S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక నా గురించి..

మనిషికి చదువు, తెలివి, మనం, పట్టాలంటే తగిన వాతావరణం ఉండాలి. ఇంట్లో వాళ్లంతా ఒక రకంగా ఉంటూ పిల్లలను మాత్రం చదవండి అంటే వాళ్లకు అందులో రుచి కలగదు గాక కలగదు. కొన్ని కుటుంబాల సంగతి వేరు. బ్రాహ్మణులు అనగానే అందరూ దుమ్మెత్తి పోయడం బాగా నేర్చుకున్నారు. వాళ్లు వెనకటి ఏవో నేరాలు ఘోరాలు చేస్తే చేసి ఉండవచ్చు. కానీ మధ్యలో వాళ్లకు ఒక విషయం అర్థం అయింది. చదువు తప్పితే మన మనుగడకు మరొక మార్గం లేదు అన్నది ఆ జ్ఞానం.
కనుక బడిలో వేయవలసిన వయస్సు అన్న నిమిత్తం లేకుండా, సాయంత్రం అయ్యిందంటే చాలు, పిల్లలను అందరినీ ఒకచోట పోగేసి దీప ప్రార్థనతో మొదలుపెట్టి ఎనె్నన్నో విషయాలు చెప్పేవారు. ఆదివారం ఒకటి, సోమవారం రెండు ఇవన్నీ అంటూ తెలుగు వారముల పేళ్లు, అని బోధన సాగేది. మాసాలు, నక్షత్రాలు, నెలలు, నిత్య గ్రహచారం చూడడానికి అవసరమైన సంగతులు, పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు ఎనె్నన్నో నేర్పించేవారు. పిల్లలకు బడిలోకి వెళ్లకముందే కావలసినంత తెలిసి ఉండేది. అమరం, శబ్దకోశం, అప్పకవీయం ఇలాంటివన్నీ బడి వయసులోనే మాకు నోటికి వచ్చు అంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. వేసవి సెలవుల్లో బావగారు ఒకాయన మా ఊరికి వచ్చేవాడు. వాళ్లది మరింత పండిత వాతావరణం. ఆయన వచ్చినప్పటి నుంచి పద్యాలు అల్లడం, మాటల గారడీలు చేయడం అలాంటి పనులతో కాలం గడిచింది. అడవుల వెంట తిరగలేదు అని కాదు. బావులలో పడి ఈదలేదు అని కాదు. కానీ వాటికన్నా బుద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. సమస్యా పూరణలు దాకా వెళ్లిపోయాము. ఆషాఢ మాసే, వరిపిండి దోసే, కూర్చుండి మేసే అంటూ అప్పట్లో చెప్పిన శ్లోకాలు ఇవాళ్టికి నవ్వు తెప్పిస్తాయి.
ఇక కొంత తెలివి తెలిసిన తరువాత తీరు మరింత మారింది. విషయాలను అర్థం చేసుకోవడం గురించి ప్రయాస మొదలైంది. అప్పట్లో సైన్యంలో చేరిన ఒక బంధువు, మిత్రునికి పద్యాలతో ఉత్తరం రాయడం జ్ఞాపకం ఉంది. కనిపించిన పుస్తకం వదలకుండా చదివి వాటిలోని ఆనందాన్ని ఆస్వాదించండి బాగా అలవాటైంది. అప్పట్లోనే అనువాదాలు చేసి పత్రికలకు పంపడం గుర్తుంది. స్వంతంగా రాసిన ఒకటి, రెండు కవితలు పత్రికలో అచ్చయింది కూడా గుర్తుంది.
అయితే ఇప్పుడు సింహావలోకనంగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అదంతా ఛాదస్తం పద్ధతి అని అనిపిస్తున్నది. పెద్దవాళ్ల తీరు అలా ఉంది కనుక మా తీరు కూడా అలాగే కొనసాగింది. ఇంట్లోనే వసుచరిత్ర కావ్యం, విక్రమార్క చరిత్ర సంస్కృతంలో, గురుకుల పద్ధతిలో చదువుకున్నాము కనుక, మెదడు మొత్తం ఆ పద్ధతిలోనే ముందుకు సాగుతూ ఉండేది. నిజానికి అప్పట్లో పత్రికలు చదవడం అంతగా వీలుండేది కాదు. ప్రభుత్వం వారి లైబ్రరీలో వెళ్లి ఓ గంట సేపు కూర్చున్నా, పత్రికలు అంత సులభంగా దొరికేవి కావు. దొరికినవన్ని సంప్రదాయ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలే. కాలేజీలో, తెలుగు విజ్ఞాన సమితికి కన్వీనర్ ఎన్నిక అని పోటీ ఉటంకించి బ్రహ్మాండంగా మాట్లాడాను. ఒక ముసల్మాను మిత్రుడు, కదిలేదీ కదిలించేది, నిద్దుర వదిలించేదీ అంటూ ఆధునిక ధోరణిలో మాట్లాడాడు. అయినా నా మాటల తీరు బాగుంది కనుక మొదటి సంవత్సరం వాడినైనా మూడవ సంవత్సరం వాళ్లను పక్కన పెట్టి నన్ను ఎంపిక చేశారు. అప్పటికీ ఆధునిక సాహిత్యం గురించి అంతగా తెలియదు.
సరిగ్గా డిగ్రీలో ఉండగానే నవలలు చదవడం అలవాటు అయింది. విశ్వనాథ వారి నవలలతో బాటు ఎమెస్కో వారు చేసిన పుస్తకాలు కూడా చదవడం వ్యసనంగా మారింది. శరత్ సాహిత్యం కూడా అప్పుడే చదివాను. కావ్యాలలోని కల్పనా ప్రపంచంకన్నా, నిజమైన ప్రపంచం మరొకటి ఉన్నది అన్నది కళ్లకు కనిపించింది.
అక్కడి నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన తరువాత తీరు పూర్తిగా మారింది. వామపక్ష వాయువులు అక్కడ బలంగా తాకాయి. సైన్సు సాహిత్యం తలకెక్కింది. వాస్తవం అన్నది కళ్లకు కొత్త వెలుగులు అందించింది. అటువంటి అవగాహనకు బలమైన ప్రోత్సాహం ఇచ్చే పెద్ద వాళ్లతో పరిచయాలు పెరిగాయి. అట్లా మొదలయ్యే, ఇవాళ నన్ను కూడా సాహిత్యవేత్త అంటున్న కాలం వచ్చేసింది. చాదస్తం పూర్తిగా వదలలేదు. కావ్యాలు చదువుతున్నాను. వైష్ణవం గురించి మరెంతో చదివాను. కానీ అవి మనకు కావాల్సిన విషయం కాదు అన్న భావన మెదడులో గట్టిగా ఉంది. ప్రపంచాన్ని అవగాహన చేసుకుని, వాస్తవాలను తెలుసుకుని, వైజ్ఞానికంగా పథకాలను మార్గం దొరికింది. అందరినీ ఆ మార్గంలో నడిపించడాని కోసం, జనరంజక వైజ్ఞానిక సాహిత్యం అన్న పద్ధతిని జీవన మార్గంగా అవలంబించాడు. తెలుగులో సైన్సు రాసిన వారిని గురించి కనీసం రానున్న కాలంలో లెక్కపెట్టిన నాపేరును వదలడానికి మాత్రం ఉండదు.
సైన్స్ ఒకటే కాక సాహిత్య విమర్శ, సమీక్ష కూడా అలవాటయ్యాయి. పెద్దవాళ్లు కూడా నా అభిప్రాయాలకు గౌరవాన్ని ఇస్తున్నారు. మహామహుల రచనలను గురించి కూడా వ్యాఖ్యానాలు చేశాను అంటే ఆశ్చర్యం లేదు.
డిగ్రీలో ఉండగానే, గురువుగారు నాగం గోపాల్‌రెడ్డిగారు, తమకన్నా నాకు వ్యాకరణం, ఛందస్సు లాంటివి ఎక్కువగా వచ్చునని అందరి ముందూ చెప్పేశారు. ఈనాటి పద్య కవిత్వం రాయగలుగుతాను. కానీ రాయడం లేదు. నండూరి రామకృష్ణమాచార్యులు వంటి పరిపక్వ పద్య రచయితల చేత మెప్పు పొందిన నా పద్యం ఇంకా తెర వెనుకనే ఉండిపోయింది. మామూలుగా కూడా నేను కవిత్వం వైపు ఎక్కువగా వెళ్లలేదు. ఇతర భాషలు చదవలేని వారి కోసం అనువాదాలు మాత్రం బాగా చేశాను. అపరాధ పరిశోధనా సాహిత్యం కూడా లెక్కలేకుండా చదివాను.
పుస్తకాలు చదివితే తెలివి రాదు. కొన్ని విషయాలు తెలుస్తాయి అంతేకానీ, అవసరం వచ్చినప్పుడు గుర్తుకు రాకపోవచ్చు. తెలివి కలగాలంటే మనసులో మధనం జరగాలి. అందిన ప్రతి విషయాన్ని గురించి ఆలోచించగలగాలి. సంబంధం లేని అంశాలను కూడా కలిపి చూడగలగాలి.
తైత్తిరీయ ఉపనిషత్తులో భృగువల్లి అనే ఒక భాగం ఉంటుంది. అందులో పరబ్రహ్మ స్వరూపం గురించి తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఒక తంతు గురించిన వివరం ఉంటుంది. వరుణుడు తండ్రి, భృగువు కొడుకు. కొడుకు తండ్రి వద్దకు వెళ్లి పరబ్రహ్మము అనగా ఏమి అని అడుగుతాడు. నీకు నేను చెప్పాలా ఆలోచించి తెలుసుకోవచ్చు కదా అన్నాడు తండ్రి. సతపో తప్యత, అంటే నీవు ఆ విషయం గురించి ధ్యానము చేసి చింతించు అని అర్థం. కొడుకు ఆ పని చేస్తాడు. అన్నం పరబ్రహ్మం అన్న జవాబుతో తండ్రి ముందుకు వస్తాడు. ఆయన మరింత ఆలోచించమంటాడు. ఈసారి ప్రాణం పరబ్రహ్మం అని చెపుతాడు. మళ్లీ సతపో తప్యత. కొడుకు మళ్లీ ధ్యానం చేస్తాడు. ఈసారి మనసు అనగా పరబ్రహ్మము అన్న జవాబుతో వస్తాడు. తండ్రి చాలా అంటాడు. నాలుగవ అంశంగా విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అంటాడు కొడుకు. కాదయ్యా అంటాడు తండ్రి. చివరకు ఆనందం అన్నది పరబ్రహ్మము అని కొడుకు సూత్రీకరించాడు. తెలివి కూడా పరబ్రహ్మము కాదు. తెలివి తెలిసిన తరువాత విషయాలు అర్థం అయినప్పుడు కలిగే ఆనందం పరబ్రహ్మము.
ఇందులో మీకు ఎక్కడైనా సైన్స్ కనిపించిందా. నేను ఆ రుషి కుమారునికన్నా ఎక్కువగా మధనం చేసినట్టు ఉన్నాను. అన్నం అనగా సమస్త జీవరాశులు. జీవులన్నీ ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి అన్నం కాక తప్పదు. అన్నం అంటే వరి పండిన అన్నం మాత్రమే కాదు. ఈ విషయమే అర్థం కానప్పుడు ఇక మనం ముందుకు కదలడం కుదరదు. అన్నం అనగా జీవనం అన్నాము. ఈ అన్నానికి ఆధారం ఏమిటీ? దాన్ని నడిపిస్తున్న శక్తి ఏమీ? అది ప్రాణం. ప్రాణం కేవలం దానంతట అది జీవాన్ని నడిపించ కలుగుతుందా? ఆలోచించడానికి దానికి మనసు అవసరమా? ఇది తర్వాతి ప్రశ్న. మనస్సు అంటే మెదడు, బుద్ధి, జ్ఞానం, తెలివి, ఇవన్నీ ఇంకా కొన్ని. ఇప్పటికీ మళ్లీ మనం మన విషయంలోకి వచ్చేశాం. మనసులో ఉన్నది ఉన్నది. అది సమాచారాన్ని సేకరిస్తుంది. దొరికిన సమాచారాన్ని అన్వయించుకుంటూ ఉన్నది. విజ్ఞానంగా మార్చుకున్నది. విస్డం కోసం ప్రయత్నిస్తున్నది. కనుక విజ్ఞానం కూడా పరబ్రహ్మం కాదు. విషయాలను అర్థం చేసుకున్న సందర్భంలో, ఒక్కొక్కసారి అంతులేని ఆనందం కలుగుతుంది. ఆయనెవరో స్నానం చేస్తూ కిరీటం బరువు లెక్క తెలిసి తెలిసింది, తెలిసింది అంటూ వీధులలో పడి పరిగెత్తాడట. అదీ ఆనందం అంటే. అదే పరబ్రహ్మ. నేను ఈ విషయం గురించి చాలా పెద్ద సిద్ధాంతమే రాయదలుచుకున్నాను. ఇక్కడ చెప్పింది కేవలం సూత్రప్రాయంగా మాత్రమే.
రాత్రి తలుపులు పెట్టి పడుకున్నా సరే నిద్ర పట్టదు. అంతం లేకుండా ఆలోచనలు కొనసాగుతాయి. ఒక్కొక్కసారి ఒక చిన్న బల్బ్ వెలుగుతుంది. ఆ ఆలోచన మర్నాడు పొద్దుటి వరకూ ఉంటుంది, ఉండదు. కనుక వెంటనే లేచి ఓ కాగితం మీద నాలుగు ముక్కలు రాసుకోవాలి. ఆలోచించే వారి అందరి పరిస్థితి ఇలాగే ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను. ఆలోచించకుండా బతికేవారు సుఖం అనుకుంటారు. ఆలోచించే వారికి ఆనందం కలుగుతుంది. అందుకే వాళ్లు ఎన్ని చెప్పినా ఆలోచన మానరు. ఆలోచిస్తూనే ఉంటారు. సరికొత్త ఆలోచనలను అందిస్తూ ఉంటారు. సరికొత్త ఆలోచనలను అందిస్తూ ఉంటారు. చేతనైన వారు వాటిని అందుకుంటారు. లేదంటే పోనిమ్మని పక్కన పెడతారు. పత్రికలలో వచ్చే చింతనాత్మకమైన విషయాలను ఎంతమంది పట్టించుకుంటున్నారు అన్న ప్రశ్న మీకు నాకు పాత అనుభవమే. మామూలుగా కథ చెబితే, అందరూ చదువుతారు. ఆలోచింపజేసే, ఓపిక గలవారు మాత్రమే చదువుతారు. చదివిన వారు కూడా జవాబు కోసం వెతకరు. అందుకే పత్రికల వారు పోటీలు పెడతారు. అతను పూజించిన వారికి బహుమతి ఇస్తామన్నారు. అయినా చాలామంది కాగలరు. తెలివి ఒక్కరి సొత్తు కాదు. కానీ అందరి సొత్తు కూడా కాడు.
కొన్ని విషయాలు చెబుతుంటే, చెప్పే మనిషికి అసంతృప్తిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది. కానీ తోచిన విషయం చెప్పక తప్పదు. లేదంటే అదేదో సినిమాలో లాగా కడుపు ఉబ్బుతుంది. చెప్పకపోతే అసలు తోచదు. కనుకనే ఇటువంటి విషయాల గురించి రాయడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఆగడం కుదరదు. అది నిజంగా ఆగడంగా ఉంటుంది. ఒకే మాటకు రెండు అర్థాలు. అర్థం చేసుకునే వారికి అది ఆనందం. నేను వారికి చికాకు. ఈ సోది ఎక్కడో ఓ చోట ఆగాలి కాబట్టి, ఇక్కడ ఆపుదాం.

-కె.బి.గోపాలం