S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాడాలని వుంది

పాడాలనే కోరిక లేని మనిషంటూ సాధారణంగా ఉండరు. కనీసం వినాలనే ఆసకె్తైనా ఉంటుంది.
అప్పుడైనా పాడాలనిపించటం సహజం. అనురక్తి, అభిలాష, ఆసక్తి కలిగిన కొందరు నియమబద్ధంగా నిష్టతో ఓ గురువు నాశ్రయించి పట్టుదలతో సాధన చేస్తారు.
అసలు ఏ కృషి చేయకుండా, నలుగురినీ విని పాడగలిగేవారుంటారు.
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతోబాటుగా భగవంతుడు మాత్రమే ప్రసాదించే విభూతే యిది. వరసబెట్టి అందరికీ ఈ శక్తినిచ్చేనూ పోడుదేవుడు.
యిందులోని విశేషాన్ని, అధ్యయనం చేసి లోతుగా పరిశీలించి సాధన చేసి సాధిద్దామనే ఉన్నత లక్ష్యం కూడా జతచేస్తాడు. కొందరికి మా నాన్నగారికి అత్యంత సన్నిహిత మిత్రుడైన ముసునూరి సూర్యనారాయణ మూర్తనే హరికథా భాగవతార్ ఉండేవారు. ఆరోజుల్లో ఆయనకు చాలా పేరు. హరికథలేగా?
సంగీత జ్ఞానం అంతంత మాత్రమే ఉంటుందని అనుకోవటానికి వీలులేదు.
విజయవాడలో పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యరికం చేసే రోజుల్లో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా అతి చిన్న వయసులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ కచేరీ చేసిన రోజున, అందరి సమక్షంలో ‘‘మురళీకృష్ణ పేరుకు బాల’’అనే మాటను తగిలించిన రసికుడే ఈ సూర్యనారాయణమూర్తి.
రాగాలకున్న ఆరోహణ అవరోహణ క్రమం, దారితెన్నులు, వాటి సంచారం, తెలియక పోయినా, ఒక్కసారి పక్కవిద్వాంసుణ్ణి అడిగి ‘అయ్యా’ పూర్వి కల్యాణి రాగం స్వరాల క్రమం ఒకసారి చెప్పండి, అనడిగిన వెంటనే...
ఆ రాగంలో అనర్గళంగా ఆగకుండా పద్యం పాడేశేవాడు.
అదో మహాప్రజ్ఞ. జనం వెర్రిగా వినేవారు.
పదేళ్ళు నిండకుండానే మాండలిన్ శ్రీనివాస్ ఆరోహణ అవరోహణ క్రమం తెలిసిన వెంటనే రాగాన్ని దర్శించగలిగేవాడు. వాయించేశేవాడు. అతడో బాలమేధావి.
శ్రీనివాస్‌లోని మేధస్సును గ్రహించిన విద్వాంసుడు రుద్రరాజు సుబ్బరాజు.
విజయవాడ రేడియో కేంద్రంనుండి పాడేవారు. చెంబై వైద్యనాధ భాగవతార్ శిష్యుడు. తండ్రితోబాటు బ్యాండ్ మేళంలో ఎన్నో సినిమా పాటలు వాయిస్తూ గడిపేవాడు. శ్రీనివాస్‌కు సరైన దిశానిర్దేశం చేసినవాడు కూడా ఈ సుబ్బరాజు.
సాధారణంగా సినిమా పాటలకు అలవాటుపడ్డవారికి శాస్ర్తియ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకోవాలనే బుద్ధిపుట్టదు, ఆటపాటలు పుట్టనివ్వవు కూడా.
కానీ శ్రీనివాస్‌కు పుట్టిందంటే కారణం అతని సంస్కారం.
వామనుడు భూమిని కొలిచినంత సునాయాసంగా సువిశాలమైన సంగీత పరిధిని ఆక్రమించుకుని అత్యంత ప్రసిద్ధుడై చరిత్రలో నిల్చిపోయాడు.
యిటువంటివారు ఏ నూటికోకోటికో ఉంటారు. పూర్వజన్మ సంస్కారమే కారణం. ఈ మేధావుల సంగతి అలా వుంచండి.
ఈవేళ లోకంలో చూడండి. శ్రమపడకుండా తేలికగా గాయకులౌదామనే వారే ఎక్కువ. క్రమశిక్షణతో పద్ధతిగా సంగీతాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి కలిగినవారు ‘సినిమా సంగీతాన్ని ఆదర్శంగా తీసుకుంటే, వారనుకున్న లక్ష్యం ఎప్పుడూ ఎండ మావుల్లాగానే కనిపిస్తుంది.
అంతా తెలిసినట్లుగా అనిపిస్తుంది. తెలియవలసినది కొండలా పెరిగిపోతూ ఉంటుంది.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ క్లారియెనెట్ వాద్యంతో ఓ బ్యాండ్ నిర్వహిస్తూ పెళ్ళిళ్ళల్లోనూ, పండుగలు, పర్వదినాల్లోనూ తిరుగుతూ, కుటుంబ జీవనం సాగించేవాడు.
1979లో రుద్రరాజు సుబ్బరాజు సత్యనారాయణ కుటుంబాన్ని మద్రాసులో స్థిరపడే ఏర్పాటుచేశాడు.
శ్రీనివాస్‌కు జీవితానికి యిదే పెద్ద మలుపు.
శ్రీనివాస్‌కు అదే పెద్ద వరమైంది. మద్రాసులో సినిమా పాటకు ఎంత విలువిస్తారో అతనికి తెలిసింది. సంగీత విద్వాంసులు, సంగీత సభలు, కర్ణాటక సంగీతం శ్రద్ధగా విని అర్ధంచేసుకోగల రసికులున్నచోటికి చేరిన శ్రీనివాస్ సినిమా పాటలకు నెమ్మదిగా ఉద్వాసన చెప్పేశాడు. ఆ రెండు బాణీలకూ గల తేడా తెలుసుకున్నాడు.
సుబ్బరాజునే గురువుగా, మార్గదర్శకుడిగా భావించిన శ్రీనివాస్ ఆయన దగ్గర 1982నాటికి ఓ 80, 90 కీర్తనలు వాయించే స్థితికి చేరుకున్నాడు. ఆ వయస్సులో సాధారణంగా ఈ ఆలోచన ఎవ్వరికీ రాదు. ఆ తర్వాత జరిగిన కథ, అతని సంగీత యాత్ర మీఅందరికీ తెలిసినదే.
సంగీతంలో గురువుకున్న స్థానం వెలకట్టలేనిదని చెప్పేందుకే శ్రీనివాస్‌ను ప్రస్తావించాను. విద్వాంసులంతా గురువులవ్వరు. బరువులే. అందరు గురువులూ విద్వాంసులవ్వాలనే నియమంలేదు. నాకు తెలిసినంతవరకూ బొంబేలో బాలామణి, అలుమేలు (నేపథ్య గాయకుడు హరిహరన్ తల్లి).
మద్రాసులో కలకత్తా కృష్ణమూర్తి తంజావూర్ శంకరయ్యర్ వంటి వారంతా చాలా ప్రసిద్ధమైన బోధకులు, విద్వాంసులు.
కర్ణాటక సంగీత గాయని బొంబే జయశ్రీ బాలామణి, లాల్‌గుడి జయరామన్ వంటి వారివద్ద సంగీతాభ్యాసంచేసి రాణింపుకు వచ్చారు.
గురువర్యుని దృఢమైన మానసిక సంకల్పం, శక్తివంతమైన వాక్కు, వాత్సల్య పూర్వకమైన స్పర్శ, అనే మూడుమార్గాల ద్వారా జ్ఞాన విజ్ఞానాల అనుభవసారం శిష్యుడికి అందుతుంది.
గురుపరంపరకు అర్ధం చెప్పాలంటే త్యాగరాజుతో పోల్చతగిన వారెవ్వరూ ఉండరు.
స్వరం ఉనికి ఎక్కడ? మరో స్వరం కలిసినప్పుడు దాని రూపం ఎందుకు మారుతోంది?
అలా ఏర్పడిన స్వరం చెవికి చేరగానే అందమైన రూపంగా ఎలా ఏర్పడుతోంది? అది రాగమెలా అవుతోంది?
ఇవన్నీ తాను పాడుతూ సమర్ధంగా చూపించగల సంగీత సద్గురువువల్ల మనం ఎప్పుడూ మాట్లాడుకునే శుద్ధమైన సంగీతం పెరిగి భావితరాలకు మార్గదర్శకమై కలకాలం నిలిచిపోతుంది. అదే నిత్యం శాస్వతం.
అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు గొంతులో గమకాలు పలకనివారు ఈ శాస్ర్తియ సంగీతాన్ని నిర్లక్ష్యభావంతోనూ చులకన భావంతోనూ చూస్తే, తెలుసుకోవలసిన అన్ని మార్గాలూ మూసుకుపోతాయి.
అచ్చులకూ హల్లులకూ తేడా తెలియకుండా ఆటవెలదిలో పద్యం వ్రాయమంటే ఎలాగో, ఆరోహణ అవరోహణక్రమంలో పుట్టే రాగ స్వరూపం తెలియకుండా పాడటం కూడా అంతే.
నవకోటి నారాయణుడుగా, లోభిగా ప్రసిద్ధుడైన వజ్రాల వ్యాపారికి భగవంతుడి గుణగణాలు గానంచేయాలనే బుద్ధి ఎలా కలిగింది? ఎందుకు కలిగింది? ఎక్కడపడితే అక్కడ హద్దూపద్దూలేకుండా ఇష్టంవచ్చినట్లు చిందులేస్తూ అల్లరిగా పాడకుండా నియమనిష్టలతో ఒక పద్ధతిగా సంగీతోపాసనామార్గాన్ని కనుగొని కర్ణాటక సంగీత పితామహుడై, పురందరదాసై మనకు ఆరాధ్యుడవ్వటాన్కి ఏమిటి కారణం. ఒకే ఒక కారణం నామ సంకీర్తనలోని విశేషమే. భజనచేసే మార్గం దొరకటమే.
పిళ్ళారి గీతాలతో విఘ్నేశ్వరునితో సంగీతయాత్ర ప్రారంభించాడు. మనం తీసే ఊపిరికో విడిచే ఊపిరికో అధిష్టాన దేవత విశే్నశ్వరుడే.
రోజూ మనం తీసేవి 24,600 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు.
ఇందులో వినాయకుడికి చెందేవి 600 శ్వాసలు..
వికట షట్ శత శ్వాసాధికార
విచిత్రాకార భక్తోపకార
అకళంక విబాస్వర విఘ్నేశ్వర
పురగురు గుహసోదర లంబోదర॥
మూలాధార చక్రవినాయక అనే కృతిలో వర్ణిస్తారు. దీక్షితర్ ‘లంబోదర లకుమికరా అంబాసుత అమర వినుత’అని సంగీతానికి అంకురార్పణ చేశాడు పురందరుడు.
పురందర దాసులవారు నిర్దేశించిన ప్రణాళికతో ప్రసిద్ధమైన కర్ణాటక సంగీతం విశ్వవ్యాప్తమై విద్వాంసులకు నీడనిస్తోంది. గాయకులకు ప్రాణాధారమైంది.
బ్రతుకు తెరువైంది.
భక్త్భివ సమన్విత గానానికి లక్ష్యం ఏర్పడింది.
శ్రద్ధ్భాక్తులతో ఏకాగ్రతతో, ఏ దేవతను ధ్యానిస్తూ గానంచేస్తామో, ఆయా దేవతలు అదృశ్యరూపంలో మనపక్కనే నిలబడి వింటారు. మనలోని నిజాయితీనిబట్టి అనుగ్రహిస్తారు.
సమర్పణాభావంతో పాడే పాటలోని ఆర్తిని గుర్తించి వరాలిస్తారు. ఈ సత్యాన్ని భక్తులైన వాగ్గేయకారులు ఋజువుచేశారు. ప్రాతఃస్మరణీయులయ్యారు.
ఈవేళ గానంచేసే ప్రతి గాయకుడికీ ఈ యోగం పట్టదు. నిశ్చలభక్తి, నిర్మలమైన మససు ఉండాలి.
స్వరరాగసుధా రస యుతభక్తి,
స్వర్ణాప వర్ణమురా మనసా అంటారు త్యాగయ్య. అపవర్ణమంటే మోక్షం. మోక్షం సంగతి దేవుడెరుగు. అసలు కష్టపడకుండా కనీస సంగీత జ్ఞానం లేకుండా కీర్తిప్రతిష్టలు రావాలనుకోవడం అత్యాశ. అందని ద్రాక్ష.