నిరంకుశ పాలనకు అనేక కత్తిపోట్లు పొడిచారు. అనేకమంది యువకవీరులు ప్రాణాలు అర్పించారు. ఆ సంఘటనలలో ఒకటి ఈ ఉమ్రీ బ్యాంక్ దోపిడీ.
ముదఖేడ్‌కర్ బలిదానం
1946 డిసెంబర్ 16 నాటి సాయంత్రం ఉమ్రీ స్టేట్ బ్యాంక్ (హైదరాబాద్) ఆవరణలో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులకు దత్తాత్రేయ ముదఖేడ్‌కర్ భూమిపైకి వొరిగాడు. అతని అన్న దిగంబర్‌రావు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల చప్పుడు తరువాత స్తబ్దత వ్యాపించింది. బ్యాంక్ వాచ్‌మెన్ అరబ్బీవాడు జరిపిన కాల్పులకి ముదఖేడ్‌కర్ సోదరులలో ఒకడు నేలకొరిగాడు. మాజీ హైదరాబాద్ సంస్థానంలోని ఉమ్రీ పట్టణం పత్తి వ్యాపారానికి ముఖ్య కేంద్రం. ఆ రోజుల్లో పత్తితో నిండి బండ్లు ఉమ్రీ మార్కెట్‌కు వందల సంఖ్యలో వస్తున్నాయి. అది పత్తిపంట కోసిన కాలం. కాల్పులకు దారితీసిన అసలు విషయం చాలా మామూలైనది. ఉమ్రీ పట్టణంలో మతకలహాలు రెచ్చగొట్టేవారున్నారు ఆ రోజుల్లో. ఒక్క ముస్లిం ఒక దుకాణానికి వెళ్లి అగ్గిపెట్టె కొన్నాడు. ఆరు పైసల హాలీకి బదులు ఏడు పైసల హాలీకి ఆ దుకాణదారుడు అగ్గిపెట్టెను అమ్మాడు. ఒక్క పైసాపై గొడవ బయలుదేరింది. హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజుల్లో ముస్లింలందరూ తమను తామే పాలకులుగా, హిందువులను పాలితులుగా భావించేవారు. అందువల్ల ప్రతి చిన్న విషయంపై ముస్లింలు హంగామా చేసేవారు. ఈ వాతావరణంలో ఆ చిన్న సంఘటన పెద్ద తగాదాగా మారింది. అక్కడే వున్న ముదఖేడ్‌కర్ సోదరులు కలుగజేసుకున్నారు. దిగంబరరావు స్థానిక ఆర్య సమాజ శాఖకు కార్యదర్శి. ఆ రోజుల్లో హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఆర్య సమాజ్ అన్ని విధాలా ప్రయత్నాలు జరిపేది. అందువల్ల కార్యదర్శి దిగంబరరావు ఆయన తమ్ముడు దత్తాత్రేయ అక్కడ ముస్లింలకు శత్రువులుగా మారారు. ఆనాటి సందర్భాన్ని పురస్కరించుకొని దగ్గరలోనే వన్న స్టేట్ బ్యాంక్ ఆవరణలో చెట్ల వెనకాలనుండి అరబ్బీ వాచ్‌మెన్ కాల్పులు జరిపాడు. ఫలితంగా దత్తాత్రే చనిపోయాడు. దిగంబరరావు తీవ్రంగా గాయపడ్డాడు. ముదఖేడ్‌కర్ కుటుంబంలో శోకజ్వాలలు వ్యాపించాయి. దేవీదాస్‌రావ్, ముదఖేడ్‌కర్ ఇద్దరు కుమారులలో చిన్నవాడైన దత్తాత్రేయ మరణించాడు. అతను ఎనిమిది నెలల క్రితమే వివాహమాడిన అమ్మాయి విధవైంది. గాయపడిన పెద్దవాడు దక్కుతాడో లేడో? ఒకవేళ దక్కినా నిజాం పోలీసులు అతన్ని వదులుతారా? సంస్థానంలో ఎక్కడచూసినా రజాకార్ల అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. దిగంబరరావు కోలుకుని ఇంటికి రాగానే నిజాం పోలీసులు అల్లరి, హత్యాప్రయత్నం అనే నేరాలు మోపి అరెస్టు చేశారు. నిజాం పరిపాలనలో విచిత్రమైన న్యాయం కొనసాగేది. హత్య చేయబడినది తమ్ముడు. చేసినది అరబ్బీ వాచ్‌మెన్. హత్యాప్రయత్నం నేరాన్ని గాయపడిన అన్నపై మోపారు. హత్యచేసిన అరబ్బీవాడు నిర్దోషిగా మిగిలాడు.
ప్రతీకారం
ఈ సంఘటనతో ఉమ్రీ యువకుల్లో గొప్ప సంచలనం చెలరేగింది. ప్రతీకార వాంఛతో యువకులు ఆలోచించడం మొదలుపెట్టారు. దేశం స్వతంత్రమైనా నిజాం మాత్రం తాను తన సంస్థానాన్ని స్వతంత్రంగా నిలుపుకోవాలని రజాకార్లను పెంచాడు. అన్నిచోట్లా ముస్లింలు మత కల్లోలాల్ని సృష్టిస్తున్నారు. హిందువులు విపరీతమైన అన్యాయాలకు గురిఅవుతున్నారు. ఆ సమయంలో హిందువులు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఉమ్రీ నుండి బరార్‌నుండి ఉమర్‌ఖేడ్ అనే ప్రాంతానికి అనేక హిందూ కుటుంబాలు శరణార్థులుగా వెళ్లిపోయేవి. అందులో ముదఖేడ్‌కర్ కుటుంబం కూడా ఒకటి. దిగంబరరావు పూచీకత్తుపై విడుదలై బయటికి వచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని అతను ఉమర్‌ఖేడ్‌కు పారిపోయేడు. అక్కడ స్టేట్ కాంగ్రెస్ హిందూ శరణార్థుల సహాయార్థం ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలలో సహాయ కార్యకలాపాలతోపాటు హిందూ యువకులకు ఆయుధాల ఉపయోగంలో శిక్షణ ఇచ్చేవారు. బెరార్ సరిహద్దును తాకిన ఉమ్రీనుండి రజాకార్లు దాడిచేస్తుండేవారు. ఆ దాడులను ఎదుర్కొనడానికి ఆ హిందూ యువకులు సంసిద్ధంగా ఉండేవారు. అందులో ఉమ్రీ నుండి వచ్చిన యువకులు అవకాశాన్ని చూసి దత్తాత్రేయ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పథకాలు వేశారు. అందరికీ ఒక పథకం నచ్చింది. ఉమ్రీ స్టేట్ బ్యాంక్‌పై దాడిచేసి లూటీ చేసిన డబ్బుతో స్టేట్ కాంగ్రెస్‌కు సహాయపడాలని, కానీ ఆ దాడికి కావలసిన ఆయుధాల సేకరణ సమస్యగా మారింది.
ఉమ్రీ భామాషా
అంతకుపూర్వమే ఉమ్రీ ప్రాంతపు యువకులు స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగ్‌పూర్, జబల్‌పూర్‌లలో హోమ్‌గార్డ్స్ దళాలలో శిక్షణ పొంది వచ్చారు. ఆయుధాలతో దాడిచేయడం వగైరా అంశాలలో తర్ఫీదు పొంది సిద్ధంగా ఉన్నారు. ఉమ్రీ బ్యాంక్‌పై దాడిచేయాలంటే మాటలతో అయ్యేపనికాదు. దాదాపు 30 మైళ్ళవరకూ ఆయుధాలను తీసుకొనిపోవడం, అందులో రజాకార్లతో నిండిన నిజాం సంస్థానంలోకి చొరబడడం కష్టసాధ్యం. అయినా ఆధునిక ఆయుధాలు కావాలి. ఆ సందర్భంగాలో ధన్‌జీ అనే వ్యక్తి వచ్చి తన ఆస్థినంతా అమ్మి 40వేల రూపాయల విరాళంగా ఇచ్చాడు. ధన్‌జీ ఆ కష్టసమయంలో అంత డబ్బు విరాళంగా ఇవ్వడం అపురూపం. మొఘల్ రాజులను ఎదుర్కోవడానికి రాణాప్రతాప్‌కు సర్వస్వం దానం చేసిన రాజస్థాన్ భామాషా అనే సంపన్నుడు ఈ సందర్భంలో అందరికీ జ్ఞాపకం వచ్చాడు. అందుకే ధన్‌జీని ఉమ్రీ భామాషా అని పిలిచేవారు. విరాళంగా వచ్చిన డబ్బుతో కావలసిన ఆధునిక ఆయుధాలను కొనడం జరిగింది. యువకులందరూ ఎంతో ఉత్సాహంతో సన్నాహాలు ప్రారంభించారు. ఉమ్రీ బ్యాంక్‌పై జనవరి 12, 1948 నాడు దాడిచేయాలని నిర్ణయించారు. ఉమర్‌ఖేడ్‌నుండి సాయుధులైన యువక బృందం 30 మైళ్ళు ప్రయాణం చేసి ఉమ్రీ చేరింది. క్రమేణా ఉత్సాహం చల్లబడి ఆలోచన రేకెత్తింది. రాత్రి దాడి చేస్తే చీకట్లో అనేకమంది అమాయకుల ప్రాణాలు పోవచ్చు. అలజడిలో మిత్రులు పరస్పరం కాల్పులకు గురికావచ్చు. అందువల్ల అన్ని జాగ్రత్తలతో ఒక పథకాన్ని రూపొందించుకోవడానికి ఉమర్‌ఖేడ్‌కు తిరిగివచ్చారు. ఆ తరువాత ఈ రహస్యం వదంతులుగా వ్యాపించింది. ఉమ్రీ బ్యాంక్‌పై దాడి చేయడానికి ఒక జట్టు వచ్చిందనే విషయం ప్రజలు అనుకోసాగారు. నిజాం పోలీసు, రజాకార్ల బృందం ఈ వదంతులను నమ్మలేదు. తామందరూ ఇన్ని కట్టుబాట్లతో వుండగా 30 మైళ్ళు దాటి రహస్యంగా దాడిచేయాలంటే ఎవరికైనా ఎన్ని దమ్ములుండాలి? నిజాం బలగం ప్రజల వదంతులను ఖండించింది. అయినా తన జాగ్రత్తలో తానుంది. ఉమ్రీలో సాయుధ పోలీసు బలగాన్ని ఇంకా పెంచింది. ఉమ్రీ సరిహద్దు పొడవునా అశ్వికదళాన్ని కాపలా ఉంచింది. ఈ పరిస్థితుల్లో ఉమ్రీ బ్యాంక్‌పై దాడి చేయడం అంత సులభం కాదు. అందువల్ల సాయుధ దళాల్ని మరోచోటికి దృష్టిని మళ్లింపజేసి తన ప్రయత్నాన్ని సాగించాలని యువక బృందం ఎత్తుగడ వేసింది.
తలణి జాగీర్‌పై దాడి
ఉమ్రీ సరిహద్దుల్లో వున్న తలణి జాగీర్‌పై మొదటి దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. 1948 జనవరి 23న బహుశా ఈ దాడి జరిగింది. హదగావ్ పడమరగా వున్న ఈ జాగీర్‌ను ఆ రోజుల్లో లెవీ వసూలుచేయడానికి నిజాం సాయుధ పోలీసులను పంపాడు. ఆ వెనె్నల రాత్రి తలణిలోని ఒక భవనం పైఅంతస్థులో ఈ సాయుధ పోలీసులు విశ్రమించారు. బయట జాగీర్‌కు చెందిన హరిజనులు మంటకాచుకుంటూ కాపలా కాస్తున్నారు. అకస్మాత్తుగా కొద్ది దూరంలో చప్పుడయింది. ఒక హరిజన కాపలా దారుడు అటువైపు వెళ్లాడు. అతని మెడలు వంచి పిస్టల్ కణతపై వుంచి బంధించింది యువక బృందం. అంచనాను మించి సాయుధ పోలీసులు ఎక్కువ సంఖ్యలో వున్నారని తెలిసింది. అయినా ధైర్యంగా చాకచక్యంగా ఎదుర్కోవడం తప్ప, మరో మార్గం కనిపించలేదు. ప్రాణాలకు తెగించి యువకులు సిద్ధమైనారు. నిలుచున్న చోటునుంచి యువకులు ఏకధాటిగా పరుగులు సాగించారు. వచ్చే ముందు దాదాపు రెండు ఫర్లాంగులు మోకాళ్లపై పాకుతూ వచ్చిన శ్రమను మరిచి సాహసాన్ని ప్రదర్శించారు. మొత్తం యువకులు ఆరుగు మాత్రమే. అయినా ఏకధాటిగా అనుకోకుండా సాగిన కాల్పులకు పోలీసులు తట్టుకోలేకపోయారు. పైగా అంతస్థుపై టిన్నురేకుల చప్పుడు. కాల్పులకు ఆ రేకులు ప్రతిధ్వనించి అల్లకల్లోలాన్ని సృష్టించాయి. చాలామంది పోలీసులు కాల్పులకు గురై చనిపోయారు. ఎదురు కాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఆ ఆరుగురు యువకులు కాల్పులు కొనసాగిస్తూనే వెనక్కు వెళ్లిపోయారు. ఒక్కరికి కూడా చిన్న గాయం కాలేదు. మరుసటి రోజు ఈ దాడి వార్త విని జిల్లా కలెక్టర్ షహబుద్దీన్, డిఎస్‌పి రషీద్ తన బలగంత సహా వచ్చి సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. వేల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కాల్పులు జరిపారని, తాము ఎదురుకాల్పులు జరిపితే శవాలను తీసుకొని పారిపోయారని అక్కడి పోలీసులు రిపోర్టు ఇచ్చారు. కానీ, అసలు ఆ ఆరుగురు సాయుధ యువకులు మాత్రమే ఈ అల్లకల్లోలాన్ని సృష్టించారని హరిజన కాపలాదారులు చెప్పారు. ఈ వాస్తవాన్ని విని తమ పోలీసులను చీవాట్లు పెట్టారు. దేశభక్తితో సాహసంగా ముందుకు వచ్చి విజయవంతంగా ఈ దాడిని జరిపిన ఆరుగురు యువకుల పేర్లు శ్రీయుతులు బన్సీలాల్, సాహెబ్‌లాల్ దేశ్‌ముఖ్, నాగ్‌నాథ్, పరంజపె, కేశవరామ్ సహాని, ఆబా సాహే, లహాన్‌కర్, శంకర్‌లాల్ శర్మ.
ఉమ్రీ బ్యాంక్‌పై దాడి
రెండు వారాలు గడిచిపోయాయి. ఉమర్‌ఖేడ్ నుంచి మళ్లీ ఈ యువక బృందం 1948 జనవరి 30న దాడిచేయాలని నిర్ణయించుకుని 28న ఉమర్‌ఖేడ్ ప్రయాణం మొదలుపెట్టింది. ఓ ఎద్దుల బండిలో కూరగాయలు, గడ్డి ఉంచి వాటికింద ఆయుధాలను దాచారు. జనవరి 30 ఉదయాన బండితో సహా ఈ బృందం ఉమ్రీకి 5 కి.మీ దూరంలో వున్న కామన్‌గావ్ చేరారు. అక్కడ పథకం ప్రకారం ఈ బృందం మూడు జట్లుగా విడిపోయింది. మొదటి జట్టులో ఆయుధాల బండితో సహా దిగంబర్‌రావు, శంకర్‌లాల్ ఉన్నారు. ఈ ఆయుధాల బండి ఉమ్రీ బ్యాంక్‌కు ఎదురుగా 3.30కి చేరింది. ప్రక్కన ధన్‌జీ దుకాణం ఉంది. బండిలోపల గడ్డిలో దిగంబర్‌రావు, శంకర్‌లాల్ శవాల్లా పడుకొని ఉన్నారు. రెండో జట్టు సరిగ్గా సాయంత్రం 5.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసింది. పోలీసులు తాగడానికి వెళ్లారేమో ఒక్క సిపాయి మినహా మరెవ్వరూ లేరు. నాగ్‌నాథ్ పరంజపె నాయకత్వాన దాడిచేసిన ఈ జట్టు ఆ ఒక్క పోలీసును స్టేషన్‌లోనే కట్టిపడేసింది. చేతికందిన ఆయుధాలను తీసుకొని ఆ జట్టు బ్యాంక్‌వైపు వెళ్లింది. ఈలోగా మూడో జట్టు ఉమ్రీ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా వున్న కొండలపైనుండి మెల్లగా వచ్చిచేరింది. ఈ జట్టులో జగదీష్, మోహన్ శర్మ, బాబూరావ్ కుంటాకర్ మొదలగు వారున్నారు. ఈ జట్టు యువకులు రాగానే రైల్వే స్టేషన్ మాస్టర్‌ను బంధించి రికార్డులను తగలబెట్టారు. రెండువైపులా వున్న టెలిగ్రాఫిక్ వైర్లను కత్తిరించారు. స్టేషన్‌లోని ప్రయాణీకులు ఆశ్చర్యంగా చూస్తూండిపోయారు. అప్పుడే ఉమ్రీ మార్కెట్ ప్రాంతం నుండి కాల్పులు మొదలయ్యాయి. దిక్కులు మారుమోగుతున్నాయి. రైల్వే స్టేషన్‌లో కూడా ఈ జట్టు కాసేపు కాల్పులు జరిపింది. ప్రయాణీకులు, చుట్టుప్రక్కలవాళ్లు భయపడి ఎక్కడికక్కడే కదలకుండా ఆగిపోయారు. ఈ జట్టు కూడా తరువాత బ్యాంక్ వైపునకు దారితీసింది. చలికాలపు సాయంత్రం 5.30 గంటలకు మొదటి జట్టు బ్యాంక్‌పై దాడిచేసింది. దాడి చేసిన యువకులలో అనంత్ బాలేరావు, ఆబాసాహెబ్, సాహెబ్‌రావ్, దిగంబర్ ఉత్తర్వార్, బన్సీలాల్‌జీ తోషినీవాల్, కిషోర్ సహాని, శంకర్‌లాల్ శర్మ, ధన్‌జీ పురోహిత్, రఘునాధ్ పండిట్ తదితరులు ఉన్నారు. తుపాకులతో కాల్పులు జరుపుతూ వీరంతా బ్యాంక్‌లోకి చొచ్చుకొనిపోయారు. ఈలోగా బ్యాంక్‌వాచ్‌మెన్లు పైనుండి కాల్పులు ప్రారంభించారు. కానీ ఆ వాచ్‌మెన్ కాల్పులకు ఎవరూ అందలేదు. దత్తాత్రేయను చంపిన అరబ్బీ వాచ్‌మెన్ మొదలే బ్యాంక్ కాంపౌండ్‌లో ఈ జట్టు కాల్చి చంపింది. అందువల్ల మేడపై వున్న మిగిలిన వాచ్‌మెన్లు ప్రాణభయంతో దాక్కున్నారు. లోపలికి వెళ్లి జట్టు సరాసరి క్యాషియర్ దగ్గరకు వెళ్లింది. క్యాషియర్‌ను తాళం చెవులు అడిగారు. అతను నిరాకరించగానే వెంటనే ఫైరింగ్ జరిగింది. పాపం దేవీదాస్ గిర్‌గావ్‌కర్ అనే క్యాషియర్ ప్రాణాలు కోల్పోక తప్పలేదు. క్రమంగా డబ్బు భోషాణాలు తెరుచుకున్నాయి. దగ్గరున్న సంచుల్లో డబ్బు నింపారు. అరబ్బీవాళ్ళ లుంగీలు దొరికితే వాటిలో డబ్బు మూటకట్టారు. ఈలోగా మిగతా సహచరులు మార్కెట్‌నుండి బలమైన ఎద్దులున్న 20 బండ్లను తీసుకొని బ్యాంక్ ఎదురుగా సంసిద్ధంగా పెట్టారు. బండివాడు ఒక్కడు కూడా నోరు మెదపలేదు. కాల్పులు గాలిలో కొనసాగుతూనే వున్నాయి. భయానకమైన వాతావరణం నెలకొన్నది. దాదాపు 2వేలదాకా గుండ్లు పేల్చబడ్డాయి. 20 బండ్లపై డబ్బు సంచులను అమర్చారు. కేవలం 45 నిమిషాల్లో ఎంతో నాటకీయంగా ఈ తతంగం జరిగిపోయింది. ఈ దాడిలో పాల్గొన్న యువకుల్లో దేవ్‌రావ్ ఖడ్గీకర్ ఒక్కడే గాయపడ్డాడు. గాయపడిన మిత్రుడిని తీసుకొని 20 బండ్లతో సహా ఈ జట్టును తిరుగు ప్రయాణం సాగించింది.
రక్తరంజితమైన భైరవుని పల్లె
రజాకార్లు తెలంగాణాలోని అనేక గ్రామాలపై పడి దోపిడీలు, మానభంగాలు, హత్యలు కొనసాగిస్తున్న ఆ భయంకర వాతావరణంలో అక్కడక్కడ ప్రజలు ధైర్యాన్ని కూడగట్టుకుని ఎదురుతిరిగారు. ఆ సమయంలో నిజాం ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి శాంతి సంఘాలను ఏర్పరచి హిందువుల కళ్లు కప్పే ప్రయత్నం చేసింది. అయితే హిందూ సభ్యులు నోరెత్తి రజాకార్లకు వ్యితిరేకంగా ఫిర్యాదు చేస్తే ప్రాణాలతో మిగలటం కష్టం. గ్రామాల్లో శాంతి సంఘాలు స్థాపించి ప్రజలకు రక్షణ కల్పిస్తామని నిజాం ప్రచారం చేస్తుండేవాడు. కానీ ఆ శాంతి స్థాపన ఎంత భయానకంగా జరుతుండేదో ఎం.ఎన్.రెడ్డి ఒక సంఘటన ద్వారా వివరించారు. ఒక చోట చింతచెట్టుకి ఐదు శవాలు వేలాడుతున్న దృశ్యం కనపడింది. ఆయన వెంటనే దగ్గరలో వున్న గ్రామవాసులను అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. శవాలను వ్రేలాడుతున్న ప్రాంతం ఇసనూర్ పోలీస్ స్టేషన్‌కు సుమారు 6 కి.మీ దూరంలో ఉండేది. ఆ ఐదు శవాలు బ్రాహ్మణులవి. అంతకు క్రిందటి రోజే శ్రాద్ధ భోజనం చేసి ఏడుగురు బ్రాహ్మణులు తిరిగి వస్తున్నారు. తోవలో శాంతిని సంరక్షిస్తున్న రజాకార్ల ముఠా ఒకటి ఎదురైంది. ఆ ఏడుగురిని పట్టుకున్నారు. ఇద్దరు బ్రాహ్మలు మాత్రం తప్పించుకుని పారిపోయారు. మిగిలిన ఐదుగురు ప్రభుత్వ ఏజెంట్లని రజాకార్లు నిర్థారణ చేసి ఆ ఐదుగుర్ని వరుసగా చింతచెట్టు కొమ్మకు వ్రేలాడదీశారు. కట్టిన లావాటి తాడు కాలకుండా కింద మంటలు పెట్టారు. ఆ మంటల్లో కాలి మాడి ఉడికి ఆ బ్రాహ్మణులు ప్రాణాలు వదిలారు. మిగతా హిందువులకి గుణపాఠంలా వుండాలని ఆ శవాలను అలాగే వ్రేలాడదీసి రజాకార్లు వెళ్లిపోయారు. ఆ బ్రాహ్మణులలో ముగ్గురు నడుములకు వున్న వెండి మొలతాడ్లు కాలి వంకర్లు పోయాయి. రజాకార్ల ఈ పైశాచిక కృత్యాలు 1857లో నీల్ చేసిన దురంతాలను మించిపోయాయి. బ్రిటీష్ సైనికాధికారి నీల్ భారతీయులను చెట్లకు వ్రేలాడదీసి ఉరితీసేవాడు. ఫిరంగులకు కట్టి పేల్చేసేవాడు. కానీ ఇలా మంటల్లో కాల్చి భయంకరంగా చంపిన ఘటనలు లేవు. ఈ రాక్షస కృత్యాలు రజాకార్ల ప్రత్యేకతను నిరూపించాయి. ఆ రోజుల్లో భైరవునిపల్లి నల్గొండ జిల్లాలో వుండేది. ఈనాడు ఇది వరంగల్ జిల్లాలో అంతర్భాగం. ఈ భైరవుని పల్లె ప్రజలు ఆనాడు రజాకార్లను ప్రతిఘటించి తమ ఆత్మాభిమానాన్ని నిరూపించుకున్నారు. అప్పట్లో రజాకార్లు మజాకార్లుగా తయారై యధేచ్చగా గ్రామాల్ని దోచుకునేవారు, తగులబెట్టేవారు, చందాల పేరుతో డబ్బులు వసూలుచేసేవారు. ఇవ్వని గ్రామాలపై దాడిచేసి దోచి తగులబెట్టేవారు. అలా కసి తీర్చుకునేవారు.
ప్రభుత్వోద్యోగం నిరాకరణ
ఆ రోజుల్లో జాతీయభావాలని నిర్భయంగా ప్రకటిస్తున్న ఉర్దూ దినపత్రిక రయ్యత్, నిజాం సంస్థానంలో ఆనాటి అధికారిక భాష ఉర్దూ. పత్రికలు చాలావరకూ ఉర్దూలోనే వెలువడుతుండేవి. ముందుముల నరసింగరావు పత్రికా సంపాదకుడిగా ఉండేవారు. ఆ రోజుల్లో రయ్యత్‌కు ఉపసంపాదకుడి అవసరం వుందని ప్రకటన వెలువడింది. ఆ ఉద్యోగం కోసం షోరుూబ్ వచ్చాడు. టేబుల్‌పై వున్న పత్రికలో ఒక వార్తను చూపి సంపాదకీయం రాసివ్వమని అన్నారు సంపాదకులు. షోరుూబ్ సంపాదకీయాన్ని కొద్ది సమయంలోనే రాసి ఇచ్చాడు. తర్వాత ఒక ఇంగ్లీష్ వార్తను ఇచ్చి ఉర్దూలోకి అనువదించమన్నారు. ఆ పని కూడా సంతృప్తికరంగా చేశారు. అభిప్రాయాలు, శైలి, భాషా సమన్వయం సరిగ్గా కుదిరింది. ఆ విధంగా ప్రాథమిక పరీక్ష ముగిసింది. తర్వాత సంపాదకులు తన పత్రిక వైఖరి గురించి చెబుతూ ఇలా అన్నారు. మీరు ఉప సంపాదకులుగా మీ పనిని నిర్వహిచగలుగుతారు. కానీ రయ్యత్ జాతీయ భావాలుగల పత్రిక. మీరు రాయిస్టు అభిప్రాయాలు గల వ్యక్తులు. మీ వ్యాసాలను నేను తాజ్ వారపత్రికలో చదివాను. అందువల్ల మీరు ఈ పాలసీతో ఏకీభవించి పనిచేయగలుగుతారా? అని అడిగారు. షోరుూబ్ సమాధానంగా తాను రయ్యత్‌లో పనిచేసినంతకాలం ఎలాంటి భేదభావాన్ని ప్రకటించనని చెప్పారు. పత్రికా రచయితగా పొందే వేతనం కూడా చాలా నిరుత్సాహకరంగా ఉంటుందని, షోరుూబ్ ప్రభుత్వోద్యోగంలో చేరడం మంచిదని సంపాదకులు సలహా ఇస్తూ మీరు ముస్లిం అభ్యర్థిగా, ఉస్మానియా పట్ట్భద్రుడిగా నిజాం ప్రభుత్వంలో సునాయాసంగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. మీ నాన్నగారు పోలీసు సబ్ ఇన్స్‌పెక్టర్. చిన్నాన్నగారు ఫారెస్ట్ విభాగంలో అధికారి. పైగా మీరు వివాహితుడు. ఒక కూతురు కూడా. నేను ఇవ్వబోయే నెలసరి జీతం 50 రూపాయలు. మీకు సరిపోతాయా? ఈ ఆర్థికమైన ఇబ్బందిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని ఆయన స్పష్టీకరించారు. షోరుూబ్ నిరుత్సాహం చెందకుండా, తాను ప్రభుత్వోద్యోగం చేయనని, ఈ స్వల్ప వేతనం తనకు ఇష్టమేనని చెప్పాడు. ఆ తరువాత షోరుూబ్ రయ్యత్ ఉపసంపాదకునిగా ఉద్యోగంలో చేరిపోయాడు.
గోర్టలో హత్యాకాండ
ఈనాడు కర్ణాటకలో వున్న బీదర్ జిల్లాలో హోనల్లి అనే గ్రామం వుంది. భాల్కీ కళ్యాణ్ రైలు మార్గంలో వున్న ఈ గ్రామం ఆనాటి ఖుర్షీద్ జాహి జాగీర్‌లోని ఒక భాగం. 1947 తరువాత కూడా నిజాం సంస్థానంలో రజాకార్లు, కొందరు హరిజన నాయకులు నిజాం అధికారాన్ని సమర్థించారు. స్వాతంత్య్ర దినోత్సవంనాడు సంస్థానంలోని హల్‌గోర్టా, హోనలీ గ్రామాల్లో హిందువులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ముస్లిం అధికారులు నిజాం వ్యతిరేకించిన హిందువులను శిక్షించాలనే కక్షతో ఆ గ్రామాలకు పోలీసులు పంపించారు. హల్‌గొర్టాలోని మాధవరావును అరెస్టు చేసి జెండా నేరం మోపారు. ఆ తరువాత హోనల్లీలోకి ఇద్దరుపోలీసులు వెళ్లి దర్యాప్తు సాగించారు. జెండా ఎగురవేసిన నేరంపై భావురవ్ పటేల్‌ను అరెస్టు చేస్తామని ఆ ఇద్దరు పోలీసులు బెదిరించారు. పటేల్ ఆ గ్రామానికి ఒక విధంగా నాయకుడు. అతను ఆ ఇద్దరు పోలీసులను బంధించి గదిలో పెట్టాడు. జమేదార్ అధిక ప్రసంగం చేశాడని లాగి చెంపదెబ్బ వేశాడు. అరెస్టు చేయాలని వచ్చిన పోలీసు వాళ్లు అరెస్టు చేయబడ్డారు. అసలు గ్రామస్థులు వారిద్దరిని తుపాకీతో కాల్చివేయాలని సలహా ఇచ్చారు. భావురావ్ పటేల్ విషమించిన పరిస్థితుల దృష్ట్యా మరుసటి రోజు వారిద్దరిని వదిలిపెట్టారు. హోనల్లీ నుంచి గొర్టా రెండు కి.మీ దూరంలో వుంది. గొర్టాలో రజాకార్ల నాయకుడు హిసాముద్దీన్ వుండేవాడు. హోనల్లీలో పోలీసులపై భావురావు పటేల్ చేయి చేసుకున్నాడని, ఒక రోజు బంధించి పెట్టాలనే వార్త చుట్టుప్రక్కల దావానంలా వ్యాపించింది. హిసాముద్దీన్ తాను ఆ ప్రాంతంలో వుండగా ఇలా జరగడం పెద్ద అవమానంగా భావించి ప్రతీకారానికి వేచి వున్నాడు. పోలీసులను నిర్బంధించి వదిలిన తరువాత రాబోయే పరిణామాలను భావురావు పటేల్ ఊహించాడు. తన సహాయం కోసం చుట్టుప్రక్కల గ్రామాలనుంచి మిత్రులను పిలిపించుకున్నారు. ఆ రోజంతా రజాకార్లు వస్తారేమోనని ఎదురుచూసిన పటేల్, తదితరులు మరుసటి రోజు జానాపూర్, సాయేగావ్ గ్రామాలకు వెళ్లిపోయారు. హోనల్లీనుండి పటేల్, తదితరులు వెళ్లిపోయారని వార్త తెలుసుకున్న హిసాముద్దీన్ తన రజాకార్ల ముఠాతో దాడిచేశారు. హోనల్లీ గ్రామాన్ని ఇష్టానుసారం దోపిడీ చేశాడు. భావురావ్ పటేల్ ఇంటిని దోచుకొని నిప్పుపెట్టాడు. నిరాయుధులైన గ్రామస్థులు ప్రతిఘటించలేకపోయారు. హిసాముద్దీన్‌ను పటేల్ తుపాకీతో కాల్చి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు. హోనల్లీని దోచిన రజాకార్లకు బుద్ధి చెప్పాడు.
బీబీనగర్ దోపిడీ
వెనకాల తరుముకొస్తున్న సాయుధులైన రజాకార్లు గ్రామంలో మొదటి స్టేషన్ మాస్టర్ ఆంజనేయులు ఇంట్లోని 30 తులాల బంగారం ఎత్తుకుపోయారు. ఆ తరువాత గ్రామంలో జొరబడి గుడిసెలకు నిప్పు అంటించారు. క్రమక్రమంగా చాలా ఇళ్లు తగులబడిపోయాయి. గ్రామస్థులను చెదరగొట్టాలనే ఉద్దేశ్యంతో గాలిలో కాల్పులు సాగించారు. భయపడిపోయిన గ్రామ ప్రజలు తలుపులు మూసుకుని ఇళ్ళల్లోనే తలదాచుకున్నారు. స్వయంగా కాశీం రజ్వీ జీపుతోపాటు గ్రామంలోనికి ప్రవేశించి తన పర్యవేక్షణ కింద ధనవంతుల ఇళ్లను దోపిడీ చేయించాడు. పట్టండి.. కొట్టండి.. నరకండి.. అని కేకలతో వాతావరణం నిండిపోయింది. ఉపాధ్యాయిని రత్తమ్మ ఇంటిలోకి చొరబడి తుపాకి చూపి ఆమె బంగారు కడియాలు, ఉంగరాలు లాక్కున్నారు. అయ్యవారు పురుషోత్తమాచారి ఇంట్లోకివెళ్లి 1200 తులాల వెండి, బంగారం, డబ్బు దోచుకుని ఆచారిని తాళ్లతో బంధించి తీసుకువచ్చారు. వ్యాపారస్థుడైన వైశ్య మల్లయ్యగారి శివయ్యను కూడా విపరీతంగా కొట్టి ఆస్థినంతా దోచేశారు. ఆ తరువాత బంగారు రాజయ్య ఇంటిని కూడా దోచారు. కానీ రాజయ్య భయకంపితుడై పారిపోతూ బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. బంజరి బాలయ్య ఇంటిపై పడి అతన్ని తీవ్రంగా కొట్టారు. దొరికిన వెండి, బంగారు నగలని దొంగిలించారు. చాలామందిని తాళ్ళతో కొట్టి రజ్విముందు వరుసగా నిలబెట్టారు. ఫీల్డ్ మార్షల్ కాశీం రజ్వీ కళ్లఎదుట బీబీనగర్ పట్టపగలే దోచుకోబడింది. దాదాపు అన్ని ఇండ్లలోని వెండి, బంగారం, డబ్బు లాక్కోబడ్డాయి. ఇళ్లు తగలబెట్టి వీలున్నచోటల్లా మానభంగాలు చేశారు. రెండు గంటలపాటు ఆ గ్రామాన్ని పిశాచాలు రాజ్యం ఏలినట్టు విజయోన్మాదంతో ఊగిపోయారు. నిజాం తన స్వతంత్ర ప్రతిపత్తికోసం రజాకార్ల చేతుల్లోకి తన ప్రజలను ఎంత అమానుషంగా నెట్టివేశాడో బీబీనగర్ ఒక చారిత్రాత్మక ఉదాహరణ. కాశీం రజ్వీ తన సిగ్గుమాలిన విజయోల్లాసంతో 20 మంది గ్రామస్థులను బందీలుగా తీసుకొని ఊరి బయటకు వచ్చారు. కస్టమ్స్ కార్యాలయం ఎదుట ఆ బందీలను ఉద్దేశించి రజ్వీ ఉపన్యసించాడు. ప్రభుత్వంతో సహకరించిన రజాకార్లకు సహాయపడని పక్షంలో జీవించడం కష్టమని ఊరివాళ్లను బెదిరించాడు. తరువాత వారందరినీ వదిలేసి నినాదాలు చేసుకుంటూ రజ్వీ తన మందీ మార్బలంతో వెళ్లిపోయాడు. తరువాత బీబీనగర్‌లో స్మశాన స్తబ్దత వ్యాపించింది. ఇళ్లు కాలుతున్నాయి. దోచబడిన వ్యక్తులు విలపిస్తున్నారు. నీరస వాతావరణం వ్యాపించింది.
పి.పి.సి ఆవిర్భావం
నిజాం సంస్థానంలో ప్రబలిన అరాచకత్వాన్ని కళ్లారా చూస్తూ మేధావి వర్గం తల్లడిల్లిపోయింది. తాము ఏమీ చేయలేకపోతున్నామనే బాధ వాళ్లను కృంగదీసింది. నగరంలోని ప్రతిభావంతుడైన (మిగతా 13వ పేజీలో)

యువ న్యాయవాది సదాశివరావు. ఇతను ఈ దారుణ పరిస్థితివల్ల మరింత బాధపడ్డాడు. కోర్టులను బహిష్కరించాలని ఆలోచన తట్టింది. అలాగే సంస్థానంలో జరుగుతున్న అత్యాచారాల సాక్ష్యాధారాలను సేకరించే పని చేయాలనుకున్నారు. నిజాం అబద్ధాలను బయటపెట్టాలని కృతనిశ్చయంతో మిగతా న్యాయవాదులతో సంప్రదించాడు. ఉత్సాహంతో పని మొదలైంది. కొన్ని రోజుల్లోనే పదివేల రూపాయలు సేకరించారు. ముఖ్యంగా జె.వి.నరసింగరావు, కె.వి.రంగారెడ్డి, దొంతి గోపాలరెడ్డి ఎక్కువగా సహకరించారు. ఈ ఆందోళన జరుగుతున్నంతకాలం ప్రతినెలా 2వేల రూపాయలు వనపర్తి రాజా రామేశ్వరరావు విరాళంగా ఇచ్చారు. కోర్టు బహిష్కరణ పత్రాలపై వంద సంతకాలను సేకరించారు. ఈ పూర్వరంగాన్ని సిద్ధం చేసిన తరువాత కాశీనాథ్‌రావు ఇంట్లో న్యాయవాదుల సమావేశం జరిగింది. ప్లీడర్ ప్రొటెక్ట్ కమిటీ (పిపిసి) అనే పేరుతో సంస్థ నిర్మాణం జరిగింది. ఏకగ్రీవంగా వినాయకరావు విద్యాలంకార్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జామ్‌బాగ్‌లో వున్న వసంతరావు ముదఖేడ్‌కర్ ఇంటిని పిపిసి కార్యాలయంగా నిర్ణయించారు. వసంతరావు ఆ రోజుల్లో సాహసించి తన ఇంటిని పిపిసి కోసం కేటాయించడం విశేషం. అరాచకత్వం ప్రబలిన ఆ రోజుల్లో తలచుకుంటే ఆ ఇంటిని ధ్వంసం చేయడం పెద్దకష్టమేమీ కాదు. అయినా స్వయంగా వసంతరావుకు ముందుకు రావడం ప్రశంసనీయం. అందువల్లనే ఆ ఇంటిని ఆ రోజుల్లో హైదరాబాద్ ఆనంద్‌భవన్ అనేవారు. ప్లీడర్ ప్రొటెక్ట్ కమిటీ మొదటిసారిగా మేధావుల సంఘర్షణ సమితిగా ఏర్పడింది. ఆ కమిటీని తనకు లోబడి పనిచేయమని స్టేట్ కాంగ్రెస్ కోరింది. కానీ సంస్థానంలో ప్రబలిన అరాచకత్వానికి అన్యాయానికి వ్యతిరేకంగా తాము స్వతంత్రంగానే పనిచేయదలచుకున్నామని పిపిసి చెప్పింది. ఆ విధంగా ఏ రాజకీయ పక్షానికి చెందకుండా ప్రజల నైతిక స్థాయిని కాపాడడంలో ఈ న్యాయవాదుల కమిటీ ఎంతో కృషి చేసింది.
రామ్‌ఘాట్‌లో సభ
హైదరాబాద్ సంస్థానంలో రోజురోజుకీ రజాకార్ల దుండగాలు మితిమీరిపోతున్నాయి. లూటీలు, అత్యాచారాలు, దహనాలు, అపహరించడం మామూలైపోయింది. గొర్టాలో హిందువులను ఊచకోత కోశారు. ఈ సంఘటనలన్నీ యశ్వంత్‌రావు, వెంకట్రావు తదితర యువకులను తీవ్రంగా కదిలించివేశాయి. ప్రతీకారవాంఛ రగిలింది. అందరూ కలిసి అట్టర్గే ప్రాంతంలో సమావేశం ఏర్పాటుచేశారు. అట్టర్గే గ్రామం రాజమార్గం నుంచి దూరంగా ఉండేది. చుట్టుప్రక్కల ముఖ్యమైన గ్రామాలనుంచి ఇక్కడి చేరుకోవాలంటే మంజీరా నదిని దాటిరావాల్సిందే. పైగా ఆ గ్రామంలో రజాకార్ల కార్యకలాపాలు లేవు. స్థానిక ప్రజల సహకారం సులభంగా ఉండేది. ఈ కారణాలవల్ల అట్టర్గేలోనే సభ జరిగింది. చుట్టుపక్కల వున్న గ్రామాలనుంచి వందలాది సంఖ్యలో రైతు యువకులు సభలో పాల్గొన్నారు. రజాకార్ల అత్యాచారాలను ఎదుర్కోవడానికి రైతు దళ నిర్మాణం జరిగింది. ఎక్కడ దాడి జరిగినా లోపలనుంచి గ్రామీణులు ఆత్మరక్షణకోసం పోరాడాలని బయటినుంచి రైతు దళం వచ్చి దెబ్బతీస్తుందని నిర్ణయించారు. డాక్టర్ చిన్నప్ప అధ్యక్షుడిగా, యశ్వంతరావు కార్యదర్శిగా, వెంకట్రావు దళ కమాండర్‌గా, మరికొంతమందిని కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. ఆగస్టు 12, 1948 నాడు ఉద్‌గీర్ నుంచి సాయుధ బలగం ఒకటి బయలుదేరింది. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్, ఒక సబ్ ఇన్స్‌పెక్టర్‌తోసహా వందమంది పోలీసులు వేలాదిమంది రోహిల్లాలు, పఠాన్‌లు, రజాకార్లు వెంట ఉన్నారు. వెనకాల వేలాదిమంది ముస్లింలు ప్రేక్షకుల్లా వస్తున్నారు. రామ్‌ఘాట్‌లో వున్న రైతు దళాన్ని మట్టుబెట్టాలని ఈసారి మందీ మార్బలంతో బయలుదేరారు. జరగబోయే పోరాటాన్ని కళ్లారా చూడాలని ముస్లిం ప్రజలు దారిలో వున్న చిన్న కొండ ఎక్కికూర్చున్నారు. రామ్‌ఘాట్, తొండచీరు, కౌల్‌ఖేడ్ గ్రామాలు త్రికోణంలో వున్నట్లు వుంటాయి. ఈ త్రికోణం మధ్య సమతలమైన కొండ ప్రాంతం వుంది. ఉద్‌గీర్ నుంచి బయలుదేరిన శతృదళం కౌల్‌ఖేడ్ దగ్గరలో వున్న పల్లపు ప్రాంతం చేరుకుంది. ఈలోగా రైతు దళానికి కబురు చేరింది. అంతకుపూర్వమే ఈ దాడి జరగబోతుందనే విషయం తెలిసింది. దళం అన్ని ఏర్పాట్లు చేసుకుని ముందుకు దూసుకుపోయింది. భోజనం చేయగలిగే వ్యవధి కూడా లేకుండా పోయింది. అంత పెద్ద శత్రుబలంతో తలపడడానికి ఇంతటి చిన్న దళం అంతటి మనోధైర్యంతో వెళ్లడం దుస్సాహం అనిపించవచ్చు. సమతలంగా వున్న కొండమీదికి ఉదయం 8 గంటలకు దళం చేరుకుంది. శత్రుదళాలు ఎదురుగా కనపడగానే రైతు దళం మోచేతులపై పాకుతూ కదిలింది. ఎదురుగా కాల్పులకు సమాధానంగా తిరిగి కాల్పులు రెండు మూడు గంటలపాటు ఎదురెదురుగా సాగుతూనే వున్నాయి. శత్రువు దగ్గర మందుగుండు సామగ్రికి కొదవలేదు. ఆగకుండా కాల్పులు సాగుతూనే వున్నాయి. ఎటుచూసినా పొగ వ్యాపించి ఉంది. శత్రువు అత్యంత శక్తివంతంగా దాడిచేస్తున్నాడనే సంగతి రైతు దళానికి తెలుసు. అయినా చంపడమో, చావడమో అనే అంతిమ లక్ష్యంతో వాళ్లు కృతనిశ్చయులై ఉన్నారు. కొండ ఆ చివరవాళ్లు, ఇటు వీళ్లు పరస్పరం తుపాకీలను గురిచూసి కొడుతూనేవున్నారు. తమ దగ్గర వున్న పరిమితమైన మందుగుండు సామగ్రి జాగ్రత్తగా వాడుకున్నారు. దళం తన దగ్గర వున్న ఫిరంగిని పేల్చింది. అటు ఎదురుగావున్న కొండపైకి గుళ్లను విసిరింది. ప్రేక్షకుల్లా వచ్చిన జనం గందరగోళంగా పరిగెత్తారు. మరోసారి ఫిరింగి పేలింది. శత్రుదళాల్లో కొందరు ఆ దెబ్బకు కూలిపోయారు. అయినా రోహిల్లాలు, పఠాన్‌లు, పోలీసులు కదలకుండా ప్రతిఘటిస్తూనే వున్నారు. అలా మరో మూడు గంటలు కాల్పులు కొనసాగాయి. శత్రువర్గంలో అనేకమంది మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ పోరాటంలో ఘోరంగా ఓడిపోయి రజాకార్లు, పోలీసులు ఉద్‌గీర్‌వైపు పారిపోయారు. దళం అమరుడైన దేవరాజ్ మాధవ్‌ను సైనిక మర్యాదలతో సమాధి చేశారు. తమకంటే ఎన్నోరెట్లు బలవంతుడైన శత్రువును ఓడించి వెనక్కి తోసి విజయంతో రామ్‌ఘాట్ తిరిగి వెళ్లిపోయింది. రైతు దళంలో గాయపడిన కొంతమందికి డాక్టర్ చెన్నప్ప చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన వాళ్లని షోలాపూర్ పంపించే ఏర్పాట్లు జరిగాయి. ఇటు ఉద్‌గీర్‌లో ఓటమి వార్త విషాదంలా వ్యాపించింది. ముస్లిం పోలీసు వర్గాలు కోపంతో కొందరి హిందువుల ఇళ్లపై దాడి చేశారు. అక్కడే స్థానిక పటేల్ హవర్గారావును పోలీసు రైటర్ బహిరంగంగా కాల్చివేశాడు. ఒక బ్రాహ్మణ యువకుని సజీవంగా దహనం చేశారు. హిందువులందరూ అరచేతుల్లో ప్రాణాలు నిల్పుకుని తలుపులు బిగించుకుని ఇంట్లోనే ఉండిపోయారు.