S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేను.. వసుధ హితాన్ని

నేను
కాలచక్ర ధ్యానబోధిని
బుద్ధగయ అతులిత స్థితిని
హృదయకుహర దివ్య ఆరామాన్ని
అఖండ ప్రవిమల మానవ ధర్మాన్ని
ధార్మిక చింతనా సంఘటిత జీవనాన్ని.
-2-
నేను
అభిమతాన్ని.. కాను, మతాన్ని
సమత్వాన్ని.. కాను, దురాచారాన్ని
జ్ఞానిని.. ఎదురీత నేర్చిన జీవిని
ధ్యానాన్ని.. జీవన అంతర్వాహినిని
అనే్వషిని.. తాపసిక వౌన వలయాన్ని.
-3-
నేను
కాలగమనికను
జనన మరణాల మనసెరిగినవాడను
అనారోగ్య వార్ధక్యతల పస తెలిసినవాడను
ప్రాపంచికతను నిలువరించిన నిబ్బరున్ని
మానవతన భోగభాగ్యాల వైరాగ్యాన్ని.
-4-
నేను
పద్మవన ధ్యాన మందిరాన్ని
జీవితం సంధించిన సిద్ధాస్త్రాన్ని
హృదయ కుహరాన మనసు మగ్నతను
అంతఃపుర అంతర్యాన వౌనధ్యాసను
అంతరింద్రియ మానసాతీత మహాబోధను.
-5-
నేను
ధ్యాన జీవన భిక్షాపాత్రను
గతాన్ని వీడిన జ్ఞాననిష్ఠను
శ్వాసను విస్మరించిన దివ్యధారను
భావం అభావమైన శూన్యాకాశాన్ని
రూప గుణ రస రహిత ఆవలి తీరాన్ని.

-6-
నేను
వసివాడని హృదయపద్మాన్ని
మహాశూన్యాన నిలచిన ఆజ్ఞ్ఛాత్రాన్ని
మృత్యువును లెక్కించని సత్యావిష్కారాన్ని
శూన్య గగనాన జాగృతమైన ధ్యానజగత్తును
ఉపవాసాన్ని నిశ్వసించిన బుద్ధ దేహాన్ని.
-7-
నేను
అనాత్మ బౌద్ధాన్ని
అణు కణ విశ్వాన్ని
వెన్నంటిన శరీర ధర్మాన్ని
అస్పృశ్యతకు స్వస్తిపదాన్ని
కులమతాలు సోకని జ్ఞానపథాన్ని.
-8-
నేను
ఆరాటపడని అవగాహనను
ద్వేషాన్ని తునిమిన ప్రేమను
క్రౌర్యాన్ని కరిగించిన కరుణను
అజ్ఞానాన్ని దర్శించిన తేజస్సును
అంధకారాన్ని తొలగించిన స్వేచ్ఛను.
-9-
నేను
వినిర్మల జనపథాన్ని
బోధివృక్ష నీడన ఏకాకిని
విప్పారిన ప్రబోధముఖాన్ని
అష్టాంగ జీవన దృక్సూచిని
ఫలాపేక్ష నాశించని ధర్మాన్ని.
-10-
నేను
సమ్యక్ మార్గాన్ని
సహనసమాజ మథనాన్ని
యశోవిభూతి కాని మానవ హితాన్ని
మాదకతను నిషేధించిన అహింసావ్రతాన్ని
సమజీవన రహస్యమెరిగిన సహజ మార్గాన్ని.
-11-
నేను
దమ్మపదాన్ని
వజ్రనికాయాన్ని
సంఘీభావాన్ని
బౌద్ధ విహారాన్ని
త్రిశరణ ఆరామాన్ని.
-12-
నేను
ధర్మాన్ని
బౌద్ధాన్ని
సంఘ ధర్మాన్ని
బౌద్ధ సంఘాన్ని
వసుధహిత బౌద్ధాన్ని.

-విశ్వర్షి 93939 33946